నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 14 ఎపిసోడ్ లో మారడానికి ప్రయత్నించమని శాలినికి వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. కడుపుతో ఉన్న మనిషివి ఇలాంటి క్రూరమైన ఆలోచనలు చేయొద్దంటుంది. చేయని తప్పునకు నింద వేస్తున్నావని క్రాంతికి చెప్తే ఎలా ఉంటుందో ఆలోచించుకో అని శాలిని అంటుంది. అప్పుడే విరాట్ వచ్చి నాన్నను రెచ్చగొట్టి పైకి పంపించింది శాలిని హా అని అడిగితే లేదని చంద్ర అబద్దం చెప్తుంది.
శ్యామలకు కరెంట్ షాక్

బైక్ మీద వచ్చిన రాజ్ ను చూసి మళ్లీ డౌట్ పడుతుంది శ్రుతి. పనివాళ్ల బైక్ మీద తిరగొద్దని చెప్పాను కదా అని శ్రుతినే అనడంతో రాజ్ తప్పించుకుంటాడు. మరోవైపు రఘురాం సంతోషంగా బొబ్బట్లు తినడంతో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెంట్ పోతుంది. ఇన్వెర్టర్ రిపేర్ చేయకుండా ఏం చేస్తున్నారని అడుగుతాడు రఘురాం. చూస్తానని వెళ్లిన శ్యామలకు షాక్ కొడుతుంది.
విరాట్, క్రాంతి కలిసి
విరాట్ చెక్ చేస్తాడు. అన్నయ్యకు టూల్ బాక్స్ ఇవ్వమని క్రాంతికి చెప్తాడు రఘురాం. క్రాంతి అన్నయ్య అని పిలుస్తాడు. విరాట్ వెనక్కి పడిపోతుంటే పట్టుకుంటాడు క్రాంతి. అది కాదు అన్నయ్య పక్క వైర్ అని చెప్తాడు క్రాంతి. కలిసి ఉంటే కలదు సుఖమని ఒకరికొకరు ఇలా హెల్ప్ ఫుల్ గా ఉంటే ప్రాబ్లెం ఉండదని రఘురాం అంటాడు. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్స్ అని తండ్రి అంటాడు.
ముద్దు కోసం
బావ మీ తమ్ముడు నీతో మాట్లాడినందుకు ఉప్పొంగిపోతున్నావని చంద్రకళ అంటుంది. అన్ని మర్చిపోయి నాతో ఎప్పటిలాగే బిహేవ్ చేశాడు. అది జెన్యూన్ ఫీల్. అలా కలిసి ఉండటం చూసి అందరూ సంతోషంగా ఉన్నారు కదా అని విరాట్ అంటాడు. విరాట్ షర్ట్ మార్చుకుంటుంటే సిగ్గుపడి చంద్ర అటు తిరుగుతుంది. చంద్రను దగ్గరకు లాక్కుంటాడు విరాట్. ముద్దు ఇవ్వబోతుంటే నెట్టేస్తుంది చంద్ర.
చంద్రపై నిందలు
చంద్ర కారణంగా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. అన్నదమ్ములను విడగొట్టింది. అన్నయ్య కోలుకున్నా కొడుకులను చూసి వదిన బాధపడుతోందని శ్యామల, కామాక్షి మాట్లాడుకుంటారు. అది విన్న చంద్ర వచ్చి వాళ్లు విడిపోవాలని నేనెందుకు అనుకుంటా. క్రాంతి కాపురం విడిపోకుండా అడ్డుపడినదాన్ని. అన్నదమ్ముల మధ్య అడ్డుగోడ ఎందుకు కడతానని చంద్ర అడుగుతుంది. క్రాంతి తిరగబడేసరికి విరాట్ దృష్టిలో చెడ్డవాన్ని చేస్తున్నావని కామాక్షి అంటుంది.
కామ్ గా ఉండాలని
{{/usCountry}}చంద్ర కారణంగా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. అన్నదమ్ములను విడగొట్టింది. అన్నయ్య కోలుకున్నా కొడుకులను చూసి వదిన బాధపడుతోందని శ్యామల, కామాక్షి మాట్లాడుకుంటారు. అది విన్న చంద్ర వచ్చి వాళ్లు విడిపోవాలని నేనెందుకు అనుకుంటా. క్రాంతి కాపురం విడిపోకుండా అడ్డుపడినదాన్ని. అన్నదమ్ముల మధ్య అడ్డుగోడ ఎందుకు కడతానని చంద్ర అడుగుతుంది. క్రాంతి తిరగబడేసరికి విరాట్ దృష్టిలో చెడ్డవాన్ని చేస్తున్నావని కామాక్షి అంటుంది.
కామ్ గా ఉండాలని
{{/usCountry}}ఇదంత విన్న జగదీశ్వరి వచ్చి నిజమేంటో పూర్తిగా తెలియకుండా తప్పు చేశావని ఒక మనిషిని పదే పదే నిందించడం సరికాదు. ఈ టాపిక్ గురించి చర్చించకూడదని ఎన్నిసార్లు చెప్పినా నట్టింట్లో నిలబడి మరీ మాట్లాడుతున్నారు. దయచేసి కామ్ గా ఉండండని జగదీశ్వరి వెళ్లిపోతుంది.
మా అత్తయ్య బంగారం. రేపో మాపో అది నిజం కాదని మీకు తెలిసిపోతుంది. నా కథ సుఖాంతం అవుతుంది. భర్తను కొంగుకు కట్టుకునే అవకాశం లేదని బాధ పడుతున్నారా? అని శ్యామల, కామాక్షికి కౌంటర్ ఇస్తుంది చంద్ర. రాజ్ బైక్ పై శ్రుతి రావడం రఘురాం చూస్తాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.