...
...
Next Story

Pakistanis: సారా అర్జున్ మినీ స్కర్ట్ నుంచి ఉర్దూ బోర్డుల వరకు అంతా కామెడీనే- ధురంధర్ సినిమాలపై పాకిస్థానీయుల రియాక్షన్!

Pakistanis Reacts To Dhurandhar And The Revenge: ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్, ధురంధర్ 2 చిత్రంలో చూపించిన అంశాలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని కొందరు పాకిస్థానీయులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కరాచీ, ల్యారీ ప్రాంతాల చిత్రీకరణపై వారు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

Published on: Mar 28, 2026, 20:20:15 IST
Advertisement

దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే, సరిహద్దు అవతల మాత్రం ఈ రెండు సినిమాలపై భిన్నమైన చర్చ నడుస్తోంది.

సారా అర్జున్ మినీ స్కర్ట్ నుంచి ఉర్దూ బోర్డుల వరకు అంతా కామెడీనే- ధురంధర్ సినిమాలపై పాకిస్థానీయుల రియాక్షన్!
సారా అర్జున్ మినీ స్కర్ట్ నుంచి ఉర్దూ బోర్డుల వరకు అంతా కామెడీనే- ధురంధర్ సినిమాలపై పాకిస్థానీయుల రియాక్షన్!

రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. పాకిస్థాన్‌లోని కరాచీ, ల్యారీ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. అయితే, ఈ సినిమాలో చూపించిన ల్యారీ గ్యాంగ్ వార్స్, అక్కడి సంస్కృతి వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని కొందరు పాకిస్థానీయులు పెదవి విరుస్తున్నారు.

"కరాచీని గెలవవచ్చు కానీ.. పాకిస్థాన్‌ను కాదు!"

రోహన్ భట్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ బాలిలో కలిసిన కొందరు పాకిస్థానీయులతో ఈ సినిమా గురించి చర్చించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

"ధురంధర్ సినిమాకు అనవసరమైన హైప్ ఇచ్చారు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. 'ఎవరు ల్యారీని శాసిస్తే వారు కరాచీని శాసిస్తారు, ఎవరు కరాచీని శాసిస్తే వారు పాకిస్థాన్‌నే శాసిస్తారు' అని. ఇది వినడానికి మాకు చాలా నవ్వు తెప్పించింది. కరాచీ నుంచి పాకిస్థాన్‌ను శాసించడం అసాధ్యం. రాజకీయం చేయాలంటే అది లాహోర్ నుంచే సాధ్యమవుతుంది" అని ఆ పాకిస్థానీ వ్యక్తి పేర్కొన్నారు.

తన పూర్వీకులు ల్యారీ ప్రాంతానికి చెందినవారేనని, అక్కడ గ్యాంగ్ వార్స్ ఉన్న మాట వాస్తవమే అయినా, అవి కేవలం రెండు వీధుల మధ్య జరిగే గొడవలే తప్ప దేశాన్ని శాసించే స్థాయిలో ఉండవని ఆయన వివరించారు.

మినీ స్కర్టులు.. ఉర్దూ బోర్డులు.. అన్నీ కామెడీనే!

రణ్‌వీర్ సింగ్ ధరించిన హాఫ్ స్లీవ్ కుర్తాల గురించి కూడా వారు స్పందించారు. పాకిస్థాన్‌లో ఎవరూ అలాంటి దుస్తులు ధరించరని, అది కేవలం సినిమాటిక్ ఎఫెక్ట్ కోసమే వాడారని తెలిపారు. ఇక సినిమాలో సూపర్ హిట్ అయిన 'FA9LA' పాట బాగున్నప్పటికీ, అది అసలు బలోచీ పాటే కాదని.. ఆ పాట పాడింది బహ్రెయిన్ కు చెందిన ర్యాపర్ అని గుర్తు చేశారు.

రాజకీయ నాయకుడి కూతురు పారిపోవడమా?

ఒక బహుళజాతి నాయకుడి కూతురు, గూఢచారితో కలిసి అంత సులభంగా పారిపోవడం పాకిస్థాన్ లాంటి దేశాల్లో అసాధ్యమని వారు తేల్చి చెప్పారు. డ్రామా కోసం ఆ సీన్లు పెట్టారని వారు విశ్లేషించారు. అయితే, 'ధురంధర్ 2' (ది రివెంజ్) లో వీటికి సంబంధించిన కొన్ని లాజికల్ వివరణలు ఇచ్చినప్పటికీ, స్థానిక పాకిస్థానీయులు మాత్రం వీటిని అంగీకరించడం లేదు.

పాకిస్థానీయుల రియాక్షన్

గతేడాది డిసెంబర్‌లో మొదటి భాగం, మార్చి 19న రెండో భాగం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. అయితే పాకిస్థాన్, గల్ఫ్ దేశాల్లో మాత్రం ఈ చిత్రాల విడుదలకు అనుమతి లభించలేదన్న విషయం తెలిసిందే. కానీ, వివిధ మార్గాల్లో ధురంధర్ సినిమాలను చూసిన పాకిస్థానీయులు సారా అర్జున్ మినీ స్కర్ట్ నుంచి ఉర్దూ బోర్డుల వరకు అంతా కామెడీ అన్నట్లుగా వారు రియాక్ట్ అయ్యారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe