...
...
Next Story

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్‌ది ఫేక్ లవ్ స్టోరీ, ఓటీటీ రియాలిటీ షోలను టీవీ సీరియల్స్‌లా మారుస్తున్నారు: పాయల్ ఆరోపణలు

Payal Rohatgi On OTT Reality Shows: ఓటీటీ రియాలిటీ షోలలో టీఆర్‌పీ రేటింగుల కోసం దొంగ ప్రేమకథలను సృష్టిస్తున్నారంటూ నటి పాయల్ రోహత్గీ సంచలన నిజాలు బయటపెట్టారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ రియాలిటీ షోలను డైలీ సీరియల్స్‌లా మార్చేస్తారంటూ, మృణాల్ ఠాకూర్‌ది ఫేక్ లవ్ స్టోరీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Published on: Jul 11, 2026, 07:59:33 IST
Advertisement

Payal Rohatgi On OTT Reality Shows: నాచ్ బలియే, బిగ్ బాస్, లాక్ అప్ వంటి పాపులర్ ఓటీటీ రియాలిటీ షోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి, వ్యాపారవేత్త పాయల్ రోహత్గీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ముక్కుసూటితనంతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పాయల్, తాజాగా ఓటీటీ రియాలిటీ షోల వెనుక జరిగే అసలు గుట్టును రట్టు చేశారు.

రియాలిటీ షోల క్రేజ్

మృణాల్ ఠాకూర్‌ది ఫేక్ లవ్ స్టోరీ, ఓటీటీ రియాలిటీ షోలను టీవీ సీరియల్స్‌లా మారుస్తున్నారు: పాయల్ ఆరోపణలు
మృణాల్ ఠాకూర్‌ది ఫేక్ లవ్ స్టోరీ, ఓటీటీ రియాలిటీ షోలను టీవీ సీరియల్స్‌లా మారుస్తున్నారు: పాయల్ ఆరోపణలు

నెట్‌ఫ్లిక్స్‌లో విజయవంతంగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న 'లాక్ అప్ సీజన్ 2' నేపథ్యంలో పాయల్ రోహత్గీ ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలకు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. అయితే ఇవన్నీ నిజంగానే జరుగుతాయా లేక వెనుక ఏమైనా స్క్రిప్ట్ నడుస్తుందా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటాయి.

ఏక్తా కపూర్ షోలలో అన్నీ దొంగ ప్రేమకథలే!

సరిగ్గా ఇదే విషయంపై పాయల్ రోహత్గీ స్పందిస్తూ, మేకర్స్ టీఆర్‌పీ రేటింగుల కోసం రియాలిటీ షోలను కాస్తా డ్రామా సీరియల్స్‌లా మార్చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తాను పాల్గొన్న 'నాచ్ బలియే' షో అనుభవాలను గుర్తుచేసుకుంటూ బాలీవుడ్ టాప్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్‌పై పాయల్ సంచలన ఆరోపణలు చేశారు.

"రియాలిటీ షోల మేకర్స్ ఎవరైనా సరే, వాటిని దయచేసి టీవీ సీరియల్స్‌లా మార్చకండి. గతంలో నేను ఏక్తా కపూర్‌తో కలిసి నాచ్ బలియే షో చేసినప్పుడు, ఆమె దాన్ని ఒక డైలీ సోప్‌లా మార్చడానికి ప్రయత్నించారు. తమకు అలాంటి కాన్సెప్ట్ కావాలని ఓపెన్ గానే చెప్పారు" అని పాయల్ రోహత్గీ వెల్లడించారు.

మృణాల్ ఠాకూర్‌ది ఫేక్ లవ్ స్టోరీనే

ఇలా డ్రామాగా మార్చితే ఎప్పటికీ బిగ్ బాస్ లాంటి సుదీర్ఘ కాలం నడిచే నిజమైన రియాలిటీ షోలతో పోటీ పడలేరని హితవు పలికారు. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న లాక్ అప్ సీజన్ 2 లోనైనా ఏక్తా కపూర్ ఇలాంటి పనులు చేయకుండా ఉంటే ఆ ఓటీటీ షోకి మంచిదని సలహా ఇచ్చారు పాయల్ రోహత్గీ.

రియాలిటీ షోలు తన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చాయో కూడా పాయల్ రోహత్గీ వివరించారు. వయసు పెరిగే కొద్దీ మనుషుల్లో వచ్చే మార్పులను ఈ షోలు ప్రతిబింబిస్తాయని చెప్పారు.

20 ఏళ్ల వయసులో అరుపులు.. 40 ఏళ్లలో మెచ్యూరిటీ!

"నేను బిగ్ బాస్, నాచ్ బలియే వంటి ఎన్నో షోలు చేశాను. వాటన్నింటినీ నా నిజ జీవితంలాగే భావించాను. 20 ఏళ్ల వయసులో కోపం వస్తే గట్టిగా అరుస్తాం. అదే 40 ఏళ్లకు వచ్చాక అరిచి సమయం వృథా చేయకుండా సింపుల్‌గా ఫోన్ కట్ చేస్తాం. నా జీవితంలో వచ్చిన ఈ మార్పులన్నీ రియాలిటీ షోల ద్వారా అభిమానులు చూశారు. ఈ షోలు నా వ్యక్తిగత ఎదుగుదలకు ఎంతో సహాయపడ్డాయి" అని పాయల్ పేర్కొన్నారు.

ప్రస్తుతం తాను కొత్తగా సంగీతం నేర్చుకోవడంలో బిజీగా ఉండటం వల్ల 'లాక్ అప్ 2' చూడలేకపోతున్నానని, కానీ కంటెస్టెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని పాయల్ అన్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'లాక్ అప్: సచ్ యా సజా' షోకు ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

రామ్ కపూర్, ధీరజ్ ధూపర్, శివాంగి జోషి, శిల్పా షిండే వంటి పాపులర్ స్టార్లతో పాటు రియాజ్, యోగేష్ రావత్, ఆకాంక్ష చౌదరి, శ్రేయ క‌ల్రా వంటి సోషల్ మీడియా స్టార్స్ ఈ జైలు సెటప్ షోలో కంటెస్టెంట్స్‌గా పోటీ పడుతున్నారు. శనివారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఈ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ షో ప్రసారమవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe