...
...
Next Story

OTT Series: ఓటీటీలోకి నయా సిరీస్- వైవాహిక అత్యాచారంపై దివ్యా దత్తా చిరాయా- టీజర్ రిలీజ్- పెళ్లంటే బానిసత్వం కాదంటూ!

ఓటీటీలోకి నయా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. భారతీయ కుటుంబాల్లో సాధారణ విషయంగా మారిపోయిన ‘వైవాహిక అత్యాచారం’ (Marital Rape) నేపథ్యంతో రూపొందిన ఓటీటీ సిరీస్ ‘చిరాయా’. బాలీవుడ్ పాపులర్ నటి దివ్యా దత్తా ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ సిరీస్ చిరాయా టీజర్ ఇవాళ విడుదల అయింది.

Published on: Feb 20, 2026, 20:25:37 IST
Advertisement

భారతీయ సమాజంలో అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన అంశం ‘వైవాహిక అత్యాచారం’ (Marital Rape). పవిత్రమైన బంధంగా భావించే పెళ్లి వెనుక దాగి ఉన్న చీకటి కోణాన్ని ప్రశ్నిస్తూ ఓటీటీలోకి వచ్చేస్తోంది సరికొత్త వెబ్ సిరీస్ ‘చిరాయా’ (Chiraiya).

చిరాయా టీజర్ రిలీజ్

ఓటీటీలోకి నయా సిరీస్- వైవాహిక అత్యాచారంపై దివ్యా దత్తా చిరాయా- టీజర్ రిలీజ్- పెళ్లంటే బానిసత్వం కాదంటూ!
ఓటీటీలోకి నయా సిరీస్- వైవాహిక అత్యాచారంపై దివ్యా దత్తా చిరాయా- టీజర్ రిలీజ్- పెళ్లంటే బానిసత్వం కాదంటూ!

బాలీవుడ్ ప్రముఖ నటి దివ్యా దత్తా ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ చిరాయా టీజర్ శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదలైంది. ఈ చిరాయా టీజర్ ఆరంభంలో పెళ్లి వేడుకలు, కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన పూజ అనే యువతి కనిపిస్తుంది.

కళ్లలో కన్నీళ్లతో మేడపై

అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవదు. మరుసటి క్షణమే ఆ యువతి ఒంటిపై గాయాలతో, కళ్లలో కన్నీళ్లతో మేడపై సూసైడ్ చేసుకునే భయానక స్థితిలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా దివ్యా దత్తా అడిగే ఒక ప్రశ్న సమాజంపై గట్టి దెబ్బ కొడుతుంది.

అది నేరం కాదా?

"ఇదే నా ప్రశ్న.. పెళ్లయ్యాక భార్య ఇష్టంతో సంబంధం లేకుండా భర్త ఆమెను లొంగదీసుకోవడం నేరం కాదా?" అని దివ్యా దత్తా ప్రశ్నిస్తుంది. "పెళ్లి అనేది దేనికో లైసెన్స్ కాదు.. అలాగే మౌనం అంటే అంగీకారం కాదు" అనే సందేశాన్ని చిరాయా టీజర్‌లో బలంగా చూపించారు.

దివ్యా దత్తా ఏమన్నారంటే..

చిరాయా ఓటీటీ సిరీస్‌లో నటించడం తనను ఎంతో ఆలోచింపజేసిందని దివ్యా దత్తా పేర్కొన్నారు. "ఈ పాత్రలో జీవిస్తున్నప్పుడు నాకు ఒక చేదు నిజం ఎదురైంది. బంధాలను కాపాడుకోవడానికో లేక ఇంట్లో ప్రశాంతత కోసమో మహిళలు తమ గళాన్ని ఎంతగా నొక్కేస్తారో నాకు అర్థమైంది" అని దివ్యా దత్తా అన్నారు.

త్యాగాల పేరుతో నొప్పిని భరించడం

శశాంత్ షా దర్శకత్వం వహించిన ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌ను ఎస్‌వీఎఫ్ (SVF) ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఇందులో సంజయ్ మిశ్రా, సిద్ధార్థ్ షా, ప్రసన్న బిష్త్, తిన్ను ఆనంద్, సరితా జోషి వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రలు పోషించారు.

త్వరలోనే జియో హాట్‌స్టార్ (JioHotstar)లో చిరాయా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, నేటి టీజర్‌లో చిరాయా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. వైవాహిక అత్యాచారంపై గళమెత్తేలా, పెళ్లి అంటే బానిసత్వం కాదు అనేలా ఓటీటీలోకి కొత్తగా ఈ చిరాయా సిరీస్ రానుందని తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks