...
...
Next Story

OTT Releases: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర-తెలుగు, హిందీ, తమిళ్ నుంచి హాలీవుడ్ దాకా-స్పెషల్ రిలీజ్‌లు ఇవే!

OTT Releases: అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు ఓటీటీ ప్రియులకు పండగే! నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జియోహాట్‌స్టార్‌లో భారీ చిత్రాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వివిధ భాషల్లో రాబోతున్న టాప్ రిలీజ్‌ల పూర్తి జాబితా ఇక్కడ చూద్దాం. ఈ వారం ఓటీటీలో ఏవి మిస్ అవ్వకూడదో కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం.

Published on: Oct 26, 2026, 11:45:16 IST
Advertisement

OTT Releases: ఈ వారం సౌత్ ఇండియాలో అదిరిపోయే కంటెంట్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ముఖ్యంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'బత్తా' (Baththa) అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

గ్యాంగ్‌స్టర్ సిరీస్ ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర-తెలుగు, హిందీ, తమిళ్ నుంచి హాలీవుడ్ దాకా-స్పెషల్ రిలీజ్‌లు ఇవే!
ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర-తెలుగు, హిందీ, తమిళ్ నుంచి హాలీవుడ్ దాకా-స్పెషల్ రిలీజ్‌లు ఇవే!

ఇక కీర్తి సురేష్, రాధికా ఆప్టే నటించిన లేడీ ఓరియంటెడ్ గ్యాంగ్‌స్టర్ సిరీస్ 'అక్క' (Akka) అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లోనే రాబోతోంది. 1980ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సిరీస్‌పై భారీ అంచనాలున్నాయి. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన మరో రూరల్ డ్రామా 'డోరతీ' (Dorothy) ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది.

తెల్ల కాగితాలు ఓటీటీ

తెలుగు టీనేజీ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ తెల్ల కాగితాలు కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ అక్టోబర్ 29 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5 ఒరిజినల్ రుద్రవనం పీఎస్ ఏమో అక్టోబర్ 30 న డెబ్యూ చేయనుంది.

మరోవైపు జీవీ ప్రకాష్ కుమార్ రొమాంటిక్ హారర్ మిస్టరీ 'ఇమ్మోర్టల్' (Immortal) అక్టోబర్ 30 నుంచి సోనీ లివ్‌లో (తెలుగు డబ్బింగ్‌తో సహా) స్ట్రీమింగ్ కానుంది.

హిందీ ఓటీటీ రిలీజ్‌లు

ఓటీటీలో బాలీవుడ్ కంటెంట్‌కూ ఈ వారం కొదవే లేదు. యూట్యూబ్ సెన్సేషన్ భువన్ బామ్ నటించిన సూపర్ హిట్ కామెడీ సిరీస్ 'డిండోరా' (Dhindora) సీజన్ 1 అక్టోబర్ 28న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది. ఇక ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి 'మీతే మే క్యా హై' (Meethe Mein Kya Hai) అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.

టాక్ షోస్ లవర్స్ కోసం జియోహాట్‌స్టార్‌లో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ గెస్ట్‌లుగా 'కాఫీ విత్ కరణ్ 9' (అక్టోబర్ 28) ఎపిసోడ్ 3 రాబోతోంది. ఈ సీజన్ సెకండ్ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్న సంగతి తెలిసిందే.

మాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీస్

మలయాళ చిత్రాలకు ఓటీటీలోనూ ఎప్పుడూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బిజూ మీనన్ ఫ్యామిలీ కామెడీ మూవీ 'అవరాచన్ అండ్ సన్స్' అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. షైన్ టామ్ చాకో ఫీల్ గుడ్ కామెడీ మూవీ 'అదినాశం వెళ్లప్పొక్కం' సైనా ప్లేలో (Saina Play) వీక్షకులకు అందుబాటులో ఉంది.

యాక్షన్ అండ్ రొమాన్స్

ఇంగ్లీష్ సిరీస్‌ల కోసం ఎదురుచూసే వారికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో క్రిస్ ప్రాట్ నటించిన గ్లోబల్ యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ది టెర్మినల్ లిస్ట్ సీజన్ 2' (The Terminal List Season 2) బిగ్గెస్ట్ ట్రీట్. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో రొమాంటిక్ కామెడీ 'నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 3', గ్లోబల్ హిట్ సాధించిన ఫ్రెంచ్ క్రైమ్ సిరీస్ 'లూపిన్ పార్ట్ 4' (Lupin Part 4) కూడా ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks