నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 22 ఎపిసోడ్ లో టాబ్లెట్స్ గురించి అందరికీ చెప్తాడు క్రాంతి. శాలిని ఈ టాబ్లెట్స్ వాడి అన్నయ్యను కోలుకోకుండా చేసిందా అని క్రాంతిని శ్యామల అడుగుతుంది. అదే తెలియదంటున్నాడు కదా. కన్ఫామ్ చేసి మాట్లాడకు అని కామాక్షి అంటుంది. శాలిని తప్పు చేసి ఉంటే చంద్రపై నిందలు వేసిన వాళ్లమవుతామని శ్యామల అంటుంది.
క్రాంతి ఫైర్

ఈ మాత్రలు చంద్రకళనే శాలిని లాకర్లో పెట్టొచ్చు కదా అని కామాక్షి అంటుంది. ఈ మ్యాటర్ లో ఎవరూ ఇన్వాల్వ్ కావొద్దు. క్రాంతి, శాలిని మాట్లాడుకుంటారని విరాట్ చెప్తాడు. అప్పుడే శాలిని వచ్చి ఏమైందని అడుగుతుంది. టాబ్లెట్స్ చూసి శాలిని షాక్ అవుతుంది. ఏంటీ ఈ టాబ్లెట్స్ అని కంగారుగా అడుగుతుంది శాలిని. చెప్పు శాలిని ఈ టాబ్లెట్స్ మన సీక్రెట్ లాకర్ లో ఎందుకు ఉన్నాయని క్రాంతి అడుగుతాడు.
శాలిని అబద్దం
ఇవి స్ట్రెస్ రిలీఫ్ టాబ్లెట్స్ అని శాలిని అబద్దం చెప్తుంది. ఇవి మనిషి మెమోరీని ఎరేజ్ చేసే టాబ్లెట్స్. చెప్పు శాలిని ఇవి మన సీక్రెట్ లాకర్ లో ఎందుకు ఉన్నాయని క్రాంతి అడుగుతాడు. ఇవి నిజంగా మా అన్నయ్య మీద ప్రయోగించడానికే తెప్పించావా అని శ్యామల అడుగుతుంది. నువ్వు నాతో ప్రేమగా నటించి మోసం చేశావు.
అంటే వినాయక చవితి రోజు నాన్నను తల మీద కొట్టింది నువ్వేనన్న మాట. నువ్వు చేసినవన్ని చంద్ర వదిన మీద నెట్టేశావు. నా మీద ప్రేమ లేదు. మీ అమ్మ కోసం ఇంటి మీద పగతో నా లైఫ్ లోకి వచ్చావు. నేనే అవకాశమిచ్చా. నన్ను క్షమించు నాన్న అని క్రాంతి ఏడుస్తాడు.
ఎమోషనల్ డ్రామా
తప్పు ఎవరిదో తెలిసిన రోజు వాళ్లు మా ఇంటి గుమ్మానికి వేలాడుతారని ముందే చెప్పా శాలిని. నిజం చెప్పు అని జగదీశ్వరి అడుగుతుంది. నిజంగా క్రాంతి నేను తప్పు చేశానని నమ్మితే మీరు చంపాల్సిన అవసరం లేదు. నేను చచ్చిపోతా. ఈ టాబ్లెట్స్ వాడింది నేనే. బిడ్డ పుడుతుందనే కల కొందరి స్వార్థానికి బలైపోయింది. ఆ జ్ణాపకాలు పోవాలని టాబ్లెట్స్ తెప్పించా. ఇలాగే వాడితే అందరినీ మర్చిపోతానని ఆపేశానని శాలిని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది.
సారీ చెప్పిన క్రాంతి
{{/usCountry}}తప్పు ఎవరిదో తెలిసిన రోజు వాళ్లు మా ఇంటి గుమ్మానికి వేలాడుతారని ముందే చెప్పా శాలిని. నిజం చెప్పు అని జగదీశ్వరి అడుగుతుంది. నిజంగా క్రాంతి నేను తప్పు చేశానని నమ్మితే మీరు చంపాల్సిన అవసరం లేదు. నేను చచ్చిపోతా. ఈ టాబ్లెట్స్ వాడింది నేనే. బిడ్డ పుడుతుందనే కల కొందరి స్వార్థానికి బలైపోయింది. ఆ జ్ణాపకాలు పోవాలని టాబ్లెట్స్ తెప్పించా. ఇలాగే వాడితే అందరినీ మర్చిపోతానని ఆపేశానని శాలిని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది.
సారీ చెప్పిన క్రాంతి
{{/usCountry}}సారీ శాలిని, నువ్వు ఏ తప్పు చేయలేదని క్రాంతి నమ్మేస్తాడు. రూమ్ లోకి వెళ్లాక గెస్ట్ హౌజ్ కు ఎందుకు రాలేదని విరాట్ ను చంద్ర, ప్రకాష్ అడుగుతారు. అప్పుడు జరిగింది చెప్తాడు విరాట్. వాడు శాలిని గురించి తెలిస్తే చచ్చిపోతాడు చంద్ర అని విరాట్ చెప్తాడు. క్రాంతిని ముందు ప్రిపేర్ చేయాలి. మెల్లమెల్లగా మార్చాలి. ఒకేసారి నిజం తెలిసినా ప్రమాదమేనని చంద్ర అంటుంది.
రాజ్ షాక్
అమెరికా నుంచి అర్జెంట్ సర్జరీ అని ఫోన్ వచ్చిందని చెప్పి వెళ్లిపోమ్మని అర్జున్ కు చంద్ర చెప్తుంది. నా బలం, బలహీనత రెండు నువ్వే బావ అని హగ్ చేసుకుంటుంది చంద్ర. మరోవైపు తాళం పగలగొట్టమని రాజ్ కు చెప్తుంది సరోజా. కొడుకును తిడుతుంది. అప్పుడే షాపింగ్ బ్యాగ్ లతో శ్రుతి వస్తుంది. హోటల్, పార్లర్, సినిమా, షాపింగ్ కు వెళ్లానని, నీ వారం రోజుల కలెక్షన్ అయిపోయిందని శ్రుతి షాక్ ఇస్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.