...
...
Next Story

నిన్ను కోరి ప్రోమో: క్రాంతికి నిజం చెప్పేసిన లేడి డాక్టర్- శాలిని ప్రెగ్నెన్సీ నాటకం బయటపెట్టించిన విరాట్, చంద్రకళ

నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో డాక్టర్ కోట్ వేసుకున్న రఘురాం పేషంట్‌కు ట్రీట్‌మెంట్ చేస్తాడు. లేడి డాక్టర్‌ను బెదిరించి క్రాంతితో నిజం చెప్పించేందుకు ఒప్పిస్తారు చంద్రకళ, విరాట్. క్రాంతి వచ్చి శాలినికి ఏమైందని అడిగితే.. తను ప్రెగ్నెన్సీ, అబార్షన్ అంతా అబద్ధమని నిజం చెబుతుంది డాక్టర్.

Published on: Dec 7, 2025, 09:45:17 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రఘురాంను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ సౌండ్‌తో డైవర్ట్ అయిన రఘురాం డాక్టర్ రూమ్‌లోకి వెళ్తాడు. కోట్ వేసుకుని డాక్టర్ చైర్‌లో కూర్చుంటాడు. ఇంతలో ఒక పేషంట్ కడుపు నొప్పి డాక్టర్ అంటూ వస్తాడు. అది విని నేను ఇక్కడ డాక్టర్‌నా. నాకు ఈ విషయం తెలియదే అనుకుంటాడు రఘురాం.

డ్రామా డాక్టర్ దగ్గరికి

నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

పేషంట్ నొప్పితో అవస్థలు పడటంతో రఘురామే డాక్టర్‌ అనుకుని ట్రీట్‌మెంట్ ఇస్తాడు. మరోవైపు శాలినితో ప్రెగ్నెన్సీ డ్రామా ఆడిన డాక్టర్ కోసం విరాట్, చంద్రకళ బయట ఎదురుచూస్తుంటారు. పేషంట్ వెళ్లగానే లోపలికి వెళ్తారు. ఏం కావాలి, ఏంటీ సమస్య అని లేడి డాక్టర్ అడుగుతుంది.

మీరే సమస్య, వల్లే పెద్ద సమస్య ఏర్పడింది, మీరే సరిచేయాలని చంద్రకళ అంటుంది. దాంతో డాక్టర్ కోప్పడుతుంది. ఏంటీ మీరు మాట్లాడేది. నేను సమస్య ఏంటీ. అసలు ఎవరు మీరు అని అరుస్తుంది డాక్టర్. అరవకండి డాక్టర్. అన్ని నిజాలు బయటపెడతాం అని చంద్రకళ అంటుంది.

మీరు నా తోడి కోడలు కలిసి ప్రెగ్నెన్సీ, అబార్షన్ నాటకం ఆడారు కదా. శాలినికి అసలు ప్రెగ్నెన్సీనే కన్ఫర్మ్ కాలేదు. అలాంటి మీరు ప్రెగ్నెంట్ అయినట్లు, అబార్షన్ అయినట్లు నాటకం ఆడారు. అదంతా అబద్ధం అని మావాళ్లతో చెప్పాలి అని చంద్రకళ, విరాట్ అంటారు.

డాక్టర్ పీక మీద

వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ అంటూ మరింత రెచ్చిపోతుంది లేడి డాక్టర్. దాంతో పక్కనున్న ఆపరేషన్ సిసర్స్ తీసుకుని డాక్టర్ పీక మీద పెడుతుంది చంద్రకళ. అసలు నిజం చెప్పకుంటా ఈ కత్తెర మీ గొంతులోకి దిగబడుతుంది. నిజం ఒప్పుకుంటారా లేదా అని డాక్టర్‌ను కోపంగా బెదిరిస్తుంది చంద్రకళ.

అతను ఇప్పుడు ఎలా వస్తాడని డాక్టర్ అంటే.. అది కూడా మీరే చేయాలి అని విరాట్ అంటాడు. అర్థం కాలేదని లేడి డాక్టర్ అంటే.. అది నేను చెబుతానుగా అని చంద్రకళ అంటుంది. క్రాంతికి కాల్ చేసి శాలినికి సమస్య ఉందని, మీరు త్వరగా రావాలని, మీతో మాట్లాడాలని చెప్పండి. దాంతో క్రాంతి కచ్చితంగా వస్తాడు అని చంద్రకళ అంటుంది.

శాలినికి ఏమైనా సమస్యా

చంద్రకళ చెప్పిటన్లుగానే క్రాంతికి కాల్ చేసి రమ్మంటుంది లేడి డాక్టర్. డాక్టర్ చెప్పడంతో క్రాంతి భయంతో హుటాహుటిన హాస్పిటల్‌కు వస్తాడు. వచ్చి కాల్ చేసిన డాక్టర్‌ను కలుస్తాడు క్రాంతి. వెంటనే క్యాబిన్‌లోకి వెళ్లి ఏమైంది డాక్టర్. శాలినికి ఏమైంది. ఎందుకు డైరెక్ట్‌గా మాట్లాడాలన్నారు. తనకేమైనా ప్రాబ్లమ్ ఉందా అని క్రాంతి భయంగా అడుగుతాడు.

అప్పుడే లోపలకి, విరాట్ చంద్ర రావడంతో విసుక్కుంటాడు క్రాంతి. మిమ్మల్ని కాదురా విసుక్కోవడం, నిజం తెలిస్తే ఎవరిని ఏం అనాలో నీకే తెలుస్తుంది అని విరాట్ అంటాడు. నాకు నీతో వాదించే టైమ్ లేదు. డాక్టర్ మీరు చెప్పండి. ఎందుకు రమ్మన్నారు అని క్రాంతి అంటాడు.

చెప్పండి డాక్టర్. మా ముందు చెప్పిన నిజాన్ని క్రాంతికి కూడా చెప్పండి అని చంద్రకళ అంటుంది. ఏంటా నిజం డాక్టర్. ఏమైందో చెప్పండి అని క్రాంతి డాక్టర్‌ను నిలదీస్తాడు. శాలిని నెలతప్పడం, అబార్షన్ జరగడం అంతా అబద్ధం అని భయపడుతూ లేడి డాక్టర్ చెబుతుంది.

నిజం చెప్పించగలిగాం

దానికి క్రాంతి తెగ షాక్ అయి బిత్తరపోతాడు. డాక్టర్‌తో నిజం చెప్పించగలిగామని విరాట్, చంద్రకళ సంతోషిస్తారు. అక్కడితో నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe