...
...
Next Story

నిన్ను కోరి నవంబర్ 21 ఎపిసోడ్: చంద్రకళ ట్విస్ట్- శాలినికి జగదీశ్వరి వార్నింగ్- అమ్మవారి మొక్కు- రఘురాంకు గుర్తొచ్చిన గతం

నిన్ను కోరి సీరియల్ నవంబర్ 21 ఎపిసోడ్‌లో ఇంట్లో గొడవ జరుగుతుందని రఘురాంకు చెప్పి తీసుకొస్తుంది శాలిని. కానీ, అది ప్రాంక్ అని ఉదయమే చంద్రకళ చెప్పిందని రఘురాం అంటాడు. రఘురాంను శాలిని తీసుకురావడంపై వార్నింగ్ ఇస్తుంది జగదీశ్వరి. అమ్మవారి మొక్కు తీర్చుకోవాలని అందరికి చెబుతుంది జగదీశ్వరి.

Published on: Nov 21, 2025, 08:48:10 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం దగ్గరికి వెళ్లి కావాలని ఏడుస్తుంది శాలిని. ఏమైందని రఘురాం అడిగితే మీ అబ్బాయిలు ఇద్దరు గొడవ పడుతున్నారు. వాళ్లను ఆపడం నా వల్ల కావట్లేదు అని శాలిని అంటుంది. దాంతో రఘురాం కిందకు వస్తాడు. క్రాంతి, విరాట్ గొడవ పడటం చూసి షాక్ అవుతాడు రఘురాం. తండ్రిని చూసి ఆగిపోతారు.

ప్రాంక్ చేస్తున్నట్లు చెప్పింది

నిన్ను కోరి సీరియల్ నవంబర్ 21 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ నవంబర్ 21 ఎపిసోడ్‌

నాకు తెలియకుండా రోజు గొడవ పడుతున్నారా. నాకోసం నటిస్తున్నారా. ఎందుకురా ఇలా చేస్తున్నారు అని.. అడుగుతాను అనుకున్నారా. నాకు తెలుసురా. ఇదంతా మీరు జగదీశ్వరిపై ప్రాంక్ చేస్తున్నారుగా. ఈ ప్రాంక్ చేస్తున్నట్లు ఉదయమే చంద్రకళ చెప్పింది అని రఘురాం అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. దాంతో ఉదయం జరిగింది గుర్తు చేసుకుంటుంది చంద్రకళ.

హమ్మయ్య నేను సర్దిచెప్పింది ఇలా ఉపయోగపడిందా అని అనుకున్న చంద్రకళ బయటకు చూశారా మావయ్య ఈ గొడవ నిజమనుకుని అత్తయ్య ఎంత కంగారు పడుతున్నారో అని అంటుంది. మీ అల్లరి మరీ ఎక్కువైంది. ఏడిపించడానికి నా భార్యే దొరికిందా. నా భార్యే అనుకుంటే నీ భార్య ఇంకా పిచ్చిదిరా క్రాంతి. మీరు గొడవ పడుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి నాకు చెప్పింది అని నిజం చెబుతాడు రఘురాం.

దాంతో అంతా షాక్ అవుతారు. మీరంతా అందరిని ఫూల్ చేశారు అని జగదీశ్వరని తీసుకెళ్తాడు రఘురాం. ప్లాన్ ఫెయిల్ అయిందని శాలిని గింజుకుంటుంది. ఉదయం జరిగింది విరాట్‌తో చెబుతుంది చంద్రకళ. శాలిని అడ్డు గోడలు కట్టి విడగొట్టాలని చూస్తుంటే నువ్వు వాటిని కూల్చేశావ్ అని చంద్రకళను తెగ పొగుడుతాడు విరాట్. తర్వాత చంద్రకళను ఎత్తుకుని తిప్పుతాడు విరాట్.

చంద్ర దెబ్బ తీసింది

శాలిని దగ్గరికి జగదీశ్వరి వచ్చి చూస్తుంది. శాలిని డ్రామా చేస్తుంది. నీ ప్రవర్తనకు అర్థం ఏంటీ. గొడవ జరుగుతుందని తెలిసి కూడా ఆయన్ను అక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్. ఆయన స్ట్రెస్ ఫీల్ అవ్వాలని కోరుకున్నావా అని నిలదీస్తుంది జగదీశ్వరి. నేను చెప్పలేదు. కన్నీళ్లు పెట్టుకోవడం చూసి వచ్చారు. ఆపిన ఆగలేదు అని అబద్ధం చెబుతుంది శాలిని.

చూడు శాలిని ఆయన్ను చంపాలని చూసింది ఎవరో ఇంకా తెలియలేదు. ఆయన కోలుకోవడం ముఖ్యమని నిన్ను, చంద్రను అనట్లేదు. మీ భర్తలకు వాళ్ల ఇగోలే ఎక్కువైపోయాయి. ఎవరి భార్యను వాళ్లు కాపాడుకుంటూ ఇంటిని రణరంగం చేస్తున్నారు. నిజం బయటపడ్డప్పుడ అన్నిటికి కలిపి శిక్ష వేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జగదీశ్వరి.

అమ్మకు క్రాంతి సపోర్ట్

క్రాంతి వచ్చి అమ్మ అడిగినదాంట్లో తప్పేముంది. ఎందుకు ఆయన్ను తీసుకొచ్చావ్ అని నిలదీస్తాడు క్రాంతి. ఆయన్ను నేను తీసుకురాలేదు. ఆయనకు ఏది గుర్తుండదు. నీకు తెలుసు కదా అని క్రాంతిని ఏమారుస్తుంది శాలిని. నువ్వు నమ్మకుంటే ఇంకా నేనెందుకు అని ఏడుస్తూ ఇక నాకు చావే దిక్కు అంటుంది శాలిని. నేను నిన్ను నమ్ముతాను అని శాలినిని హగ్ చేసుకుంటాడు క్రాంతి.

మరుసటి రోజు అన్నయ్య కోలుకోగానే కుటుంబం అంతా గుడికి వచ్చి మొక్కు తీర్చుకుందామనుకుంటున్నాను అని శ్యామలతో అంటుంది జగదీశ్వరి. పిల్లలతో నేను మాట్లాడుతాను అని శ్యామల అంటుంది. అందరిని పిలుస్తారు. జగదీశ్వరి మొక్కు గురించి శ్యామల చెబుతుంది. అంతా కలిసి వస్తామని విరాట్, క్రాంతి చెబుతారు. రేపే మొక్కు తీర్చుకోవాలి అని జగదీశ్వరి చెబుతుంది.

తర్వాత శాలినినే తనను తలపై కొట్టింది గుర్తు చేసుకుంటాడు రఘురాం. శాలిని రాగానే మళ్లీ ఎందుకు వచ్చావ్. నువ్వే నా తలపై కొట్టింది అని అందరిని పిలిచి శాలిని గురించి నిజం చెబుతాడు రఘురాం. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe