...
...
Next Story

Podarillu October 29 Episode: పొదరిల్లు- ఒక్కటైన అన్నదమ్ములు- ఇంట్లోంచి వెళ్లిపోతానన్న మహా- తోడుగా నారాయణ, కన్నా ఏడుపు

Podarillu Serial October 29th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 29వ ఎపిసోడ్‌‌లో కేశవ, చక్రిలకు నారాయణ గురించి నిజం చెబుతుంది మహా. కానీ కన్నాను కొట్టడంపై ఫీల్ అవుతుంటారు. ఓహో అంతా ఒక్కటయ్యారా. నాపై రగిలిపోతున్నారుగా. కన్నా రాకుంటే నేనే ఇంట్లోంచి వెళ్లిపోతానని మహాలక్ష్మి షాక్ ఇస్తుంది.

Published on: Oct 29, 2026, 08:33:47 IST
Advertisement

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కన్నా నారాయణ కొడుకు కాదని, అసలు జమున భాయ్ అతని భార్యే కాదని అన్ని నిజాలు చక్రి, కేశవలకు చెబుతుంది మహాలక్ష్మి. తల్లి వదిలేసి వెళ్లిపోతే అనాథాశ్రమంలో కన్నాను వదిలేయకుండా తండ్రిలా చూసుకున్నాడు. అందుకే నా దృష్టిలో నారాయణ నారాయణుడయ్యాడు అని మహా అంటుంది.

వాడు నాకు దత్తపుత్రుడు

పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 29 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 29 ఎపిసోడ్

అయ్యో కన్నా మా తమ్ముడు కాదా. దీనికోసమా మహాలక్ష్మిని నిలదీశాం. ఇది తెలుసుకునేందుకా అని చక్రి బాధపడతాడు. రేయ్ వాడు నాన్నకు కొడుకు ఎలా అయ్యాడో అనవసరం. మనకు సొంత తమ్ముడి కంటే ఎక్కువరా. ఈ చేతులతో పెంచాను. వాడు నాకు దత్తపుత్రుడురా. కన్నా మన సొంత తమ్ముడు అనుకోవాల్సిందే అని మాధవ అంటాడు.

అనుకోవడం ఏంటీ వాడు మన తమ్ముడే. రక్తసంబంధం కాకపోయిన పాతికేళ్ల అనుబంధం మనది అని కేశవ అంటాడు. వాడి తల్లి ఎలాంటిదో మనకు అనవసరం. ఇక ఇది మన మధ్యే సమాధి అయిపోవాలి. ఇప్పటివరకు ఎలా కనిపించాడో ఇప్పుడు కూడా అలాగే కనిపించాలని మాధవ అంటే.. ఇప్పటికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తామని చక్రి అంటాడు.

వాడు ఎంత దురదృష్టవంతుడోరా పాపం. వాడికి మన అమ్మ ఒక్కటి కాదని తెలిస్తేనే మనసు విరిగి ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఇప్పుడు నాన్న కూడా నాన్న కాదని తెలిస్తే వాడి గుండె పగిలిపోతుంది. వాడికి ఈ నిజం తెలియకూడదని పెద్ది అంటాడు. వాడిని కొట్టినందుకు మనసు చివ్వుకుమంది. కానీ, నిజంగా మేమందరం అల్పులం, అజ్ఞానులం అని కేశవ అంటాడు.

మహాకు చేతులెత్తి దండం పెట్టిన కేశవ

ఇక నారాయణను ఎప్పుడు ఏమొనొద్దని పెద్ది అంటాడు. కన్నాను తీసుకొస్తామని చక్రి అంటే.. అవసరం లేదు. ఆ తండ్రి వెనుకాలే సైకిల్ వేసుకుని వెళ్లాడు. కన్నాను ఎప్పుడు ఆ తండ్రి విడిచిపెట్టడు అని మహా అంటుంది. కన్నా ఏడుస్తూ రోడ్డు మీద నడుస్తుంటాడు. మహా కొట్టడం, తనకు నేనంటే ఇష్టం లేదని, నారాయణ అంటేనే ఇష్టమని అనుకుంటూ వెళ్తాడు కన్నా.

వెనుకాలే నారాయణ సైకిల్‌పై వస్తుంటాడు. ఓ చోట కూర్చుని ఇంట్లోంచి వెళ్లిపోతానని కన్నా ఏడుస్తుంటాడు. కన్నాకు తోడుగా కంటిపాపలా కాచుకుని ఉంటాడు నారాయణ. ఇంతలో అతన్ని సత్య చూస్తుంది. సత్య పలకరించడంతో కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఏం జరిగింది. మరి గేట్లు ఎందుకు ఎత్తేశావ్. సమస్య ఏంటో చెబితే సహాయం చేస్తానుగా అని పదే పదే అంటుంది సత్య. దాంతో సత్యపై కోప్పడతాడు కన్నా.

సత్యపై అరిచిన కన్నా

నువ్వేమైనా దేవతవా అందరి సమస్య తీర్చడానికి. ప్రస్తుతానికి నువ్వే నా ప్రాబ్లమ్. నా తల తినకు వెళ్లు అని గట్టిగా అరవడంతో సత్యం వెళ్లిపోతుంది. అదంతా నారాయణ చూస్తాడు. రాత్రి అవుతుంది. కన్నా గురించి అన్నదమ్ములు ఆందోళన పడుతుంటారు. నారాయణ 20 ఏళ్లు దాచాడు. మనం నటించలేమా అని చక్రి అంటాడు.

రేయ్ ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉండండి. జాలి చూపించకండి, దయగా మారుతుందని పెద్ది అంటాడు. కన్నాను కొట్టినందుకు తప్పుగా ఫీల్ అవుతున్నారా అని మహా అడిగితే.. అలాంటిదేం లేదని పెద్ది అంటాడు. నేను మాత్రం ఫీల్ అవుతున్నానని చక్రి అంటే.. నారాయణ జోలికి వెళితే మీకు పడతాయ్ అని మహా వార్నింగ్ ఇస్తుంది.

అవసరమా అని కేశవ అంటాడు. మీరు కూడా ఫీల్ అవుతున్నారా అని మహా అంటే.. లేదని కేశవ అంటాడు. వాడు తెలియక అన్నాడుగా అని చక్రి అంటే.. తండ్రికి విలువ ఇవ్వనివాడికి అలాగే చేయాలని మహా అంటుంది. కాస్తా కఠినంగా చెప్పావేమో అని మాధవ అంటాడు. ఓహో.. అన్నదమ్ములంతా ఒక్కటయ్యారే.. నేను మాత్రం పరాయిదాన్నానా. క్షమించండి మీ ఇంటి విషయాల్లో ఇక జోక్యం చేసుకోను అని మహా రివర్స్ అవుతాడు.

నా మీద ప్రేమ లేదు

అలాంటిదేం లేదని పెద్ది, నేను ఏమనుకోలేదని కేశవ, ఆవిడకు ఇదేం కొత్తకాదుగా అని చక్రి అంటారు. వాన్ని వెతుకుదాం పదా అని పెద్ది అంటే.. అవసరం లేదు. ఇదే వాడికి అలవాటుగా మారుతుంది. మన ప్రేమ బలహీనతగా మారుతుంది. అన్నప్రతిసారి ఇలాగే వెళ్లిపోతాడని. వాడే తిరిగివస్తాడు చూడండి అని మహా అంటుంది. వాడు రాకుంటే అని చక్రి అంటే.. నేనే వెళ్లిపోతాను అని మహా పెద్ద షాక్ ఇస్తుంది.

చక్రిపై కోప్పడతాడు కేశవ. మాట మాట్లాడితే కొడతానంటాడు. కన్నా దగ్గరే నారాయణ ఉంటాడు. కన్నాకు చక్రి ఫోన్ చేస్తాడు. కన్నా కాల్ కట్ చేస్తాడు. అదే విషయం చెబుతాడు చక్రి. మరోసారి కాల్ చేస్తే కన్నా మాట్లాడుతాడు. కొత్త సినిమా రిలీజై అయింది. వెళ్దామని చక్రి అంటే.. నేనెందుకు మీరు వెళ్లండి. మీరెవరో నేనెవరో అని కన్నా అంటాడు.

నేను బయటకు వెళ్తుంటే ఎవరు ఆపలేదు. నా మీద ప్రేమ లేదని కన్నా అంటాడు. నీకోసం ఎదురు చూస్తున్నాం రారా అని పెద్ది అంటాడు. నువ్వైనా ఆపలేదుగా అని కాల్ కట్ చేస్తాడు కన్నా. మహా కాల్ చేస్తుంది. నా మీద కోపం ఉందని తెలుసు. కానీ, ఒక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను కొట్టే హక్కు నాకుందని అనుకుంటే ఇంటికి రా. లేదు అనుకంటే నేరుగా ఇంటికొచ్చి ఆ మాట చెప్పు. నేనే సారీ చెప్పి మీ ఇంటి నుంచి వెళ్లిపోతాను. ఇంకెప్పుడు ఇంటికి రాను అని మహా కాల్ కట్ చేస్తుంది.

మీ అందరికి రగిలిపోతుందిగా

అంత మాట అన్నావేంటమ్మా అని పెద్ది అంటే.. ఇక్కడ చాలా మందికి వాడికన్నా ఎక్కువ రగిలిపోతుంది కదా. కన్నా తప్పకుండా వస్తాడని మహా అంటుంది. మహా మాటలతో కన్నా ఇంటికి తిరిగి వస్తాడు. మీరు నా సొంత అన్నలేనా.. ఆరోజు నేను వెళ్లిపోతే నాకోసం తిరిగారు. ఇప్పుడేమైంది. ఇప్పుడు ప్రేమ తగ్గిపోయింది. ఒక్కరు కూడా నాకోసం వెతకలేదని కన్నా అంటాడు.

అందరూ వదిన చెబితేనే వింటారని కన్నా అంటాడు. చిన్నపిల్లలు తప్పుచేస్తే పెద్దవాళ్లు మందలించడం తప్పా. ఆయనవల్లా నీకు మంచే జరిగింది తప్పా ఏమాత్రం చెడు జరగలేదని అని మహా అంటుంది. మనమంతా ఒకే కుటుంబం అన్నారుగా మరి నాకోసం ఈసారి ఎవరు రాలేదేంటీ అని కన్నా అడుగుతాడు.

మీ నాన్నే నీ వెనుకాల సైకిల్ తీసుకుని వచ్చారు. దానికి ఎగ్జాంపులే అటు చూడు ఇప్పుడే వస్తున్నారు అని చూపిస్తుంది మహా. నారాయణ రావడం అంతా చూస్తారు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks