...
...
Next Story

Pooja Batra: దీపికా పదుకొణె, కృతి సనన్ వంటి పొడుగున్న హీరోయిన్లకు నేనే దారి చూపించాను: మాజీ హీరోయిన్ పూజా బాత్రా

Pooja Batra About Deepika Padukone Kriti Sanon Height: బాలీవుడ్ మాజీ హీరోయిన్ పూజా బాత్రా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తన ఎత్తు కారణంగా అనేక అవకాశాలు కోల్పోయానని, దీపికా పదుకొణె, కృతి సనన్ వంటి పొడుగున్న హీరోయిన్లకు తాను దారి చూపించానని పూజా బాత్రా చెప్పారు.

Published on: May 11, 2026, 12:33:50 IST
Advertisement

Pooja Batra About Deepika Padukone Kriti Sanon Height: గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు ఆకర్షణీయమైన రూపం ఉండాలి. కానీ, ఒక్కోసారి ఆ రూపమే అవకాశాలకు అడ్డుగా మారుతుందని అంటోంది మాజీ మిస్ ఇండియా, నటి పూజా బాత్రా.

ఎత్తు వల్లే వదులుకోవాల్సి వచ్చింది

దీపికా పదుకొణె, కృతి సనన్ వంటి పొడుగున్న హీరోయిన్లకు నేనే దారి చూపించాను: మాజీ హీరోయిన్ పూజా బాత్రా
దీపికా పదుకొణె, కృతి సనన్ వంటి పొడుగున్న హీరోయిన్లకు నేనే దారి చూపించాను: మాజీ హీరోయిన్ పూజా బాత్రా

90వ దశకంలో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ కష్టాలను గుర్తు చేసుకున్నారు. కేవలం తన ఎత్తు (Height) వల్లే తాను ఎన్నో మంచి ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందని పూజా బాత్రా సంచలన విషయాలను వెల్లడించారు.

హీరోల కోసం సర్దుబాటు.. ఆ ఇబ్బందులు వర్ణనాతీతం

ఒకప్పుడు బాలీవుడ్ హీరోల కంటే హీరోయిన్లు పొడవుగా ఉంటే ఒప్పుకునేవారు కాదు. పూజా బత్రా ఇదే సమస్యను ఎదుర్కొన్నారట. "నేను నా సహనటుల కంటే పొడవుగా ఉండటంతో, కెమెరా ఫ్రేమ్‌లో వారికంటే పొట్టిగా కనిపించడానికి షూటింగ్ సమయంలో కాళ్లు పక్కకు చాపి (స్ల్పిట్స్) నిలబడేదాన్నని" పూజా బాత్రా చెప్పుకొచ్చారు.

అలా చేయడం వల్ల హీరోల ఎత్తు పెరిగినట్లు కనిపించేదని, కానీ అది తనకు ఎంతో ఇబ్బందిగా ఉండేదని పూజా బాత్రా ఆవేదన వ్యక్తం చేశారు. నాటి అగ్ర హీరోయిన్ సంగీతా బిజ్లానీ కూడా "నువ్వు చాలా పొడవుగా ఉన్నావు, నీకు సినిమాల్లో అవకాశాలు రావడం కష్టం" అని ముందే హెచ్చరించారని పూజా బాత్రా గుర్తు చేసుకున్నారు.

సల్మాన్ ఖాన్ ఒక్కడే ప్రత్యేకం

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఏలుతున్న దీపికా పదుకొణె, కృతి సనన్ వంటి పొడవున్న భామలకు తానే మార్గం సుగమం (దారి చూపించాను) చేశానని పూజా బాత్రా వ్యాఖ్యానించారు. "నేను పడ్డ కష్టాల వల్లే ఇప్పుడు పొడవున్న హీరోయిన్లను ఇండస్ట్రీ అంగీకరిస్తోంది. వాళ్లు నాకు థాంక్స్ చెప్పాలి" అని పూజా బాత్రా చమత్కరించారు.

1997లో 'విరాసత్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా బాత్రా.. భాయ్, హసీనా మాన్ జాయేగి వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మాజీ హీరోయిన్ పూజా బాత్రా సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు.

దీపికా, కృతిల బిజీ షెడ్యూల్

పూజా బాత్రా ప్రస్తావించిన దీపికా పదుకొణె ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో కలిసి 'కింగ్' సినిమాలో నటిస్తోంది. 2026 డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న 'రాకా'లోనూ దీపికా నటిస్తోంది. మరోవైపు కృతి సనన్ నటించిన షాహిద్ కపూర్, రష్మిక మందన్నాల 'కాక్ టెయిల్ 2' విడుదలకు సిద్ధమవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe