...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన పవన్ కల్యాణ్ ఓజీ- 5 భాషల్లో స్ట్రీమింగ్- 86 శాతం ఫ్రెష్ కంటెంట్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఓజీ మూవీకి సుజీత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదు భాషల్లో ఓజీ ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుదాం.

Published on: Oct 23, 2025, 09:14:20 IST
Advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్లిల్లర్ సినిమా ఓజీ. దే కాల్ హిమ్ ఓజీ అనేది ఫుల్ టైటిల్. యంగ్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన సుజీత్ ఓజీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేసింది.

తెలుగులో తొలి చిత్రం

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన పవన్ కల్యాణ్ ఓజీ- 5 భాషల్లో స్ట్రీమింగ్- 86 శాతం ఫ్రెష్ కంటెంట్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన పవన్ కల్యాణ్ ఓజీ- 5 భాషల్లో స్ట్రీమింగ్- 86 శాతం ఫ్రెష్ కంటెంట్- ఇక్కడ చూసేయండి!

ఇక ఓజీ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేశాడు. ఇదే ఇమ్రాన్ హష్మీకి తెలుగులో మొదటి మూవీ. వీరితోపాటు ఓజీ చిత్రంలో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమాయే తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

వింటేజ్ పవన్ కల్యాణ్ అంటూ

ఇక ఓజీ సినిమాపై ఎన్ని అంచనాలు ఉండేవో తెలిసిందే. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో ఓజీ విడుదలైంది. ఓజీ రిలీజ్ రోజు నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అందించింది. ఎన్నో ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను వింటేజ్ లుక్‌లో చూశామని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.

ఓజీ బడ్జెట్ అండ్ కలెక్షన్స్

అలాగే, కలెక్షన్స్ పరంగా కూడా ఓజీ సత్తా చాటింది. రూ. 200 నుంచి 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓజీ సినిమాకు దాదాపుగా రూ. 339 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇలా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఓజీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ్టీ (అక్టోబర్ 23) నుంచి దే కాల్ హిమ్ ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

28 రోజుల్లోనే ఓటీటీలోకి

థియేటర్లలో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన ఓజీ ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇకపోతే ఓజీ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.8 రేటింగ్ వచ్చింది. అలాగే, కంటెంట్ ఎంత తాజాదో చెప్పే రొట్టెన్ టొమాటోస్ సంస్థ ఓజీ సినిమాకు 86 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది.

తమన్ బీజీఎమ్‌కు

ఓజీ సినిమాను డీవీవీ దానయ్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓజీ మూవీకి సంగీతం అందించారు. తమన్ అందించిన బీజీమ్‌కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు

విజువల్స్ అదిరిపోయాయని టాక్ వచ్చింది. ముఖ్యంగా ఓజీ టైటిల్ కార్డ్ అందరిని ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో చూడని వాళ్లు, చూసిన వారు మరోసారి ఓజీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks