...
...
Next Story

Papam Prathap Review: పాపం ప్రతాప్ రివ్యూ- పెళ్లయిన 3 రోజులకే భార్య పంచాయితీ- తిరువీర్, పాయల్ మూవీ నవ్వించిందా?

Papam Prathap Movie Review In Telugu: మసూద ఫేమ్ తిరువీర్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం పాపం ప్రతాప్. ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి పాపం ప్రతాప్ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Apr 17, 2026, 09:55:58 IST
Advertisement

Papam Prathap Review In Telugu: మసూద, పరేషాన్ చిత్రాలతో మెప్పించిన తిరువీర్ హీరోగా తెరకెక్కిన మరో సినిమా పాపం ప్రతాప్. రూరల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయల్ రాధాకృష్ణ చేసింది. ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవ్వించిందా లేదా అనేది నేటి పాపం ప్రతాప్ రివ్యూలో తెలుసుకుందాం.

పాపం ప్రతాప్ రివ్యూ- పెళ్లయిన 3 రోజులకే భార్య పంచాయితీ- తిరువీర్, పాయల్ మూవీ నవ్వించిందా?
పాపం ప్రతాప్ రివ్యూ- పెళ్లయిన 3 రోజులకే భార్య పంచాయితీ- తిరువీర్, పాయల్ మూవీ నవ్వించిందా?

టైటిల్: పాపం ప్రతాప్

నటీనటులు: తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, అజయ్ ఘోష్, రాశి, దేవి ప్రసాద్, ప్రసాద్ బెహరా, గోపరాజు రమణ, రవి ఆంటోని, రఘుబాబు, శ్రీనివాస్ అవసరాల తదితరులు

కథ, దర్శకత్వం: ఎస్పీ దుర్గా నరేష్

సంగీతం: కేఎం రాధాకృష్ణ, సురేష్ బొబ్బిలి (బీజీఎమ్)

ఎడిటింగ్: అన్వర్ అలీ

సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్ ఎస్వీ

నిర్మాతలు: గడ్డం రాకేష్ రెడ్డి, రుద్ర దేవ్ మదిరెడ్డి

విడుదల తేది: ఏప్రిల్ 17, 2026

కథ:

లంక గ్రామంలో పురుగుల మందు వ్యాపారం చేసే వీరయ్య (అజయ్ ఘోష్)కు కుమారుడు ప్రతాప్ (తిరువీర్) ఉంటాడు. అతను చిన్నప్పటి నుంచీ తన క్లాస్‌మేట్ బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఎంతో ప్రేమిస్తాడు. బుజ్జమ్మకు కూడా తన ప్రేమ విషయం చెప్పి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు ప్రతాప్.

అయితే, పెళ్లి తర్వాత మూడు రోజుల ముచ్చట అయిన తర్వాత ఊరి పెద్దలతో బుజ్జమ్మ పంచాయితీ పెట్టిస్తుంది. తన భర్త రాత్రి ఇబ్బంది పెడుతున్నాడని కాస్తా చెప్పి అసలు సమస్య ఏంటో పూర్తిగా చెప్పకుండా అందరికి షాక్ ఇస్తుంది బుజ్జమ్మ. భర్త ప్రతాప్‌ను తన సమస్య ఏంటో తనే తెలుసుకుని, సరిదిద్దుకుని కాపురానికి రావాలని బుజ్జమ్మ వెళ్లిపోతుంది. దాంతో ప్రతాప్‌పై ఊరందరిలో అనుమానం మొదలవుతుంది.

మనుషులకు కొన్ని వింతైన జబ్బులు ఉంటాయి. వాటి వల్ల వారి వైవాహిక జీవితం ఎలాంటి గందరగోళంలో పడుతుందనే కాన్సెప్ట్‌తో పాపం ప్రతాప్ సినిమాను ఆవిష్కరించారు డైరెక్టర్ ఎస్పీ దుర్గా నరేష్. నిజానికి ఇది ఒక చిన్న పాయింట్‌తో అల్లిన సినిమా. భార్యపై అంతులేని ప్రేమ, తనలో ఉన్న తెలియని సమస్య మధ్య ఉండే సంఘర్షణ చుట్టూ కామెడీ, ఎమోషన్స్, డ్రామా అంశాలతో ఈ సినిమాను బాగానే చూపించారు.

లంక గ్రామంలో బుజ్జమ్మపై ప్రతాప్ ప్రేమ, నవ్వించే సన్నివేశాలతో సరాదాగా సాగుతుంది మూవీ. ఆ వెంటనే పెళ్లి, వివాహం అయిన మూడు రోజులకే భార్య పంచాయితీ పెట్టడం వంటి అంశాలతో చకాచకా కథలోకి సినిమా వెళ్తుంది. భర్తలో ఉన్న లోపం ఏంటో భార్య పూర్తిగా చెప్పకుండా, అది తననే తెలుసుకోమని చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తుంది. అందరిలో చాలా ఆలోచనలను తిరగడం, ఈ క్రమంలో వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది.

ఇంటర్వెల్‌లో మలుపు

ఇంటర్వెల్‌లో వచ్చే మలుపు బాగుంటుంది. ఇక తనలోని సమస్య ఏంటో తెలుసుకునేందుకు స్నేహితుడితో ప్రతాప్ చేసే ప్రయత్నాలు బాగున్నాయి. రచ్చబండ నేపథ్యంలో గ్రామస్థులకు, ప్రతాప్‌కు మధ్య వచ్చే సీన్స్ నవ్విస్తాయి. సందార్భానుసారం వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో స్టోరీ అక్కడిక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎమోషనల్‌గా డ్రామాతో పర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంది.

అయితే, చివరిగా ఒక చిన్నా పాయింట్‌తో ఇంత సినిమా చేశారా అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ, చూస్తున్నంత సేపు సరదాగా, కామెడీతో అలరిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. సంగీతం బాగుంది. మూడ్‌ను బట్టి వచ్చే బీజీఎమ్ అలరిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. డైరెక్టర్ టేకింగ్ మెచ్చుకోవచ్చు.

ప్రతాప్ పాత్రలో తిరువీర్ చాలా బాగా నటించాడు. అమాయకత్వం నిండిన ప్రతాప్ పాత్రలో తిరువీర్ ఒదిగిపోయిన విధానం ఆకట్టుకుంటుంది. బుజ్జమ్మగా పాయల్ రాధాకృష్ణ బాగా సూట్ అయింది. నటనతో మెప్పిస్తుంది. ఇక అందరిపై విరుచుకుపడే హీరో తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ నటన ఆకట్టుకుంటుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే

అజయ్ ఘోష్‌కు జోడీగా సీనియర్ హీరోయిన్ రాశి తన పాత్ర పరిధి మేర మెప్పిస్తారు. కొడుకు ప్రతాప్‌తో వచ్చే ఎమోషనల్ సీన్లలో ఆమె అనుభవం ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ బాగా ఆకట్టుకుంటాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ పాపం ప్రతాప్ ఆడియెన్స్‌ను నవ్విస్తాడు.

రేటింగ్: 3/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe