OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో 5 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్- 2 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
OTT Telugu Release: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో కేవలం ఐదు సినిమాలు మాత్రమే స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అన్ని సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. కానీ రెండు తెలుగు స్ట్రయిట్ సినిమాలు మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి గతవారం (ఫిబ్రవరి 16 నుంచి 22 వరకు) తెలుగు భాషలో కేవలం 5 సినిమాలు మాత్రమే స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఉన్నాయి. కానీ, రెండు మాత్రం తెలుగు స్ట్రయిట్ సినిమాలుగా ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో రెండు సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 56 డేస్. ఓ ఇంట్లో జరిగే దారుణ హత్య చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఫిబ్రవరి 18 నుంచి ఈ ఓటీటీ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక మరో సినిమా ఈషా. తెలుగు హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈషా సినిమాలో హెబ్బా పటేల్, సిరి హనుమంత్, అరుణ్ కల్యాణ్, బబ్లూ పృథ్వీరాజ్, మైమ్ మధు, అఖిల్ రాజ్ ఉద్దెమరి తదితరులు నటించారు. 9.1 రేటింగ్ అందుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 20న ఓటీటీ రిలీజ్ అయింది.
చథా పచ్చ ఓటీటీ
తెలుగులో వచ్చిన మలయాళం యాక్షన్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా సినిమా చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్. ముగ్గురు అన్నదమ్ముల చుట్టూ సాగే కథగా తెరకెక్కింది ఈ సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో చథా పచ్చ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి తెలుగు భాషలో కూడా చథా పచ్చా ఓటీటీ రిలీజ్ అయింది.
లక్కీ: ది సూపర్‌స్టార్ ఓటీటీ
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, మలయాళ బ్యూటిఫుల్ అనస్వర రాజన్ హీరోయిన్‌గా తెరకెక్కిన తమిళ ఫ్యామిలీ కామెడీ పొలిటికల్ డ్రామా సినిమా లక్కీ ది సూపర్‌స్టార్. ఓ కుక్కపిల్ల చుట్టూ ఈ సినిమా సాగుతుంది.
జియో హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 20న లక్కీ ది సూపర్ స్టార్ ఓటీటీ రిలీజ్ అయింది. తమిళంతోపాటు తెలుగు సహా ఏడు భాషల్లో లక్కీ ది సూపర్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రేమ రేఖ ఓటీటీ
ప్రతి ఆదివారం కథా సుధ వంటి ఓటీటీ వీక్లీ సిరీస్‌లో భాగంగా స్వచ్ఛమైన సినిమాలు అందించే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్. అలాంటి ఈటీవీ విన్‌లో ఫిబ్రవరి 22 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా సినిమా ప్రేమ రేఖ. షాయాజీ షిండే ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బెస్ట్ ఛాయిస్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


