Pithapuramlo Ala Modalaindi Release Date Announced: టాలీవుడ్‌లో కంటెంట్ ఆధారిత కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అదే బాటలో మన చుట్టూ ఉండే సహజమైన పాత్రలు, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో వస్తున్న కొత్త చిత్రం 'పిఠాపురంలో.. అలా మొదలైంది'.
ప్రేయసి రావే డైరెక్టర్

'ప్రేయసి రావే' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఆకట్టుకున్న సీనియర్ డైరెక్టర్ మహేష్ చంద్ర ఈ పిఠాపురంలో అలా మొదలైంది చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చేతికి డిస్ట్రిబ్యూషన్
'హనుమాన్' వంటి పాన్-ఇండియా విజయాన్ని అందుకున్న ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ 'ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్' ఈ పిఠాపురంలో అలా మొదలైంది సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తుండటం విశేషం. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు.
తండ్రీకూతుళ్ల అనుబంధం!
ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ పిఠాపురంలో అలా మొదలైంది సినిమాపై పరిశ్రమ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ప్రేమ, సునిశితమైన హాస్యం, కుటుంబ సెంటిమెంట్‌తో పాటు తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆప్యాయతలను ఎంతో అద్భుతంగా చూపించారు. నేటి యువతకు అవసరమైన ఒక మంచి సందేశాన్ని కూడా కథలో భాగంగా చేర్చారు.
బ్రహ్మానందం వాయిస్ ఓవర్
"మన సమాజంలో మన కళ్లముందే తిరిగే పాత్రలు, రోజూ జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు అందించిన వాయిస్ ఓవర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది" అని దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు.
ట్రైలర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్
{{/usCountry}}"మన సమాజంలో మన కళ్లముందే తిరిగే పాత్రలు, రోజూ జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు అందించిన వాయిస్ ఓవర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది" అని దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు.
ట్రైలర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్
{{/usCountry}}ఇప్పటికే విడుదలైన పిఠాపురంలో అలా మొదలైంది సినిమా ట్రైలర్, రెండు పాటలకు సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఆయన వెల్లడించారు. సినిమా మొత్తం లైవ్ కెమెరా పెట్టి షూట్ చేసినట్లు ఎంతో సహజంగా ఉంటుందని చెప్పారు.
ఇరుముడి, మా ఇంటి బంగారం లాంటి సినిమా
'ఇరుముడి', 'విశ్వనాథం అండ్ సన్స్', 'మా ఇంటి బంగారం' వంటి క్లీన్ ఫ్యామిలీ సినిమాల వరుసలో ఇది కూడా నిలుస్తుందని డైరెక్టర్ మహేష్ చంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
పిఠాపురంలో అలా మొదలైందిలో నటించినవారు
ఆయనతో పాటు 30 ఇయర్స్ పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జబర్దస్త్ శేషు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
పిఠాపురంలో అలా మొదలైంది టెక్నిషియన్స్
ఈ చిత్రానికి శ్రీరామ్ ఏదోటి కథాభివృద్ధి, సంభాషణలు అందించగా, జి.సి. క్రిష్ సంగీతాన్ని సమకూర్చారు. బి. సత్యనారాయణ ఎడిటర్‌గా వ్యవహరించారు. సెప్టెంబర్ 18న వస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.