నిన్ను కోరి టుడే ఫిబ్రవరి 3 ఎపిసోడ్ లో క్రాంతికి మళ్లీ నా మీద నెగెటివ్ ఇంప్రెషన్ రాకుండా చూసుకోవాలని చంద్రతో విరాట్ అంటాడు. కింద పడ్డ ఫైల్స్ తీయబోతూ చంద్ర, విరాట్ తలలు ఢీకొట్టుకుంటారు. ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి ఇంకోసారి రిపీట్ చేయాలని విరాట్ ను గుద్దుతుంది చంద్ర.
చిన్నపిల్లల్లా

డోర్ బయటే ఉన్న శ్యామల విరాట్ ను పిలుస్తుంది. లోపల మీరిద్దరు ఏదో మాట్లాకుంటున్నారు. భూమి పూజకు ఎల్లుండి బాగుంది. గొడవలు పడితే పడ్డారు కానీ చిన్నపిల్లల్లా కొట్టుకోకండని చెప్పి శ్యామల వెళ్లిపోతుంది. ఫోన్లో చూస్తూ తేజు చెప్పినట్లుగా అర్జున్ వంట చేస్తాడు. అప్పుడే చంద్ర వస్తుంది.
భూమి పూజ
స్టవ్ వెలిగించకుండానే వంట చేస్తున్నారని చంద్ర చెప్తుంది. పాప కోసం నేనే వంట చేస్తానని చంద్రకళ అంటుంది. నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని అర్జున్ అంటాడు. ఈ రోజు పాపను స్పెషలిస్ట్ డాక్టర్ కు చూపిస్తానని అర్జున్ చెప్తాడు. మా ఆయన వెంచర్ కు రేపు భూమి పూజ, మీరు తప్పకుండా రావాలని అర్జున్ కు చెప్తుంది చంద్ర.
బిచ్చగాడి సాయంతో
మరోవైపు ఇంట్లో ఉన్న శ్రుతి హెల్ప్ కోసం చూస్తుంది. అప్పుడే ఓ బిచ్చగాడు వస్తాడు. ఎందుకు లోపల ఉంచి తాళం వేశారని అడుగుతుంది. బాబాయ్, నేను ఈ ఇంటి ఆయన భార్యను. తాళం వేసి మా ఆయన మార్కెట్ కు వెళ్లిపోయారు. ఓ సారి తాళం పగలగొట్టవా? నీకు చికెన్ కర్రీ వండి పెడతా బాబాయి అని శ్రుతి అడుగుతుంది. బాబాయి అనే మాటకైనా తాళం పగలగొట్టాలని ఆ బిచ్చగాడు తాళం పగలగొడతాడు.
డబ్బు డిమాండ్
శాలిని హాస్పిటల్ కు వెళ్తుంది. ఏంటి సడెన్ గా రమ్మని కాల్ చేశారని శాలిని అడుగుతుంది. నేనో విల్లా కొందామని ప్లాన్ చేస్తున్నా. సిటీ సెంటర్ లో చాలా బాగుంది. దానికి రూ.50 లక్షలు తక్కువ పడుతున్నాయి. అవి నిన్ను అడుగుదామని అనుకున్నానని డాక్టర్ చెప్తుంది. అప్పు తీసుకుంటే సరిపోదు రెండు శాతం ఇంట్రెస్ట్ ఇవ్వాలని శాలిని అంటుంది.
నిజం చెప్పేస్తానని
{{/usCountry}}శాలిని హాస్పిటల్ కు వెళ్తుంది. ఏంటి సడెన్ గా రమ్మని కాల్ చేశారని శాలిని అడుగుతుంది. నేనో విల్లా కొందామని ప్లాన్ చేస్తున్నా. సిటీ సెంటర్ లో చాలా బాగుంది. దానికి రూ.50 లక్షలు తక్కువ పడుతున్నాయి. అవి నిన్ను అడుగుదామని అనుకున్నానని డాక్టర్ చెప్తుంది. అప్పు తీసుకుంటే సరిపోదు రెండు శాతం ఇంట్రెస్ట్ ఇవ్వాలని శాలిని అంటుంది.
నిజం చెప్పేస్తానని
{{/usCountry}}అప్పు ఏంటీ? మళ్లీ తిరిగి ఇస్తానని ఊహించకు. మీ బావ కొత్త వెంచర్ లో కార్నర్ ఫ్లాట్ నా పేరు మీద బుక్ చేసి అడ్వాన్స్ పే చేయి. నీ ప్రెగ్నెన్సీ డ్రామా బయటపడుతుందని ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలుసు. కానీ కాపాడిందే నేను. మీ ఇంట్లోవాళ్లను మోసం చేశావని తెలిస్తే నీ పరిస్థితేంటో ఆలోచించమని డాక్టర్ చెప్తుంది. ఏంటీ బెదిరిస్తున్నావా? ఆల్రెడీ రూ.10 లక్షలు ఇచ్చాను కదా అని శాలిని అంటుంది. ఈ సీక్రెట్ విలువ నీ లైఫ్ శాలిని. ఆ సీక్రెట్ బయటకు రావొద్దంటే నేను కోరుకున్నది నాకు దక్కాలని డాక్టర్ అంటుంది.
వెంటనే డాక్టర్ గొంతు మీద శాలిని కత్తి పెడుతుంది. నాకు సాయం చేశావనే కన్సర్న్, సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని వదిలేస్తున్నా. లేదంటే ప్రాణాలు గాల్లో కలుస్తాయని బెదిరించి శాలిని వెళ్లిపోతుంది.
తేజు ఆడుకుంటూ
అదే హాస్పిటల్ కు తేజును తీసుకుని అర్జున్, చంద్ర వస్తారు. విరాట్ కాల్ చేస్తే పాపను జనరల్ చెకప్ కు తీసుకొచ్చానని చంద్ర చెప్తుంది. రొమాంటిక్ గా మాట్లాడతాడు విరాట్. కామాక్షి చూస్తుందని టోన్ ఛేంజ్ చేస్తాడు. తేజు బాల్ తో ఆడుకుంటూ వెళ్లి శాలిని ముందు పడిపోతుంది. మీ పేరెంట్స్ ఎక్కడా? అని శాలిని అడుగుతుంది. వాళ్ల దగ్గరకు తీసుకెళ్తానని అంటుంది.
వాళ్లే మా అమ్మానాన్న అని చంద్రకళ, అర్జున్ ను చూపిస్తుంది తేజు. దీంతో శాలిని షాక్ అవుతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.