నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 18 ఎపిసోడ్ లో.. అత్తయ్య మీరు దేవతలా కనిపిస్తున్నారు. ఈ కేక్ తినండని శ్రుతి లోపలికి వెళ్లి బాధపడుతున్నట్లు కూర్చుంటుంది. రాజ్ వచ్చి కేక్ కట్ చేద్దామంటే, కేక్ లేదుగా మీ అమ్మ తినేసిందని శ్రుతి చెప్తుంది. అమ్మా కేక్ ఎందుకు తిన్నావని రాజ్ అడుగుతాడు. తల్లిపై మండిపడతాడు.
రాజ్ కు దెబ్బ

రూ.1000 కేక్ అది. మొత్తం తినేశావా? వాలెంటైన్స్ డే అని కేక్ తెచ్చా. ఏం తల్లివే నువ్వు అని రాజ్ అంటాడు. రాజ్ ను సరోజ కొడుతుంది. కేక్ మొత్తం అదే తిని, చిన్న ముక్క ఇచ్చి అత్తయ్య అని ప్రేమ ఒలకబోసిందని సరోజ చెప్తుంది. శ్రుతిని ఏం చేయలేమని రాజ్, సరోజ అనుకుంటారు.
తల్లిదండ్రుల బాధ
క్రాంతి అలా చేస్తాడని ఊహించలేదు. శాలిని పశ్చాత్తాపంతో తప్పులను సరిద్దిద్దుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ క్రాంతి కోపం తగ్గడం లేదని జగదీశ్వరితో రఘురాం అంటాడు. శాలిని చేయకూడని పనులన్నీ చేసి వాడిని, మనల్ని చాలా ఇబ్బందులు పెట్టింది. విరాట్, చంద్రల మధ్య ఏ ప్రాబ్లం లేదు. క్రాంతి జీవితంలోనే సుడిగుండం ఉందని మనకు తెలిసింది. క్రాంతి కోపం ఎప్పుడు చల్లారుతుందో తెలియడం లేదని జగదీశ్వరి బాధ పడుతుంది.
కలిపే ప్లాన్
అది చిన్న తప్పు కాదు కదా అత్తయ్య. క్రాంతి అంత ఈజీగా శాలినిని క్షమించలేడు. శాలినికి చాలా సార్లు చెప్పినా మారలేదు. క్రాంతికి తెలిశాక రియలైజ్ అయింది. శాలినిపై క్రాంతికి కోపం తగ్గలాంటే, ఆమె మారిందని అతనికి తెలిసి రావాలి. వాళ్ల ఇద్దరి మధ్య స్పేస్ తగ్గించేలా మనమే చేయాలని చంద్రకళ చెప్తుంది. వాళ్లను దగ్గరగా ఉంచాలని శ్యామల అంటుంది.
క్రాంతి రివేంజ్
క్రాంతి లైట్ వేసుకోకుండా చీకట్లో గదిలో కూర్చుంటాడు. శాలిని వచ్చి లైట్ వేస్తే సీరియస్ అవుతాడు. భరించలేను అనుకున్నప్పుడు నాతో ఉండటం ఎందుకు? పగ కోసం ఏమైనా చేసే క్యారెక్టర్ నీది. వెళ్లి మీ అమ్మ లిస్ట్ లో ఇంకా ఎవరైనా ఉన్నారేమో కనుక్కొని వాళ్లపై పగ తీర్చుకోమ్మని క్రాంతి అంటాడు. నీ మీద నా ప్రేమ నిజమని శాలిని ఏడుస్తుంది. నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు మారవని నాకు తెలుసు. నిన్ను కొంచెం కొంచెంగా చంపుతా. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉందని క్రాంతి బయటకు వెళ్లిపోతాడు.
ఫస్ట్ నైట్
{{/usCountry}}క్రాంతి లైట్ వేసుకోకుండా చీకట్లో గదిలో కూర్చుంటాడు. శాలిని వచ్చి లైట్ వేస్తే సీరియస్ అవుతాడు. భరించలేను అనుకున్నప్పుడు నాతో ఉండటం ఎందుకు? పగ కోసం ఏమైనా చేసే క్యారెక్టర్ నీది. వెళ్లి మీ అమ్మ లిస్ట్ లో ఇంకా ఎవరైనా ఉన్నారేమో కనుక్కొని వాళ్లపై పగ తీర్చుకోమ్మని క్రాంతి అంటాడు. నీ మీద నా ప్రేమ నిజమని శాలిని ఏడుస్తుంది. నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు మారవని నాకు తెలుసు. నిన్ను కొంచెం కొంచెంగా చంపుతా. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉందని క్రాంతి బయటకు వెళ్లిపోతాడు.
ఫస్ట్ నైట్
{{/usCountry}}చంద్రకు విరాట్ ఓ పేపర్ ఇస్తాడు. తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని, జువెలరీ కాస్త తక్కువ ఉండేలా చూసుకుని, రాత్రి 8 గంటల్లోపు గదిలో ఉండాలి, ఇది ఈ రోజు నుంచి అమలు చేయాలని ఆ పేపర్ పై విరాట్ రాస్తాడు. మ్యారేజ్ అయిన నైట్ ను ఏమంటారని విరాట్ అడిగితే, మ్యారేజ్ నైట్ అని చంద్ర చెప్తుంది. దాన్ని ఫస్ట్ నైట్ అని అంటారని విరాట్ చెప్తాడు. నాకు తెలుసని చంద్ర ఆటపట్టిస్తుంది.
హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయమంటావా అని చంద్రను విరాట్ అడుగుతాడు. దానికి ఇంకా టైమ్ ఉందని చంద్ర చెప్తుంది. ఈ రోజు కార్యం జరగాల్సిందేనని చంద్రకు ముద్దు పెట్టి విరాట్ వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న జగదీశ్వరి వీళ్లకు ఇంకా శోభనం జరగలేదా అనుకుంటుంది.
విరాట్, చంద్రలు ఇప్పటివరకూ ఒకటవ్వలేదంటా అని జగదీశ్వరి, రఘురాం, కామాక్షికి శ్యామల చెప్తుంది. ఇంట్లో సమస్యలు తీరేవరకు వాళ్లు సంతోషాలు త్యాగం చేశారని మాట్లాడుకుంటారు. ఈ కార్యం పద్ధతిగా చేయాలని అనుకుంటారు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.