...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- అన్నీ చాలా స్పెషల్, 8 మాత్రం ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్!

OTT Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ మూవీస్ చాలా స్పెషల్‌గా ఉన్నా తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 8 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

Published on: Apr 20, 2026, 14:32:23 IST
Advertisement

OTT Release Movies In Telugu Last Week: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ, కామెడీ, ఎమోషనల్ లవ్ డ్రామా వంటి విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అయ్యాయి. ఈటీవీ విన్, ఆహా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఈటీవీ విన్ ఓటీటీ

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- అన్నీ చాలా స్పెషల్, 8 మాత్రం ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- అన్నీ చాలా స్పెషల్, 8 మాత్రం ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్!

అలా చేరే సీత రాముని చెంతకు (తెలుగు లవ్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 16

హాఫ్ హాఫ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- ఏప్రిల్ 17

మా ఇంటి కథ (తెలుగు ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

వేడుక (తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 19

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

టోస్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 15

ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 16

యూత్ (తెలుగు డబ్బింగ్ తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 16

రూమ్‌మేట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- ఏప్రిల్ 17

ఆహా ఓటీటీ

ఆ గ్యాంగ్ రేపు 3 (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్)- ఏప్రిల్ 16

పోచమ్మ(తెలుగు మిస్టరీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

జియో హాట్‌స్టార్ ఓటీటీ

సంభవం అధ్యాయం ఒన్ను (తెలుగు డబ్బింగ్ మలయాళ సైన్స్ ఫిక్షన్ టైమ్ లూప్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 15

సుయోధన (తెలుగు మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం )- ఏప్రిల్ 17

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మట్కా కింగ్ (తెలుగు డబ్బింగ్ హిందీ పీరియాడిక్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

ఓటీటీలోకి తెలుగులో 14 సినిమాలు

ఇలా గత వారం (ఏప్రిల్ 13 నుంచి 19 వరకు) తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

మరింత ఇంట్రెస్టింగ్‌గా 8

అయితే, వీటిలో తెలుగు స్ట్రయిట్ సినిమాలుగా పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, అలా చేరే సీత రాముని చెంతకు, ప్రియదర్శి-సాయి కుమార్ సుయోధన, హాఫ్ హాఫ్, అర్జున్ అంబటి పోచమ్మ, ఆ గ్యాంగ్ రేపు 3, మా ఇంటి కథ, వేడుకతో 8 సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks