Parivarik Manuranjan OTT Release Teaser Out: వెర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి, హీరో సిద్ధార్థ్ భార్య, హీరోయిన్ అదితి రావు హైదరి తొలిసారి జంటగా తెరపై సందడి చేయనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం 'పరివారిక్ మనురంజన్'.
డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్

ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ 'సోనీ లివ్' (Sony LIV) ద్వారా ఓటీటీ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆకట్టుకునేలా పరివారిక్ మనురంజన్ టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
కుటుంబ బంధాలు, ప్రేమ, వినోదం మేళవింపుగా..
పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'మనూ', 'రంజన్' అనే ఇద్దరి మధ్య చిగురించే ప్రేమకథను హాస్యభరితంగా చూపించనున్నారు. "మనూ, రంజన్ల ప్రేమకథ అందరికీ కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది" అని సోనీ లివ్ వెల్లడించింది.
'సమ్మోహనం', 'మహాసముద్రం' చిత్రాలతో
గతంలో 'సమ్మోహనం', 'మహాసముద్రం' చిత్రాలతో తెలుగులో అట్రాక్ట్ చేసిన అదితి రావు హైదరి, 'మీర్జాపూర్', 'స్త్రీ' చిత్రాలతో డిజిటల్ వేదికపై అపారమైన ప్రజాదరణ పొందిన పంకజ్ త్రిపాఠి (50 ఏళ్లు) కాంబినేషన్ కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై మంచి ఆసక్తి నెలకొంది.
"కథ విని నవ్వకుండా ఉండలేకపోయా" : అదితి రావు హైదరి
"కథ చదువుతున్నంతసేపూ నా పెదవులపై చిరునవ్వు చెరగలేదు. ఆ సన్నివేశాల్లోని కామెడీ టైమింగ్, అనుకోని మలుపులు, కథలో ఉన్న అమాయకత్వం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. పంకజ్ సర్ సరసన నటించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. కామెడీ చేయడంలో ఆయనొక దిగ్గజం. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది" అని అదితి రావు హైదరి ఆనందం వ్యక్తం చేశారు.
"సింపుల్‌గా ఉంటూనే కడుపుబ్బ నవ్విస్తుంది": పంకజ్ త్రిపాఠి
{{/usCountry}}"కథ చదువుతున్నంతసేపూ నా పెదవులపై చిరునవ్వు చెరగలేదు. ఆ సన్నివేశాల్లోని కామెడీ టైమింగ్, అనుకోని మలుపులు, కథలో ఉన్న అమాయకత్వం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. పంకజ్ సర్ సరసన నటించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. కామెడీ చేయడంలో ఆయనొక దిగ్గజం. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది" అని అదితి రావు హైదరి ఆనందం వ్యక్తం చేశారు.
"సింపుల్‌గా ఉంటూనే కడుపుబ్బ నవ్విస్తుంది": పంకజ్ త్రిపాఠి
{{/usCountry}}"ఈ కథ చాలా సహజంగా, అమాయకంగా ఉంటూనే విపరీతంగా నవ్విస్తుంది. అందుకే వెంటనే ఒప్పుకున్నాను. మనసును హత్తుకునే కథలతో వచ్చే చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకమే. అదితితో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి, ఆమె నటన అంటే నాకు ఎంతో అభిమానం" అని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు.
దిగ్గజ సాంకేతిక నిపుణుల కలయిక
కాగా పరివారిక్ మనురంజన్ చిత్రానికి వరున్ వి. శర్మ దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను బ్రిజేంద్ర కాలా, అలీ అబ్బాస్ జాఫర్, వరున్ శర్మ కలసి నిర్వహించారు. సంభాషణలను బ్రిజేంద్ర కాలా అందించారు.
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ
భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, ఏఏజెడ్ ఫిల్మ్స్ పతాకాలపై వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి, హిమాంశు కిషన్ మెహతా, అలిషియా జాఫర్ నిర్మించారు. ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే పరివారిక్ మనురంజన్ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని సోనీ లివ్ అధికారికంగా ప్రకటించనుంది.
పంకజ్ త్రిపాఠి ఖాతాలో మరో అరుదైన ఘనత
మరోవైపు పంకజ్ త్రిపాఠి అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త బాధ్యత చేపట్టనున్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్ ఎతిహాద్ అరేనా వేదికగా జరగనున్న 27వ ఐఫా (IIFA) వేడుకల్లో భాగంగా 'ఐఫా డిజిటల్ అవార్డ్స్'కు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఆయన కెరీర్లో ఒక అంతర్జాతీయ అవార్డుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.