Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో నేను వెళ్తాను. నాతోపాటు కన్నాను కూడా తీసుకెళ్లిపోతాను. ఉంటే అతను బతకనివ్వడు అని జమున అంటుంది. మేము మిమ్మల్ని తీసుకొచ్చింది కన్నాకు తల్లి కావాలని. అంతేకానీ మీరు తీసుకెళ్లేందుకు కాదని చక్రి అంటాడు.
తీసుకెళ్తాననడం న్యాయం కాదు

ఇంకోసారి అలా అనకండి. మీరు వాడిని తీసుకెళ్తాననడం న్యాయం కాదు. పద్ధతి కూడా కాదని మహాలక్ష్మి అంటుంది. మా నాన్న నుంచి మీకు ఎలాంటి సమస్య రాదు. మేము చూసుకుంటామని. కన్నా లేకుండా మేము ఉండలేమని కేశవ అంటాడు. ఆ మనిషి కోసం మనం వెళ్లడం ఎందుకమ్మా అని కన్నా అంటాడు. నీకోసం ఎన్ని మాటలైన పడతాను అని జమున అంటుంది.
ఆ మాట 20 ఏళ్ల క్రితం అని ఉంటే బాగుండేది. తల్లి ఉన్నా కూడా కన్నా బాధపడేవాడు కాదని మహా అంటుంది. ఆ తప్పుకు కూడా నేనే శిక్ష అనిభవిస్తానని కిచెన్‌లోకి వెళ్తుంది జమున. ప్రాజెక్ట్ పూర్తయి డబ్బు వచ్చిందని కేశవకు ఇస్తుంది మహా. డబ్బు పేరు వినగానే జమున రావడం మహా గమనిస్తుంది. పెద్దికి డబ్బు ఇచ్చి దగ్గరపెట్టమంటాడు కేశవ.
దేవుడి దగ్గర డబ్బు పెట్టి పెద్ది మొక్కుతుంటే అదేపనిగా జమున చూస్తుంది. పెద్ది డబ్బు దాచేందుకు వెళ్తుంటే వెనకాలే జమున వెళ్తుంది. అదంతా చూసిన మహా జమునకు అడ్డుపడుతుంది. దాంతో తేరుకుని వంట గదిలోకి వెళ్తుంది జమున. మహాకు డౌట్ వస్తుంది. రాత్రిపూట మహాలక్ష్మి వర్క్ చేసుకుంటుంది. నీళ్లకోసం వంటగదిలోకి వెళ్తుంది.
నిర్ధాక్షిణ్యంగా వదిలేశాను..
అంతా పడుకుని ఉంటారు. జమున ఎవరితోనో మాట్లాడటం మహా వింటుంది. వెళ్లి చూస్తుంది. రెండో భర్త ముఖేష్‌తో జమున మాట్లాడుతుంటుంది. డబ్బు కనపడగానే ఇక్కడే ఉండిపోవాలనుకున్నావా అని ముఖేష్ అంటాడు. ఇంతమంది ఉంటే ఎలా కొట్టేయాలని జమున అంటుంది. ఏమో కొడుకు మీద ప్రేమ పొంగుకొచ్చిందేమో అని ముఖేష్ అంటాడు.
{{/usCountry}}అంతా పడుకుని ఉంటారు. జమున ఎవరితోనో మాట్లాడటం మహా వింటుంది. వెళ్లి చూస్తుంది. రెండో భర్త ముఖేష్‌తో జమున మాట్లాడుతుంటుంది. డబ్బు కనపడగానే ఇక్కడే ఉండిపోవాలనుకున్నావా అని ముఖేష్ అంటాడు. ఇంతమంది ఉంటే ఎలా కొట్టేయాలని జమున అంటుంది. ఏమో కొడుకు మీద ప్రేమ పొంగుకొచ్చిందేమో అని ముఖేష్ అంటాడు.
{{/usCountry}}పాలు తాగేటప్పుడే నిర్ధాక్షిణ్యంగా వదిలేసి వచ్చాను. 20 ఏళ్లుగా లేని ప్రేమ ఒక్కసారిగా పొంగుకొస్తుందా. నాలుగు రోజులు తలదాచుకుందామని వచ్చాను. వచ్చినందుకు లక్షలు గిట్టుబాటు అయ్యాయి అని జమున అంటుంది. వెళ్లి తీసుకురాపో అని ముఖేష్ అంటాడు. ఆ మాటలన్నీ మహా వింటుంది. సరే వెళ్లి బండి రెడీగా పెట్టుకోపో అని జమున పంపిస్తుంది.
జమున రావడం చూసి వెళ్లిపోతుంది మహా. జమునను గమనిస్తుంది. దేవుడు దగ్గరున్న తాళాలు తీసుకుని గదిలోకి వెళ్లి వెతుకుతుంది జమున. ఇప్పుడేం చేయాలి. అందరిని లేపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టివ్వనా. అమ్మో కన్నాకు తన తల్లి దొంగది అని తెలిస్తే తట్టుకోగలడా. ఏం చేయాలి డబ్బు దొంగతనం జరగకుండా ఆపాలని అని మహా ఆలోచిస్తుంది.
డబ్బుకోసం పెనుగులాట
ఇనుపెట్టే తాళాలు తీసి అందులో ఉన్న బ్యాగులోని డబ్బు తీస్తుంది జమున. అప్పుడే మహాలక్ష్మి వెళ్లి చేతుల్లో ఏంటదని నిలదీస్తుంది. డబ్బు చూసి నువ్వు పట్టుబడితే నీ కన్నకొడుకు ఎంత చీదరించుకుంటాడో తెలుసా. నిన్ను తీసుకొచ్చి ఎంత తప్పు చేశానో తెలిసింది. వాడెవడు. మీరిద్దరు తోడుదొంగలా. ఇందుకేనా నారాయణ నువ్వంటే మడిపడుతున్నాడు. అప్పుడు కూడా దొంగతనం చేసి పారిపోయావా అని మహా అంటుంది.
కన్నకొడుకు అంటే ప్రేమ లేదని ఎలా చెబుతున్నావే. నువ్వు అసలు ఆడదానివేనా ఛీ ఛీ.. ఆ డబ్బులు ఇవ్వు అని లాక్కుంటుంది మహా. జమున ఇవ్వనని లాక్కుంటుంది. ఆ పెనుగులాటలో డబ్బు కొంచెం కింద పడుతుంది. మహాను ముందుకు నెట్టేసి జమున వెళ్లిపోతుంది. బ్యాగుతో పక్కకు పడుతుంది మహా. జమునకు కన్నా ఇచ్చిన గిఫ్ట్ అక్కడే ఉండటంతో కింద పడి ముక్కలు అవుతుంది.
జమున వెంట పరిగెడుతుంది మహాలక్ష్మి. ముఖేష్ బైక్ ఎక్కి జమున పారిపోతుంది. జమునను మహా చాలాదూరం తరుముతుంది. జమున దొరకదు. తప్పించుకుంటుంది. ఇంటికొస్తుంది. పడుకున్న నారాయణను చూసి జమున గురించి అతను చెప్పింది గుర్తు చేసుకుంటుంది. మీరు చెప్పింది అప్పుడు అర్థం కాలేదు. అందరి కష్టార్జీతాన్ని దోచుకుపోయేది. ఇలాంటి ఆడదాన్ని చూడటం నా జీవితంలో ఇదే మొదటిసారి అని మహా అనుకుంటుంది.
నన్ను క్షమించండి
ఇలాంటిదాన్ని వెతికి మరి తీసుకొచ్చినందుకు నన్ను క్షమించండని మహా లోపలికి వెళ్తుంది. కిందపడిన డబ్బంతా బ్యాగులో సర్ది ఇనుపపెట్టెలో పెడుతుంది మహా. జమున తప్పించుకున్నా ఆరున్నర లక్షల డబ్బు మాత్రం సేఫ్ అవుతుంది. కిందపడిన కన్నా గిఫ్ట్ చూసి కన్నా తల్లిపై ప్రేమను గుర్తు చేసుకుంటుంది మహా. కన్నాకు నిజం చెప్పగలానా అది విని తట్టుకునే శక్తి వీడికి ఉందా అని మహా అనుకుంటుంది.
మరుసటి రోజు ఉదయం మాధవ టీ పెడతాడు. పెద్ది దగ్గరికి మహా వెళ్తుంది. వాళ్లకు నిజం ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటుంది మహా. ఇంతలో కన్నా అమ్మా అని పిలుస్తుంటాడు. ఇల్లంతా వెతుకుతాడు. ఇంట్లో అడిగితే.. పొద్దున్నుంచి కనిపించలేదురా. మార్కెట్‌కి కూరగాయలకు వెళ్లింది కావచ్చని పెద్ది అంటాడు. కన్నా కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది.
తండ్రి కాలర్ పట్టుకున్న కన్నా
మహాను అడిగితే చూడలేదంటుంది. నారాయణ వస్తాడు. నారాయణ జమున పీక పట్టుకుంది గుర్తు చేసుకుని ఆపుతాడు. మా అమ్మను ఈయనే పంపించేసి ఉంటాడని తండ్రి కాలర్ పట్టుకుని నిలదీస్తాడు కన్నా. తల్లికోసం ఏడుస్తాడు. మహా ఆపుతుంది. ఇందులో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని మహా చెబుతుంది. జమున దొంగతనం చేసింది మహా చెప్పినట్లు చూపిస్తారు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.