...
...
Next Story

Pawan Kalyan Vijay CM: తమిళనాడు సీఎంకు చిరంజీవి ఫోన్- విజయ్‌తో పోలికలపై పవన్ కల్యాణ్ కామెంట్స్- కుక్కల హడావిడి అంటూ!

Pawan Kalyan On Comparison With Vijay As CM: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్‌తో తనను పోల్చడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు భిన్నమైనవని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: May 16, 2026, 11:03:11 IST
Advertisement

Pawan Kalyan On Comparison With Vijay As CM: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ స్టార్ హీరో సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే, విజయ్ నేరుగా సీఎం కాగానే సోషల్ మీడియా వేదికగా ఆయనను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పోల్చడం మొదలుపెట్టారు నెటిజన్లు.

నాపై ఒత్తిడి తెస్తున్నారు.. మంగళగిరిలో పవన్ కామెంట్స్

తమిళనాడు సీఎంకు చిరంజీవి ఫోన్- విజయ్‌తో పోలికలపై పవన్ కల్యాణ్ కామెంట్స్- కుక్కల హడావిడి అంటూ!
తమిళనాడు సీఎంకు చిరంజీవి ఫోన్- విజయ్‌తో పోలికలపై పవన్ కల్యాణ్ కామెంట్స్- కుక్కల హడావిడి అంటూ!

పవన్ కల్యాణ్ కూడా నేరుగా పార్టీ పెట్టి సీఎం అయి ఉంటే బాగుండేదనే చర్చ నడుస్తోంది. ఈ క్రేజీ కంపారిజన్స్‌పై పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ విషయంపై మాట్లాడారు. విజయ్ పేరును నేరుగా ఎత్తకుండానే తనపై వస్తున్న ఒత్తిడిని ఆయన పంచుకున్నారు.

"పొరుగు రాష్ట్రంలో ఒక నటుడు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు కూడా ఆంధ్రప్రదేశ్‌లో అలాగే చేసి ఉండాల్సింది అంటూ చాలా మంది నాకు మెసేజ్‌లు పంపుతున్నారు" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల తీరును వివరిస్తూ ఒక సామెతను గుర్తుచేశారు. "ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లుంది వ్యవహారం. అది మన ఇంట్లో పెళ్లి కాదనే విషయం తెలియకుండా చిన్న పిల్లలు అటూ ఇటూ పరిగెత్తినట్లు కొందరు ప్రవర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. 2019 ఎన్నికల్లో నేను ఒంటరిగా పోటీ చేసినప్పుడు ప్రజలు ఏం చేశారు? కనీసం నా సొంత మంత్రులు కూడా నా పక్కన నిలబడలేదు. కాబట్టి ఆ తమిళనాడు రాజకీయాలతో నన్ను పోల్చకండి" అని పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టారు.

విజయ్‌కు ఫోన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి అభినందనలకు తమిళనాడు కొత్త సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన చిరంజీవి తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాను తాను చూశానని, మెగాస్టార్‌ను వెండితెరపై చూడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని దళపతి విజయ్ పేర్కొన్నారు.

దాంతో పాటు, విజయ్ నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్' వివాదంలో ఉన్నప్పుడు, ఆ సినిమా పైరసీ లీక్ వ్యవహారంలో చిరంజీవి తనకు మద్దతుగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానున్న చిరంజీవి తదుపరి చిత్రానికి విజయ్ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.

స్టార్ల తదుపరి చిత్రాల ముచ్చట్లు

రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ ఈ ఏడాది 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో అలరించారు. ఆయన తదుపరి సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో లైన్‌లో ఉంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' విజయంతో పాటు 'విశ్వంభర', శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో ఫ్యూచర్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ఇక తమిళ సీఎం విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పే క్రమంలో చేసిన 'జన నాయగన్' చిత్రం జనవరి నుంచి సెన్సార్ (CBFC) క్లియరెన్స్ కోసం వేచి చూస్తోంది. త్వరలో జన నాయగన్ సినిమా కూడా విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe