నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 5 ఎపిసోడ్ లో.. విరాట్ ను చూడకుండా రెండు గంటలు ఉండటం ఎంత కష్టమోనని శ్యామలతో చంద్రకళ చెప్తుంది. అలా అయితే పచ్చళ్ల బిజినెస్ మానేసి విరాట్ తో ఆఫీస్ కు వెళ్లొచ్చు కదా అని కామాక్షి అంటుంది. వెళ్లేదాన్ని పిన్ని, కానీ వర్క్ ఎక్కువగా సైట్ లో ఉంటుంది. ఎండలో ఉంటే కందిపోతానని మా ఆయన వద్దన్నాడని చంద్ర సిగ్గు పడుతుంది.
గుడ్ న్యూస్ ఎప్పుడు?

ఎక్కడికి వెళ్తున్నావని కామాక్షి అడగ్గానే శాలిని కంగారు పడుతుంది. ఎందుకు అడుగుతున్నావ్? తనకు బిజినెస్ ఉండదా అని శ్యామల అంటుంది. మాకు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నావ్? అని చంద్రను శ్యామల అడుగుతుంది. అప్పుడే అర్జున్ నుంచి చంద్రకు కాల్ వస్తుంది. తేజ్ లో బెటర్ మెంట్ కనిపిస్తోంది. హెల్త్ కండీషన్ లో మార్పు వచ్చింది. ట్రీట్మెంట్ ఇస్తే క్యూర్ అవుతుందని డాక్టర్లు చెప్పారని అర్జున్ చెప్తాడు.
తేజుకు ట్రీట్మెంట్
తేజును తీసుకుని ట్రీట్మెంట్ కోసమని ఫారెన్ వెళ్తున్నామని అర్జున్ చెప్తాడు. తేజును తీసుకుని ఇంటికి రమ్మని చంద్రకళ అడుగుతుంది. మరోవైపు తల్లి సునందను శాలిని కలుస్తుంది. క్రాంతి నా వైపు ఉండటం లేదు. నేను ఏం చేసినా నమ్మడం లేదు. చంద్ర, విరాట్ సంతోషంగా నా కళ్ల ముందు తిరుగుతుంటే నా కడుపు మండిపోతుందమ్మా అని శాలిని చెప్తుంది.
శాలిని కుట్ర
నా పగ తీర్చడం కోసం నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు బేబీ. అవసరమైతే బాంబ్ పెట్టి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తానని సునంద అంటుంది. అలా కాదు ఆ ఫ్యామిలీని టార్చర్ పెట్టి చంపాలి. అందుకు ఒక్క అవకాశం దొరికిన చాలు అని శాలిని చెప్తుంది. విరాట్ బిజినెస్ ను దెబ్బకొట్టడం గురించి తల్లితో కలిసి శాలిని ప్లాన్ వేస్తుంది.
శ్రుతి వార్నింగ్
నువ్వు ఇంకా ఏం ప్లాన్ చేసినా మా ఇంట్లో వాళ్లు నమ్మరని రాజ్ తో శ్రుతి అంటుంది. అప్పుడే అప్పుల అప్పారావు వస్తే రాజ్ దాక్కుంటాడు. నా ఇంటి సొమ్ముకు ఆశ పడితే మాత్రం చూస్తూ ఊరుకోనని రాజ్ కు శ్రుతి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు రాజ్, శ్రుతిని విడగొడదామని కామాక్షి ఇంట్లో అందరికీ చెప్తుంది. కానీ అందరూ వద్దంటారు.
ఆంటీ కాదు అమ్మ
{{/usCountry}}నువ్వు ఇంకా ఏం ప్లాన్ చేసినా మా ఇంట్లో వాళ్లు నమ్మరని రాజ్ తో శ్రుతి అంటుంది. అప్పుడే అప్పుల అప్పారావు వస్తే రాజ్ దాక్కుంటాడు. నా ఇంటి సొమ్ముకు ఆశ పడితే మాత్రం చూస్తూ ఊరుకోనని రాజ్ కు శ్రుతి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు రాజ్, శ్రుతిని విడగొడదామని కామాక్షి ఇంట్లో అందరికీ చెప్తుంది. కానీ అందరూ వద్దంటారు.
ఆంటీ కాదు అమ్మ
{{/usCountry}}అప్పుడే తేజును తీసుకుని అర్జున్ వస్తాడు. చంద్రను తేజు ఆంటీ అని పిలుస్తుంది. నేను నీకు అమ్మనే తేజు. మనది ఆ దేవుడు కలిపిన బంధం తేజు అని చంద్ర అంటుంది. నిజంగానే నేను నిన్ను అమ్మ అని పిలవొచ్చా? థ్యాంక్స్ అమ్మ. నేను ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుందంటా. అందుకే ఫారెన్ వెళ్తున్నామని నువ్వు నాతో ఫోన్లో మాట్లాడాలని తేజు అడుగుతుంది. వీడియో కాల్స్ మాట్లాడతానని, త్వరగా కోలుకుని రావాలని చంద్ర చెప్తుంది.
రూ.20 లక్షలు
మీ కుటుంబంతో నాకు ఆత్మ బంధం ఉంది. మీరంతా నా బంధువులేనని అర్జున్ అంటారు. బిజినెస్ షేర్ ప్రకారం చంద్రకు రూ.20 లక్షల చెక్ ఇస్తాడు అర్జున్. నా కోడలు అంటే ఏమనుకున్నారు? ఈ మేనత్తలా ఏదైనా అనుకుంటే సాధించేదాకా వదిలి పెట్టదు అని జగదీశ్వరి గర్వంగా చెప్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.