...
...
Next Story

నిన్ను కోరి నవంబర్ 18: శాలిని ప్లాన్-కొడుకుల గొడ‌వ చూసిన ర‌ఘురాం-డైవ‌ర్ట్ చేసేలా రంగంలోకి చంద్ర‌క‌ళ‌

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 18 ఎపిసోడ్ లో క్రాంతిని రెచ్చగొడుతోంది శాలిని. విరాట్ ఇచ్చిన స్వీట్ బాక్స్ ను నేలకేసి కొడతాడు క్రాంతి. అది చూసి జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది. తల్లి కన్నీళ్లు చూసి క్రాంతితో గొడవ పెట్టుకుంటాడు విరాట్. రఘురాం ఆ సీన్ చూస్తాడు.

Published on: Nov 18, 2025, 07:29:24 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 18 ఎపిసోడ్ లో విరాట్ పై ద్వేషం పెంచేలా క్రాంతిని రెచ్చగొడుతోంది శాలిని. మీ అన్నయ్యలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని ఎక్స్ పెక్ట్ చేయలేదు. మనసులో కుట్రలు, పైకి కౌగిలింతలు అని శాలిని అనగానే విరాట్ ఇచ్చిన పూతరేకుల డబ్బాను విసిరికొడతాడు. అప్పుడే వచ్చిన జగదీశ్వరి ప్రేమతో తెప్పించినదాన్ని నేలకేసి కొట్టావేంటీ అని అడుగుతుంది. అన్నయ్య మారిపోయాడమ్మా అని క్రాంతి అంటాడు.

తప్పు క్రాంతి

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

విరాట్ కు నీ మీద ప్రేమ లేదన్న మాట నిజం కాదురా. ఇప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిందని ప్రేమంతా అబద్ధం అయిపోతుందా? క్రాంతి తప్పుగా ఆలోచిస్తున్నావని జగదీశ్వరి అంటుంది. నాన్నను కొట్టింది శాలిని అని అనుకుంటున్నావా? అమ్మ అని అడుగుతాడు క్రాంతి. తప్పు చేసింది ఎవరో తెలియదు. కానీ మీరు గొడవపడటం నాకు నచ్చట్లేదు. శాలిని, చంద్రకళలో ఒక్కరు నేరం చేశారన్నది నిజమని జగదీశ్వరి అంటుంది. అప్పుడే రఘురాంను శాలిని తీసుకొస్తుంటే, చంద్ర వెళ్లి డెకరేషన్ చేయాలని తీసుకెళ్తుంది.

జగదీశ్వరి ఎమోషనల్

క్రాంతికి ఏ గిఫ్ట్ ఇవ్వాలని కామాక్షి, శ్రుతి ఆలోచిస్తారు. ఎమోషనల్ గా ఉండేలా కవిత రాసి వినిపిస్తానని శ్యామల చెప్తుంది. జగదీశ్వరి కన్నీళ్లు చూసి ఏమైందని శ్యామల అడుగుతుంది. విరాట్ మీద క్రాంతి ద్వేషం పెంచుకుంటున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ బాధనే ఉంటుంది. పెళ్లయ్యాక పుట్టింటికి దూరమయ్యా, ఆ తర్వాత ఆయనకు ప్రమాదం జరిగింది. చంద్ర మెడలో విరాట్ తాళి కట్టాడు. ఆయన ఎప్పుడు అందరిని మర్చిపోతారేమో అని భయంగా ఉంది. ఇప్పుడు విరాట్, క్రాంతి గొడవ అని జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది.

మళ్లీ గొడవ

క్రాంతి, విరాట్ గొడవ పడుతుంటే అక్కడికి రఘురాం వస్తాడు. అమ్మను బాధ పెడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఇంకోసారి అమ్మ నీ వల్ల కన్నీళ్లు పెట్టుకుందో అని తండ్రిని చూసి లోపలికి వెళ్లిపోతాడు విరాట్. బెలూన్ పగిలిన సౌండ్ కు రఘురాం మైండ్ డైవర్ట్ అవుతుంది.

గొడవ జరగొద్దంటే మామయ్యను పార్టీ వరకైనా బయటకు పంపించాలని చంద్ర అంటుంది. గోల్డ్ చెయిన్ కొనేందుకు మామయ్యను బయటకు వెళ్లమంటుంది. కానీ శాలిని అడ్డుపడుతుంది. అయినా సరే శ్రుతితో మామయ్యను బయటకు పంపిస్తుంది చంద్ర. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks