OTT Movies: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు 12 చాలా స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 4!
OTT Release Movies Friday: ఓటీటీలోకి నిన్న ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉంటే.. అందులో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్క ఓటీటీలోనే 4 సినిమాలు ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి నిన్న ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జీ5, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్‌తోపాటు తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జీ5 ఓటీటీ
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
తడయమ్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
క్రాంతి జ్యోతి విద్యాలయ్ మరాఠీ మాధ్యం (మరాఠీ సోషల్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
అబర్ ప్రళయ్ 2 (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
షట్టర్ (థాయి హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- ఫిబ్రవరి 27
ఫార్ముల 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 8 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 27
ఆహా ఓటీటీ
హాట్ స్పాట్ 2 మచ్ (తెలుగు డబ్బింగ్ తమిళ అంథాలజీ అడల్ట్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ గేమ్ షో)- ఫిబ్రవరి 27
సన్ నెక్ట్స్ ఓటీటీ
హనీ (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 27
నీలి హక్కీ (కన్నడ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 27
హులు ఓటీటీ
ఇన్ ది బ్లింక్ ఆఫ్ యాన్ ఐ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమెన్ (అమెరికన్ మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 27
అట్రోపియా (ఇంగ్లీష్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- ఫిబ్రవరి 27
సీక్రెట్ స్టోరీస్: రోస్లిన్ (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 27
క్రేజీ ఓల్డ్ లేడీ (స్పానిష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- షడ్డర్ ఓటీటీ- ఫిబ్రవరి 27
మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఫిబ్రవరి 27
ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా అంథాలజీ సినిమా)- ముబి ఓటీటీ- ఫిబ్రవరి 27
ఓటీటీలోకి ఒక్కరోజే 18 సినిమాలు
ఇలా నిన్న (ఫిబ్రవరి 27) ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు, తడయమ్, అక్యూజ్డ్, షట్టర్, హాట్ స్పాట్ 2 మచ్, సర్కార్ సీజన్ 6, హనీ, నీలి హక్కి, సీక్రెట్ స్టోరీస్ రోస్లిన్, మోనార్క్, క్రేజీ ఓల్డ్ లేడీ, ఇన్ ది బ్లింక్ ఆఫ్ యాన్ ఐతో కలిపి 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
తెలుగులో 6- ఒకేదాంట్లో 4
ఈ మొత్తం 18 సినిమాల్లో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక వీటన్నింటిలో 4 సినిమాలు ఒక్క జీ5 ఓటీటీలోనే డిజిటల్ ప్రీమియర్ అవడం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


