Varahi Mallipamula Raja Kumari Impure Movie: తెలుగు చిత్ర పరిశ్రమకు విదేశీ వేదికల నుంచి సరికొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రతిభ వచ్చి చేరుతున్నాయి. అమెరికాలో స్థిరపడినప్పటికీ, మాతృభూమిపై, సినిమా రంగానిపై ఉన్న మమకారంతో ఎంతోమంది ఎన్నారైలు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
మోడ్రన్ రిలేషన్‌షిప్స్ డ్రామాగా

అదే బాటలో రచయితగా, నటిగా, నిర్మాతగా తన మల్టీ టాలెంట్‌ను చాటుకునేందుకు సిద్ధమయ్యారు వారాహి మల్లిపాముల. ఆమె కథను అందిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఇంటర్నేషనల్ తెలుగు చిత్రం 'ఇంప్యూర్'. మోడ్రన్ రిలేషన్‌షిప్స్ డ్రామాగా తెరకెక్కిన ఇంప్యూర్ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఎన్నారై ప్రతిభకు పట్టం.. 'ఇంప్యూర్' ప్రయాణం
తల్లికూతుళ్లు శ్రీదేవి మల్లిపాముల, వారాహి మల్లిపాముల సంయుక్తంగా నిర్మించిన ఇంప్యూర్ చిత్రానికి నిశాంతి ఇవని దర్శకత్వం వహించారు. యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఇంప్యూర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆధునిక భావాలను తెలుగు తెరకు
అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో ఉంటున్నా మన మూలాలను మర్చిపోకుండా, ఆధునిక భావాలను తెలుగు తెరకు పరిచయం చేయాలనే తపనతో ఈ ప్రాజెక్ట్ రూపొందించినట్లు మేకర్స్ వెల్లడించారు.
రాజా కుమారి సంగీత ధమాకా.. 'ఓఎంజీ' ట్రెండింగ్
అంతేకాకుండా ఇంప్యూర్ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇండియన్-అమెరికన్ ర్యాపర్ రాజ కుమారి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' టైటిల్ ట్రాక్, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లోని 'ధోప్', పవన్ కల్యాణ్ 'ఓజీ'లోని 'ఫైర్ స్ట్రోమ్' పాటలతో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రాజా కుమారి, ఈ చిత్రంతో సంగీత దర్శకురాలిగా మారడం విశేషం.
అతిథి పాత్రలో రాజ కుమారి
{{/usCountry}}అంతేకాకుండా ఇంప్యూర్ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇండియన్-అమెరికన్ ర్యాపర్ రాజ కుమారి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' టైటిల్ ట్రాక్, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లోని 'ధోప్', పవన్ కల్యాణ్ 'ఓజీ'లోని 'ఫైర్ స్ట్రోమ్' పాటలతో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రాజా కుమారి, ఈ చిత్రంతో సంగీత దర్శకురాలిగా మారడం విశేషం.
అతిథి పాత్రలో రాజ కుమారి
{{/usCountry}}ఈ సినిమాలో రాజ కుమారి పాడిన 'ఓఎంజీ' (OMG) పాటకు కడలి సత్యనారాయణ సాహిత్యం అందించగా, ప్రస్తుతం ఇది డిజిటల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మరొక పాటను పాడటంతో పాటు రాజ కుమారి ఒక ప్రత్యేక అతిథి పాత్రలో అలరించనున్నారు.
తరం మారినా తరగని అనుబంధం.. కథా నేపథ్యం
ఇంప్యూర్ సినిమాలో ఉన్న అంతర్గత సందేశం గురించి నిర్మాత శ్రీదేవి మల్లిపాముల వివరాలు వెల్లడించారు. "సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మోడ్రన్ రిలేషన్షిప్స్ ఆధారంగా ఈ కథను మలిచాం. మహిళల పట్ల సమాజ వైఖరిని సున్నితంగా ప్రశ్నిస్తూనే, జెన్-జీ తరం, అంతకుముందు తరం మధ్య అనుబంధం ఎలా ఉండాలో ఇందులో ఆవిష్కరించాం" అని శ్రీదేవి పేర్కొన్నారు.
ఇంప్యూర్ నటీనటులు
అన్ని వర్గాలు, అన్ని వయసుల ప్రేక్షకులను అలరించే కథాంశంతో ఇంప్యూర్ సినిమా రానున్నట్లు తెలిపారు. ఇంప్యూర్ చిత్రంలో అభిజీత్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
అక్టోబర్ 2న విడుదల
జ్ఞానశేఖర్ వీఎస్ ఛాయాగ్రహణం సమకూర్చగా, అశుతోష్ మతేల, రామకృష్ణ ఆరమ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కరణ్ పాండవ్, నిర్వాణ్ ఆత్రేయ నేపథ్య సంగీతాన్ని అందించారు. సాంకేతికంగానూ ఎంతో సమృద్ధిగా రూపుదిద్దుకున్న 'ఇంప్యూర్' చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.