...
...
Next Story

Peddi Vs Lenin: పెద్ది వర్సెస్ లెనిన్ బాక్సాఫీస్ ఫైట్.. ఒక రోజు తేడాతో థియేటర్లకు రామ్ చరణ్, అఖిల్ అక్కినేని సినిమాలు

Peddi Vs Lenin: బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ ఫైట్ కు రంగం సిద్ధమవుతోంది. కలెక్షన్ల వేటలో పెద్ది వర్సెస్ లెనిన్ మధ్య భారీ యుద్ధమే జరగనుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు తేడాతో థియేటర్లకు రాబోతున్నాయి.

Published on: Apr 30, 2026, 05:56:17 IST
Advertisement

Peddi Vs Lenin: జూన్ లో బాక్సాఫీస్ ఫైట్ కు రెండు తెలుగు సినిమాలు సై అంటున్నాయి. ఇప్పటికే రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీస్ ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ చిత్రాలే ‘పెద్ది’, ‘లెనిన్’. జూన్ లో పెద్ది వర్సెస్ లెనిన్ బాక్సాఫీస్ ఫైట్ ఇప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారింది.

పెద్ది రిలీజ్ డేట్

పెద్ది వర్సెస్ లెనిన్ బక్సాఫీస్ ఫైట్ (x)
పెద్ది వర్సెస్ లెనిన్ బక్సాఫీస్ ఫైట్ (x)

బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో రామ్ చరణ్ గా హీరోగా నటిస్తున్న మూవీ ‘పెద్ది’. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 25న రిలీజ్ చేస్తామని డైరెక్టర్ బుచ్చిబాబు పేర్కొన్నాడు. ఇప్పటికే పెద్ది మూవీ విడుదల రెండు సార్లు వాయిదా పడింది. మార్చి 27న రిలీజ్ కావాల్సిన మూవీ ఏప్రిల్ 30కి ఫస్ట్ పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత జూన్ కు మారింది.

లెనిన్ విడుదల తేదీ

ఇక అక్కినేని అఖిల్ హీరోగా చేస్తున్నలెనిన్ సినిమా జూన్ 26 నే రావడం ఖాయమని నాగార్జున రీసెంట్ పోస్టుతో మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా కూడా మార్చిలో రావాల్సింది. కానీ పెద్ది మూవీ కోసం పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి లెనిన్ వాయిదా పడే సూచనలు కనిపించడం లేదు. జూన్ 26 డేట్ పై మేకర్స్ పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. ఇలా ఒకే రోజు తేడాతో పెద్ది, లెనిన్ థియేటర్లకు రాబోతున్నాయి.

బాక్సాఫీస్ ఫైట్

పెద్ది వర్సెస్ లెనిన్ బాక్సాఫీస్ ఫైట్ తో ఏ మూవీకి లాభమనే చర్చలు జోరందుకున్నాయి. రామ్ చరణ్ పెద్ది మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో క్రికెటర్ గా, కుస్తీ యోధుడిగా చెర్రీ కనిపించనున్నాడు. ఇప్పటికే గ్లింప్స్, పాటలు అదరగొట్టాయి. పెద్ది హైప్ ను పెంచేశాయి.

మరోవైపు ఒక్క సాలిడ్ హిట్ కోసం అఖిల్ అక్కినేని కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎదురు చూస్తున్నాడు. డిఫరెంట్ జోనర్లు ట్రై చేసినా అతనికి లక్ కలిసి రాలేదు. ఇప్పుడు లెనిన్ తోనైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ‘‘లెనిన్ ఫస్ట్ కట్ చూశానని, ఇందులో అఖిల్ ను కొత్తగా చూస్తారని’’ నాగ్ కాన్పిడెంట్ గా చెప్తున్నాడు.

మరి ఒక రోజు ముందు వచ్చే పెద్ది ధాటిని తట్టుకుని లెనిన్ నిలబడుతుందా? ఏ సినిమా హిట్ అవుతుంది? అన్నది వేచి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks