OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో 5 స్పెషల్ సినిమాలు-తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో-ఓ లుక్కేయండి
ఓటీటీ లవర్స్ అలర్ట్. మూడు రోజుల్లో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు 5 స్పెషల్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం సినిమాలున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.
ఓటీటీలో ఎంటర్ టైన్మెంట్ జోష్ నింపేందుకు, డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను అలరించేందుకు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో అయిదు స్పెషల్ మూవీస్ ఓటీటీ ఆడియన్స్ కోసం స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలున్నాయి. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ తదితర జోనర్లలో చిత్రాలున్నాయి.

ఛాంపియన్
సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక కొడుకు రోషన్ మేక హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’. ఇది పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో హీరో ఓ ఆంగ్లో ఇండియన్. ఫుట్ బాల్ ప్లేయర్ కావాాలని కలలు కంటాడు. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ క్లబ్ కు ఆడాలని అనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొంటాడు. ఈ మూవీ ఈ రోజు (జనవరి 29) నుంచే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
సర్వం మాయ
రీసెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మలయాళం హారర్ థ్రిల్లర్ సర్వం మాయ. ఇది నివిన్ పౌలీకి మంచి కమ్ బ్యాక్ సినిమా. సాంప్రదాయ పూజారి కుటుంబంలో పుట్టిన హీరో యూరోప్ కు వెళ్లాలనుకుంటాడు. అతను నాస్తికుడు. కానీ ఒక రోజు అతనో దెయ్యాన్ని కలుస్తాడు. అప్పటి నుంచి అతని జీవితంలో అనూహ్య మార్పులు కలుగుతాయి. ఈ మూవీ జనవరి 30న జియోహాట్‌స్టార్ లో రిలీజ్ కానుంది.
వా వాతియార్
తమిళ స్టార్ హీరో కార్తి సినిమా ‘వా వాతియార్’. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ యాక్షన్ డ్రామా అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఇందులో కార్తి పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. కృతి శెట్టి, సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు నటించి ఈ సినిమా జనవరి 28 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో అన్నగారు వస్తారు అనే పేరుతో అందుబాటులో ఉంది.
కానిస్టేబుల్
నిజాయితీ కలిగిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కథనే ‘కానిస్టేబుల్’ మూవీ. ఇందులో వరుణ్ సందేశ్ లీడ్ రోల్ ప్లే చేశాడు. గ్రామంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. మంకీ మాస్క్ పెట్టి చంపుతుంటారు. మరి దీని వెనుక ఎవరున్నారనేది థ్రిల్ పంచుతుంది. ఈ మూవీ ఈ రోజు (జనవరి 29) ఈటీవీ విన్ లో రిలీజ్ అయింది.
పతంగ్
తెలుగులో వచ్చిన యూత్ ఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘పతంగ్’. ఇందులో ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. గాలిపటాలు ఎగరేసే పోటీలతో ఈ సినిమాను ఇంట్రెస్టింగ్ గా మలిచారు. పతంగ్ మూవీ జనవరి 30న సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రానుంది.

E-Paper












