నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 27 ఎపిసోడ్ లో మినిస్టర్ పీఏతో మాట్లాడినట్లు చంద్రకళతో ఫోన్లో మాట్లాడుతూ డ్రామా ప్లే చేస్తాడు విరాట్. దీంతో విరాట్ కు క్రాంతి సారీ చెప్తాడు. అన్నదమ్ములు సంతోషంగా నవ్వుతూ ఉండటం శాలిని తట్టుకోలేకోతుంది.
టార్చర్ పెంచమన్న కామాక్షి

నిన్ను అత్తారింట్లో దిగబెట్టి వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డా. కానీ ఇప్పుడు నువ్వే రివర్స్ లో టార్చర్ పెడుతున్నావని వింటే చాలా సంతోషంగా ఉంది. తాళి కట్టుంచుకునే ముందే నా మాట వింటే పూరి గుడిసెలో పడేదానివి కాదు కదా. ఇంటికి వెళ్లాక టార్చర్ పెంచు. ఈ పెళ్లాం నాకు వద్దు అని మామయ్య కాళ్ల మీద జల రాజ్ వచ్చి పడాలని శ్రుతికి కామాక్షి చెప్తుంది. ఈ మాటలు వింటున్న రాజ్ ను చూస్తుంది కామాక్షి.
చంద్రకు థ్యాంక్స్
అందుకే పండగ రోజు ఉదయం కళ్లాపి చల్లి అన్ని పనులు చేసిన వాళ్లకు శ్యామల రూ.లక్ష ఇస్తుందని చెప్తుంది. ఆ పనులన్నీ నేనే చేసి రూ.లక్ష కొట్టేస్తానని రాజ్ అనుకుంటాడు. విరాట్ డోర్ వేసి వచ్చి థ్యాంక్స్ చంద్రకళ అని ఎత్తుకుని తిప్పేస్తాడు. ఈ క్రెడిట్ నీదే డార్లింగ్. మినిస్టర్ పీఏలా ఫోన్ చేశావు కాబట్టి సరిపోయింది లేదంటే దొరికిపోయేవాళ్లమని విరాట్ అంటాడు. శాలిని గెలవనివ్వనని చంద్ర అంటుంది.
విరాట్ ముద్దు
క్రాంతిని మానిప్యులేట్ చేయడానికి శాలిని ట్రై చేసిందని విరాట్ అంటాడు. ఈ ప్లాన్ చేసింది నువ్వే కదా బావ. నువ్వు దారి చూపించావు. నేను దూసుకెళ్లిపోతున్నానని చంద్ర అంటుంది. మధ్యలో ఈ దూరం ఎందుకు? దగ్గరకు రావొచ్చు కదా అని విరాట్ అంటాడు. గిఫ్ట్ కావాలని చంద్ర అడిగితే, విరాట్ ముద్దు పెడతాడు.
శాలిని వర్సెస్ చంద్ర
{{/usCountry}}క్రాంతిని మానిప్యులేట్ చేయడానికి శాలిని ట్రై చేసిందని విరాట్ అంటాడు. ఈ ప్లాన్ చేసింది నువ్వే కదా బావ. నువ్వు దారి చూపించావు. నేను దూసుకెళ్లిపోతున్నానని చంద్ర అంటుంది. మధ్యలో ఈ దూరం ఎందుకు? దగ్గరకు రావొచ్చు కదా అని విరాట్ అంటాడు. గిఫ్ట్ కావాలని చంద్ర అడిగితే, విరాట్ ముద్దు పెడతాడు.
శాలిని వర్సెస్ చంద్ర
{{/usCountry}}కిచెన్ లో క్లీన్ చేస్తున్న చంద్ర దగ్గరకు శాలిని వచ్చి చాలా పెద్ద ప్లాన్ వేశారని అంటుంది. నా గురించి తెలిసేలా చేయాలని నువ్వు, బావ స్కెచ్ వేశారన్నమాట. అంతా పక్కా ప్లాన్ చేసి మీరు ఏం చేయగలిగారు? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి జరగవు. ట్యాబ్లెట్స్ దగ్గర కూడా క్రాంతిని డైవర్ట్ చేశా. నా తెలివితేటల ముందు మీరు గెలవరు చంద్ర అని శాలిని అంటుంది.
గెలిచాం కదా శాలిని. క్రాంతి నమ్మకాన్ని మేం పొందాం కదా అదే మా గెలుపు. మేం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. నువ్వు ఊహించనివి జరుగుతాయి శాలిని. నీ కుట్రల నుంచి ఇంటిని కాపాడుతూనే ఉంటాం. క్రాంతి గురించి ఆలోచించి బావ వెనక్కి తగ్గాడని వార్నింగ్ ఇస్తుంది చంద్ర.
అర్జున్ కాల్
పొద్దున రాజ్, శ్రుతిని చూసి చూడముచ్చటగా ఉన్నారిద్దరూ అని రఘురాం అంటాడు. పండగ రోజు పూజ కోసం రెడీ అయిన విరాట్, చంద్ర రొమాన్స్ చేస్తారు. అప్పుడే అర్జున్ కాల్ చేసి పాప చాలా ఇబ్బంది పెడుతోంది. అమ్మ కోసం పాప అడుగుతుంది. ఒక్కసారి మీరు ఇంటికి రాగలరా? అని చంద్రను అడుగుతాడు. సరేనని చంద్ర చెప్తుంది.
నువ్వు పాప గురించి ఆలోచిస్తున్నావు. నేను నీ గురించి ఆలోచిస్తున్నా. పండగ రోజు ఆఫీస్ ఏంటి? అని తలో మాట అంటారు. వేరే వాళ్ల సమస్య గురించి ఆలోచిస్తే మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందని విరాట్ సీరియస్ అవుతాడు. పాప బాధ చూపి అమ్మలా దగ్గరయ్యా. నేను వెళ్లకపోతే పాప ఆరోగ్యం పాడవుతుందని చంద్ర అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.