...
...
Next Story

OTT Horror Telugu: ఓటీటీలో తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- 2 వేర్వేరు కథలు- వణికించే నోట్ల కట్టల బ్యాగ్- ట్విస్ట్

Not All Movies Are The Same Dual OTT Streaming: ఓటీటీ ప్రియులను వణికించే తెలుగు హారర్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్: డ్యూయల్ ఆకట్టుకుంటోంది. రెండు వేర్వేరు కథలతో తెరకెక్కిన హారర్ ఎలిమెంట్స్ ఉన్న ఈ నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: Aug 23, 2026, 14:10:32 IST
Advertisement

Not All Movies Are The Same Dual OTT Release: ఓటీటీ ప్రపంచంలో ప్రతివారం వందల సినిమాలు అందుబాటులోకి వస్తుంటాయి. అయితే సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జోనర్లను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించే సినిమాలు కొన్నే ఉంటాయి. కొన్ని సినిమాలు చూస్తున్నంతసేపు క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.

ఓటీటీలో డ్యూయల్ సినిమా

ఓటీటీలో తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- 2 వేర్వేరు కథలు- వణికించే నోట్ల కట్టల బ్యాగ్- ట్విస్ట్
ఓటీటీలో తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- 2 వేర్వేరు కథలు- వణికించే నోట్ల కట్టల బ్యాగ్- ట్విస్ట్

సరిగ్గా అలాంటి అరుదైన అనుభూతినే ఇస్తోంది 'నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్: డ్యూయల్' (Not All Movies Are The Same : Duel) అనే సినిమా. సస్పెన్స్, హారర్ కలయికతో రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది.

రెండు వేర్వేరు ప్రపంచాలు.. ఊహించని మలుపులు

డ్యూయల్ సినిమాలో ప్రధానంగా రెండు వేర్వేరు కథలను చూపించారు. మొదటి కథలో ఒక వ్యక్తి తన సర్వస్వాన్నీ కోల్పోయి, ప్రమాదకరమైన జాంబీల (Zombies) మధ్య చిక్కుకుంటాడు. ఆ భయానక వాతావరణం నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు? అసలు తనకు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది? అనే అంశాలు ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తాయి.

నోట్ల కట్టలతో దొరికే బ్యాగ్

ఇక రెండో కథ విషయానికి వస్తే.. పేదరికంతో బాధపడే ఒక మత్స్యకారుడికి గ్రామం సమీపంలోని సరస్సు గట్టు వద్ద నోట్ల కట్టలతో ఉన్న ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఆ డబ్బుతో తన కష్టాలన్నీ తీరిపోతాయని సంబరపడే లోపే అతని జీవితంలో అనూహ్య పరిణామాలు మొదలవుతాయి. ఊహించని శక్తులు, భయానక సంఘటనలు అతని వెంటపడతాయి.

రెండు కథల మధ్య కనెక్షన్

ఈ చిత్రానికి సగీరాజు సురేష్ దర్శకత్వం వహించగా, మైగ్రేటింగ్ బర్డ్స్ ఫిల్మ్స్ పతాకంపై గీతా పెన్మత్స నిర్మించారు. ఈ డ్యూయల్ సినిమాలో రోషిణి అరవిందాక్షన్, రఘు వర్ధన్, ఖుషీ పిల్లల కీలక పాత్రల్లో నటించారు.

నటనతో గూస్‌బంప్స్

ఈ సినిమాలో ప్రతీ నటుడూ తమ పాత్రలో జీవించి కథకు కావాల్సిన గూస్‌బంప్స్ ఎలిమెంట్లను పండించారు. విజువల్స్ చాలా గ్రాండియర్‌గా ఉండటమే కాకుండా, థ్రిల్లర్ సినిమాలకు ప్రాణమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) భయాన్ని రెట్టింపు చేస్తుంది.

ఎక్కడ చూడవచ్చు?

సుమారు 95 నుంచి 97 నిమిషాల నిడివితో సాగే డ్యూయల్ సినిమా మూలకథ తెలుగులోనే రూపొందింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) వంటి 2 ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

డ్యూయల్ ఓటీటీ స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ డ్యూయల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. బెస్ట్ వారాంతంలో మంచి హారర్ థ్రిల్లర్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఓటీటీ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా నాట్ ఆల్ మూవీస్ ఆర్ ద సేమ్: డ్యూయల్ ఒక మంచి ఛాయిస్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe