ఓటీటీలోకి ఈ వారం (ఏప్రిల్ 6 నుంచి 13) 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవనున్నాయి. ఈ 8 ఒకే ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. అంతేకాకుండా వీటిలో అందరు ఇష్టపడే హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు ఎక్కువగా 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
బిలీవ్ మీ: ది ఫాల్స్ ప్రొఫెట్

యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం బిలీవ్ మీ: ది ఫాల్స్ ప్రొఫెట్. ఒక సీక్రెట్ సొసైటీలోకి ప్రవేశించి దైవం పేరుతో మోసాలకు పాల్పడే నకిలీ బాబాల గుట్టును ఒక చిత్రనిర్మాత, కల్ట్ నిపుణుడు ఎలా రట్టు చేశారనేది ఇందులో ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
టెంప్టేషన్ ఐలాండ్ సీజన్ 2
ప్రేమ, ఆకర్షణ, మోసం.. ఈ మూడింటి కలయికతో సాగే పాపులర్ ఓటీటీ రియాలిటీ షో 'టెంప్టేషన్ ఐలాండ్' రెండో సీజన్ ఏప్రిల్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభం కానుంది. తమ బంధం ఎంత బలమైనదో పరీక్షించుకోవడానికి విడిపోయి, కొత్త వ్యక్తులతో సమయం గడిపే నలుగురు జంటల కథ ఇది. బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా ఈ షో సాగుతుంది.
స్క్రీమ్ 7
హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి స్క్రీమ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి ఏడో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్క్రీమ్ 7 ఓటీటీ రిలీజ్ కానుంది. ఏప్రిల్ 10 నుంచి ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
థ్రాష్
సముద్ర తీర ప్రాంత నగరాన్ని ముంచెత్తే భయంకరమైన తుఫానులు, వాటితో పాటు వచ్చే రక్తపిపాసి సొరచేపల దాడులతో సాగే హాలీవుడ్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ థ్రాష్. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 10 నుంచి థ్రాష్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3
{{/usCountry}}సముద్ర తీర ప్రాంత నగరాన్ని ముంచెత్తే భయంకరమైన తుఫానులు, వాటితో పాటు వచ్చే రక్తపిపాసి సొరచేపల దాడులతో సాగే హాలీవుడ్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ థ్రాష్. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 10 నుంచి థ్రాష్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3
{{/usCountry}}ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ ఓటీటీ సిరీస్ ఇప్పుడు తన ముగింపునకు చేరుకుంది. అక్రమ దందాలు, ప్రభుత్వ అధికారుల కుట్రలకు వ్యతిరేకంగా ఒక స్నేహితుల బృందం చేసే పోరాటమే టర్న్ ఆఫ్ ది టైడ్. ఈ సిరీస్ నుంచి వచ్చిన మూడో సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 10న ఓటీటీ రిలీజ్ కానుంది.
ఎ క్వైట్ ప్లేస్ పార్ట్ 2
సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్స్‌లో ఏ క్వైట్ ప్లేస్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎ క్వైట్ ప్లేస్ పార్ట్ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. ఏప్రిల్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఎ క్వైట్ ప్లేస్ పార్ట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. చిన్న శబ్దం చేసినా చంపేసే వింత జీవులతో మనుషులు చేసే పోరాటంగా ఈ మూవీ సాగుతుంది.
హాలోవీన్ ఎండ్స్
పాపులర్ హారర్ థ్రిల్లర్స్‌లో 'హాలోవీన్' సిరీస్ ఒకటి. ఈ సిరీస్ నుంచి ఫైనల్ చాప్టర్‌గా హాలోవీన్ ఎండ్స్ ఓటీటీలోకి వచ్చేయనుంది. నగరంలో జరుగుతున్న మర్మమైన హత్యల వెనుక ముసుగు హంతకుడు మైఖేల్ మైయర్స్ ఉన్నాడని లారీ స్ట్రోడ్ అనుమానిస్తుంది. ఆ తర్వాత ఏమైందనేదే కథ. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 13న ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది.
ది మెన్ హూ బిల్ట్ అమెరికా: ఫ్రాంటియర్స్ మెన్
చరిత్రను ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన మినీ సిరీస్ ఇది. అమెరికన్ విప్లవం నుంచి కాలిఫోర్నియా గోల్డ్ రష్ వరకు.. నేటి ఆధునిక అమెరికా ఆవిర్భావానికి కారణమైన హీరోల వీరగాథలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 13న ది మెన్ హూ బిల్ట్ అమెరికా: ఫ్రాంటియర్స్ మెన్ ఓటీటీ ప్రీమియర్ అవనుంది.