OTT: ఓటీటీలో అదరగొడుతున్న వెబ్ సిరీస్‌లు.. ట్రెండింగ్‌లో వాటిదే డామినెన్స్.. క్రైమ్ థ్రిల్లర్లు.. ఈ వీకెండ్‌కు బెస్ట్
OTT: ఓటీటీలో వెబ్ సిరీస్ లు అదరగొడుతున్నాయి. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లు సత్తాచాటుతున్నాయి. ఒకే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నాలుగు వెెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ దక్కుతోంది. ఈ వీకెండ్ కు వీటిపై ఓ లుక్కేయండి.
వీకెండ్ వచ్చేసింది. ఓటీటీలో ఏం చూద్దామా అని సెర్చ్ చేస్తున్నారా? మీ కోసమే ఈ ట్రెండింగ్ వెబ్ సిరీస్ లిస్ట్. జియోహాట్‌స్టార్‌లో అదరగొడుతున్న ఈ నాలుగు వెబ్ సిరీస్ లపై లుక్కేయండి. ఇందులో క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్లున్నాయి. ఈ వీకెండ్ కు ఇవి బెస్ట్.

ఓటీటీ ట్రెండింగ్
జియోహాట్‌స్టార్ ఓటీటీ తెలుగులో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ షో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా నాలుగు వెబ్ సిరీస్ లే ఉన్నాయి. అవే.. ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’, ‘కాట్టాన్’, ‘రిసార్ట్’, ‘చిరాయా’. ఈ వెబ్ సిరీస్ లు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుంటున్నాయి.
విక్రమ్ ఆన్ డ్యూటీ
బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా నటించిన వెబ్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’. ఇదో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతోంది. ప్రతి ఎపిసోడ్ లో ఒక కేసును సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ గా నిఖిల్ నటించాడు. రియల్ లైఫ్ క్రైమ్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.
కాట్టాన్
వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ ప్లే చేసిన సిరీస్ పేరు ‘కాట్టాన్’. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ శుక్రవారం (మార్చి 27) ఓటీటీలో రిలీజైంది. ఒకేసారి 10 ఎపిసోడ్లు జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చాయి.
కేసులు లేకపోవడంతో ఓ పోలీస్ స్టేషన్ ను మూసేయాలని చూస్తారు. అదే సమయంలో కొండ మీద మొండెం లేని తల ఒకటి దొరుకుతుంది. మరి ఆ తల ఎవరిది? దాని వెనుకాల కథ ఏంటీ? అన్నది కాట్టాన్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.
రిసార్ట్
జియోహాట్‌స్టార్‌లోని రిసార్ట్ సిరీస్ కూడా మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఓ రిసార్ట్ లోని హోటల్లో పని చేసే సర్వీస్ బాయ్ కథ ఇది. అతను ఎప్పటికైనా మంచి చెఫ్ గా ఎదగాలని అనుకుంటాడు. హోటల్ కిచెన్ లో వంట చేయాలని కల కంటాడు. కానీ అందుకు హెడ్ చెఫ్ ఒప్పుకోడు. పైగా అవమానిస్తాడు. మరి ఆ కుర్రాడు ఏం చేశాడన్నది ఈ రిసార్ట్ వెబ్ సిరీస్ లో చూడాల్సిందే.
చిరాయా
మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశం చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కిన సిరీస్ పేరు ‘చిరాయా’. ఇందులో దివ్యా దత్తా ప్రధాన పాత్ర పోషించింది. ఆమె మరిది ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయికి సెక్స్ అంటే భయం. ఆ విషయాన్ని పట్టించుకోకుండా అతను మృగంలా బిహేవ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వదిన అతనికి ఎలా బుద్ధి చెప్పిందన్నదే చిరాయా వెబ్ సిరీస్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


