...
...
Next Story

Ninnu Kori March 18 Episode: శాలిని ఎమోషనల్ డ్రామా..క్రాంతిని బుట్టలో వేసుకునేందుకు కొత్త ప్లాన్.. మాయకు చంద్ర వార్నింగ్

Ninnu Kori March 18 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 18 ఎపిసోడ్ లో మాయపై చంద్రకళ సీరియస్ అవుతుంది. శాలినికి మాయతో సారీ చెప్పిస్తుంది. శాలినికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వనని క్రాంతి అంటాడు. కారు తోసుకుంటూ వచ్చినందుకు రూ.2 వేలు ఇవ్వమని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.

Published on: Mar 18, 2026, 07:58:53 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 18 ఎపిసోడ్ లో.. నిన్న గాక మొన్న వచ్చిన మాయ కూడా నా తప్పులను ఎత్తిచూపుతోంది. బయట వాళ్ల మాటలను కూడా పడాలా? పాత గాయాలను రేపుతుంటే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నాలో నేను బాధపడుతున్నానని అందరి ముందు శాలిని ఎమోషనల్ డ్రామా ఆడుతుంది.

ట్రాఫిక్ పోలీసులు

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

గెస్ట్ లా వచ్చినదానివి గెస్ట్ లా ఉండక ఇవన్నీ నీకు ఎందుకు? నీ హద్దుల్లో నువ్వుంటే బాగుంటుందని మాయకు శ్యామల వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు శ్రుతిని కామాక్షి తిడుతుంది. అప్పుడే ట్రాఫిక్ పోలీసులు వస్తారు. కారును నడిరోడ్డు మీద వదిలేసి వెళ్తున్నారా? కారుతో పాటు మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తానని ట్రాఫిక్ పోలీసులు అంటారు.

రఘురాం ఎమోషనల్

కారు తోస్తే రూ.2 వేలు ఇస్తామని శ్రుతి చెప్తుంది. ఓ నలుగురు తోసేందుకు ముందుకు వస్తారు. కారును తోసుకుంటూ వెళ్లిపోతారు. మరోవైపు జగదీశ్వర వేలికి రఘురాం కట్టు కడతాడు. నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను జగదీశ్వరి అని రఘురాం అంటాడు.

చంద్ర వార్నింగ్

శాలిని విషయం గురించి ఇంట్లో ఎవరితో డిస్కస్ చేయొద్దని చెప్పా కదా. మరి డైరెక్ట్ గా శాలినినే ఎందుకు అడిగావ్? దీన్ని పైత్యం అంటారా? అని మాయపై చంద్రకళ సీరియస్ అవుతుంది. ఆ శాలిని చేసింది తెలిశాక అడగకుండా ఉండలేకపోయానని మాయ చెప్తుంది. శాలిని ఫ్రెండ్లీగా తీసుకుంటుందనుకున్నా కానీ ఫీల్ అయిందని మాయ అంటుంది.

కామాక్షి చెప్పిందని

కామాక్షి కారు తోసుకుంటూ రావడం చూసి సరోజ హ్యాపీగా ఫీల్ అవుతుంది. డ్రైవర్ వచ్చి చెప్పేలోపు నువ్వు కారు తీసుకుని వెళ్లావని శ్రుతితో రాజ్ అంటాడు. కారు తోసినందుకు ఒక్కొక్కరికి రూ.2 వేలు ఇవ్వమంటే సరోజ, రాజ్ షాక్ అవుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్ డబ్బులు ఇస్తాడు.

శాలిని డ్రామా

క్రాంతి దగ్గరకు శాలిని వెళ్తుంది. ఇంకా ఎన్ని రోజులు శిక్ష వేస్తావ్? పశ్చాత్తాపం ఎందుకు కనిపించడం లేదు. నన్ను ఎప్పుడు క్షమిస్తావ్? క్షమించాలంటే ఏం చేయాలి? నెల రోజులు నాతో నార్మల్ గా ఉండి చూడు. మార్పు రాలేదనిపిస్తే ఏ శిక్ష వేసిన భరిస్తానని శాలిని అడుగుతుంది.

మాయ సారీ

నీకు ఛాన్స్ ఇవ్వాలని నాకు లేదని క్రాంతి అంటాడు. అప్పుడే మాయను తీసుకొచ్చి శాలినికి చంద్ర సారీ చెప్పిస్తుంది. శాలిని నాకు చెల్లితో సమానం. ఆమెను ఇబ్బందిపెట్టడం సరికాదు. మాయ మరోసారి ఈ తప్పు చేయకు అని చంద్ర అంటుంది.

అత్తయ్య, మామయ్య కోసం శాలినిని క్షమించమని క్రాంతికి చంద్ర చెప్తుంది. అందుకు క్రాంతి ఒప్పుకోడు. ఇంట్లో జరిగిన విషయాన్ని తల్లి సునందకు కాల్ చేసి శాలిని చెప్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks