ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- 6 చాలా ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 4 స్ట్రీమింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో సుమారుగా 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అన్ని స్పెషల్ మూవీస్ కాగా తెలుగు స్ట్రయిట్ సినిమాలుగా ఆరు ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అలాగే, ఒకేదాంట్లో నాలుగు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీలు ఏంటో చూద్దాం.
ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్నాయి.

విభిన్న జోనర్లలో
క్రైమ్ థ్రిల్లర్, హారర్, కామెడీ, ఎమోషనల్ డ్రామా వంటి విభిన్న జోనర్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ తెలుగు స్ర్టయిట్ అండ్ డబ్బింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ వెబ్ సిరీస్)- జనవరి 14
అగాథ క్రిస్టీస్ సెవెన్ డయల్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జనవరి 15
ది రిప్: ట్రస్ట్ హ్యాజ్ ఏ ప్రైస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 16
కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 16
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష‍్మి (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- జనవరి 12
కిల్లర్ ఆర్టిస్ట్ (తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జనవరి 13
దండోరా (తెలుగు రూరల్ సోషల్ డ్రామా మూవీ)- జనవరి 14
ఈటీవీ విన్ ఓటీటీ
ఇట్లు మీ ఎదవ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- జనవరి 15
స్పర్శ (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- జనవరి 18
అనంత (తెలుగు డివోషనల్ డ్రామా సినిమా)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 13
కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జనవరి 15
గుర్రం పాపిరెడ్డి (తెలుగు క్రైమ్ కామెడీ డ్రామా మూవీ)- జీ5 ఓటీటీ- జనవరి 16
షెల్ (తెలుగు డబ్బింగ్ బ్లాక్ కామెడీ బాడీ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జనవరి 16
ఓటీటీలోకి తెలుగులో 13 సినిమాలు
ఇలా గత వారం (జనవరి 12 నుంచి 18 వరకు) తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో డిఫరెంట్ జోనర్లతో అన్ని మూవీస్ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో ఏకంగా 4 సినిమాలు ఒక నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కావడం విశేషం.
ఇంట్రెస్టింగ్‌గా 6 మూవీస్
అంతేకాకుండా వీటిలో ఇంట్రెస్టింగ్‌గా తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఉన్నాయి. అలా ఏకంగా ఆరు తెలుగు స్ట్రయట్ మూవీస్‌గా ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


