నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 26 ఎపిసోడ్ లో.. రఘురాం ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేద్దామని తల్లి సునందకు శాలిని చెప్తుంది. రేపు విరాట్, చంద్రలకు జరిగే ఫస్ట్ నైట్ ఆపాలి. దాని కోసం నేను ప్లాన్ ఆలోచించి పెట్టానని తల్లికి శాలిని ఓ ప్లాన్ చెప్తుంది.
తేజు దగ్గరకు

పార్క్ లో అర్జున్, తేజు ఆడుకుంటున్నారు. అమ్మ ఎందుకు రాలేదని అర్జున్ ను తేజు అడుగుతుంది. అమ్మ గురించి ఆడగకపోతే తేజుతో ఆడుకుంటానని అర్జున్ చెప్తాడు. అప్పుడే పార్కులోకి తల్లితో కలిసి వచ్చిన శాలిని.. అర్జున్, తేజును చూపిస్తుంది. అర్జున్ కు కాల్ రావడంతో పక్కకు వెళ్తాడు. తేజు దగ్గరకు సునంద వెళ్తుంది.
చంద్ర గురించి చెప్పిన సునంద
మీ అమ్మ రాలేదా? అని తేజును సునంద అడుగుతుంది. మీ అమ్మ పేరు ఏంటీ? అని తేజును అడిగితే, చంద్రకళ అని చెప్తుంది. అప్పుడే ఫోన్ లో ఈవిడే నాకు తెలిసిన చంద్రకళ అని ఫొటోను సునంద చూపిస్తుంది. చంద్రకళ హస్బెండ్ కూడా నాకు తెలుసు అని విరాట్ ఫొటోను సునంద చూపిస్తుంది. వీళ్లిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని, నీ కన్ఫ్యూజన్ క్లియర్ కావాలంటే మీ నాన్నను అడుగు అని చెప్పి సునంద వెళ్లిపోతుంది.
పాప హెల్త్ డిస్టబ్ అయితే చంద్ర డిస్టబ్ అవుతుంది. ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అవుతుంది. పాప ప్రాణాలు పోతే చంద్ర కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని శాలిని సైకోలా అంటుంది.
విరాట్ ఆరాటం
{{/usCountry}}పాప హెల్త్ డిస్టబ్ అయితే చంద్ర డిస్టబ్ అవుతుంది. ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అవుతుంది. పాప ప్రాణాలు పోతే చంద్ర కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని శాలిని సైకోలా అంటుంది.
విరాట్ ఆరాటం
{{/usCountry}}మరోవైపు ఫస్ట్ నైట్ కోసం విరాట్ తెగ తొందరపడతాడు. కానీ ఇది మధ్యాహ్నం రాత్రి కాదు అని చంద్ర నో చెప్తుంది. విరాట్, చంద్ర తెలుగు గ్రాంథికంలో రాజు, రాణిలాగా మాట్లాడుకుంటారు. బయట నుంచి శ్యామల, జగదీశ్వరి ఈ మాటలు వింటూ నవ్వుకుంటారు.
శ్యామల, జగదీశ్వరి లోపలికి వచ్చి సెటైర్లు వేస్తారు. ఈ రోజు నా కోడలికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావని విరాట్ ను జగదీశ్వరి అడుగుతుంది. గిఫ్ట్ తీసుకొస్తానని విరాట్ బయటకు వెళ్తాడు.
అప్పు కోసం
రాజ్ దగ్గర అప్పు వసూలు చేయడానికి అప్పారావు వస్తాడు. నీ కొడుకును బయటకు రమ్మని సరోజాను అడుగుతాడు. కొడుకు లేడని తల్లి చెప్తే, ఇంట్లో ఉన్నాడని శాలిని ఇరికిస్తుంది. అత్తగారు బంగారు మూట తెచ్చారని డబ్బులు ఇవ్వమని అప్పారావు అడుగుతాడు. అప్పుడు మూట తెచ్చి భస్మాన్ని అప్పారావు ముఖానికి రాజ్ కొడతాడు.
చంద్ర షాక్
విరాట్ కోసం చంద్ర వెయిట్ చేస్తుంటుంది. అప్పుడే తేజును తీసుకుని అర్జున్ రావడంతో అందరూ షాక్ అవుతారు. ఇది మా బాస్ ఇల్లు, వీళ్లంతా మా బాస్ ఫ్యామిలీ అని తేజుతో చంద్ర చెప్తుంది.
చాలమ్మా ఇంకా అబద్దాలు చెప్పొద్దు. నువ్వు నాకు అమ్మవి కావని తెలిసిపోయింది. విరాట్ అంకుల్ నీ బాస్ కాదు నీ హస్బెండ్. వీళ్లంతా నీ ఫ్యామిలీ మెంబర్స్. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. ఎందుకు నాకు అమ్మాలా యాక్ట్ చేశావని తేజు ఏడుస్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.