నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో టైమ్‌కు ట్యాబ్లెట్స్ వేసుకోమ్మని శాలినికి ఇస్తాడు క్రాంతి. ట్యాబ్లెట్స్ వేసుకున్నట్లే వేసుకుని తీసేస్తుంది శాలిని. పుట్టబోయే వారసుడు వస్తాడని తెగ ఆనందంగా ఉన్నావ్. కానీ, నా కడుపులో అసలు బిడ్డే లేదు. బావ తన నిజం బయటపెట్టకుండా ఉండేందుకు ఆడుతున్న నాటకం ఇది అని అనుకుంటుంది శాలిని.
శాలినికి రఘురాం గిఫ్ట్

మరోవైపు తులసికోటకు పూజ చేస్తుంది చంద్రకళ. ఇంతలో రఘురాం ఓ బొమ్మతో వస్తాడు. శాలినికి బేబీ బొమ్మ ఇస్తాడు రఘురాం. కడుపుతో ఉన్నవాళ్లు ముద్దుగా ఉన్న ఫొటోలు చూస్తే పిల్లలు అలాగే పుడతారు అని రఘురాం అంటాడు. అంతా మనవడి గురించి మాట్లాడుకుంటారు. ఆ బొమ్మను పట్టుకుని శాలిని, క్రాంతి మురిసిపోతారు.
మనం కూడా అలాంటి ప్లాన్ చేయొచ్చని చంద్రతో అంటాడు విరాట్. మరోవైపు కిచెన్‌లో చంద్రకళ కాఫీ పెడుతుంది.శాలిని బొప్పాయి ముక్కలు తినకూడదు అని మాట్లాడుకుంటారు శాలిని, కామాక్షి. విరాట్‌కు చంద్ర కాఫీ తీసుకెళ్తే తమకు కూడా ఇవ్వాలని తెలియదా అని కామాక్షి అంటుంది. సెటైర్లు వేసి చంద్రకళ వెళ్తుంది.
మరోవైపు గుడిలో రఘురాం డిస్ట్రాక్ట్ అయింది గుర్తు చేసుకున్న శాలిని డాక్టర్‌కు కాల్ చేస్తుంది. గుడిలో గంట మోగిన దాని గురించి చెబుతుంది శాలిని. ఇదంతా ఎందుకు అడుగుతున్నారు. మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి అని డాక్టర్ అంటుంది.
పాత స్థితిలోకి మార్చాలని
నా గురించి చంద్రకు తెలిసింది. నేను మావయ్యకు ఏమైనా చేస్తే నన్ను విడిచిపెట్టదు. కానీ, పాత స్థితిలోకి మావయ్య మారాలని చూస్తున్నా అంతే అని శాలిని చెబుతుంది. అయితే ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. చాలా డెలికేట్ కావడంతో ఏ చిన్న సౌండ్‌ను భరించలేకపోతున్నారు. ఇలాగే కొనసాగితే పూర్తిగా మెమోరీ లాస్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ చెబుతాడు.
భరించలేనంత శబ్ధం చేస్తే చాలన్నమాట. ఇక నేను చూసుకుంటాను అని శాలిని కాల్ కట్ చేస్తుంది. హాల్లో రఘురాం ఫ్రూట్స్ తింటుంటాడు. పైన గదిలో చంద్ర ఊడుస్తుంటుంది. ఈ రెండు చూసిన శాలిని చంద్ర నింద మోసేలా చేయబోతున్నాను అని అనుకుంటుంది. హాల్లో పైనుంచి ఫ్లవర్ వాజ్ కింద పడేసి వెళ్లిపోతుంది శాలిని.
{{/usCountry}}భరించలేనంత శబ్ధం చేస్తే చాలన్నమాట. ఇక నేను చూసుకుంటాను అని శాలిని కాల్ కట్ చేస్తుంది. హాల్లో రఘురాం ఫ్రూట్స్ తింటుంటాడు. పైన గదిలో చంద్ర ఊడుస్తుంటుంది. ఈ రెండు చూసిన శాలిని చంద్ర నింద మోసేలా చేయబోతున్నాను అని అనుకుంటుంది. హాల్లో పైనుంచి ఫ్లవర్ వాజ్ కింద పడేసి వెళ్లిపోతుంది శాలిని.
{{/usCountry}}ఆ సౌండ్‌కు రఘురాం తలనొప్పితో అరుస్తాడు. అప్పుడే పైనుంచి చంద్ర వచ్చి చూస్తుంది. కింద ఫ్లవర్ వాజ్ ఎలా పడిందని అంతా పైకి చూస్తే చంద్ర ఉంటుంది. రఘురాం తట్టుకోలేకపోతున్నా అని అరుస్తుంటాడు. శాలిని వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ పాట్ కావాలని కింద పడేస్తే పడుతుంది అని కామాక్షి అంటుంది. నేను పడేయలేదు. పైన ఊడుస్తున్నాను. సౌండ్ రావడంతో వచ్చాను అని చంద్రకళ అంటుంది.
క్రాంతికి డౌట్
శ్యామల నిందిస్తుంది. విరాట్ అరుస్తాడు. డాక్టర్ గారు యాంగ్జైటీ ట్యాబ్లెట్ ఇచ్చారుగా అది తీసుకొస్తాను అని పరుగెత్తుకుంటూ వచ్చి ఇస్తుంది శాలిని. ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోయి అలా పరుగెత్తుతున్నావేంటీ అని క్రాంతి డౌట్‌గా అంటాడు. మావయ్య ఇబ్బంది పడుతుంటే చూడలేకపోయానని చెబుతుంది శాలిని.
రఘురాంను లోపలికి తీసుకెళ్తుంది జగదీశ్వరి. తర్వాత శాలిని దగ్గరికి వెళ్లి ఎందుకిలా చేశావు. నిన్ను వదిలేసింది మారడానికి ప్రాణాలు తీయడానికి కాదు అని నిలదీస్తుంది చంద్రకళ. నేను కావాలనే ఫ్లవర్ వాజ్ పక్కన పడేశాను. దానివల్ల ఆయన మైండ్ డిస్ట్రాక్ట్ అయి మర్చిపోతున్నారు. ఇక నాగురించి చెబుతామనుకున్న ప్రతిసారి చిన్న సౌండ్ చేస్తే చాలు అంతా మర్చిపోతారు. ఇది నాకు దొరికిన గోల్డెన్ ఛాన్స్ అని శాలిని నవ్వుతు చెబుతుంది.
నిజం తెలుసుకున్న చంద్రకళ
శాలిని అటు ఇటు తిరగడం, బొప్పాయి ముక్కలు తినడం గమనించిన చంద్రకళకు డౌట్ వస్తుంది. హాస్పిటల్‌కు వెళ్లి శాలిని రికార్డ్స్ తీసుకుంటుంది. శాలినికి ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదని, శాలిని కడుపుతో లేదని నిజం తెలుసుకుంటుంది చంద్రకళ. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.