...
...
Next Story

Poonam Pandey: వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి, నేరాలు చాలా తగ్గిపోతాయి, నా శృంగార వీడియోలు ఒక సేవ: హీరోయిన్ పూనమ్ పాండే

Poonam Pandey Comments On Legalised Prostitution: శృంగార, ఎరోటిక్ వీడియోలు చేయడంపై హీరోయిన్ పూనమ్ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే మహిళలపై నేరాలు తగ్గుతాయని, తాను చేసే వీడియోలు పురుషుల మానసిక ఒత్తిడిని తగ్గించే 'సామాజిక సేవ' అని పూనమ్ పేర్కొన్నారు.

Published on: Sep 6, 2026, 06:42:35 IST
Advertisement

Poonam Pandey Comments On Legalised Prostitution: బాలీవుడ్ మోడల్, హాట్ హీరోయిన్ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం రకరకాల పబ్లిసిటీ స్టంట్స్‌తో వివాదాలు రేపే ఈ భామ, తాజాగా శృంగార వీడియోలు వంటి కంటెంట్, దేశంలో వ్యభిచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో పూనమ్ పాండే మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

పూనమ్ పాండే షాకింగ్ కామెంట్స్

వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి, నేరాలు చాలా తగ్గిపోతాయి, నా శృంగార వీడియోలు ఒక సేవ: హీరోయిన్ పూనమ్ పాండే
వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి, నేరాలు చాలా తగ్గిపోతాయి, నా శృంగార వీడియోలు ఒక సేవ: హీరోయిన్ పూనమ్ పాండే

తాను చేసే శృంగార (అడల్ట్) వీడియోలు కేవలం వినోదం మాత్రమే కాదని, అది ఒక రకమైన 'సామాజిక సేవ' అని పూనమ్ పాండే అభివర్ణించారు. ఆర్‌వీసీజే (RVCJ) మూవీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ పాండే మాట్లాడారు.

మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు

"నేటి సమాజంలో చాలా మంది పురుషులు తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. నా ఒక్క వీడియో వారి ఒత్తిడిని తగ్గించి, మనశ్శాంతిని ఇస్తే అందులో తప్పేముంది? బయట నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూస్తున్నాం. భారత దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే, మహిళలపై జరిగే లైంగిక దాడులు, నేరాలు గణనీయంగా తగ్గుతాయి" అని పూనమ్ పాండే వ్యాఖ్యానించారు.

ట్రోలింగ్‌పై సీరియస్.. ఫ్రెండ్స్ కూడా మారలేదంటూ కామెంట్స్

తనపై వచ్చే ట్రోల్స్, విమర్శలపై కూడా పూనమ్ పాండే స్పందించారు. తన స్నేహితులు కూడా తన వీడియోలను చూసి ఆస్వాదిస్తూనే, బయటకు మాత్రం తనపై జోకులు వేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోలర్లకు సమాధానం చెప్పే క్రమంలో బూతులు తిట్టాలని అనిపించినప్పటికీ, తన సంస్కారం అడ్డు వస్తుందని చెప్పారు.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. వరుస స్టంట్లు!

అయితే అది కూడా ఒక పబ్లిసిటీ స్టంటేనంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ప్రెగ్నెన్సీ కడుపుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి, ఆ తర్వాత ప్రాంక్ అని చెప్పారు.

చనిపోయినట్లు నకిలీ వార్తలు

2024లో గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) అవగాహన పేరుతో తాను చనిపోయినట్లు నకిలీ వార్తను ప్రచారం చేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు. అంతకుముందు కూడా 2011లో భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియా టీమ్ కప్ గెలిస్తే బహిరంగంగా బట్టలు విప్పి తిరుగుతానని సంచలన ప్రకటన చేసింది పూనమ్ పాండే.

భర్తపై గృహహింస ఆరోపణలు

ఆ సమయంలో భారత్ గెలిచినప్పటికీ పూనమ్ పాండే తన మాట నిలబెట్టుకోలేదు. వివాదాల మధ్యనే 2020లో సామ్ బాంబేను పెళ్లాడింది పూనమ్ పాండే. అయితే కొద్దిరోజులకే భర్తపై గృహహింస ఆరోపణలు చేసింది.

వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలంటూ

ఇక ఇటీవల లాక్ అప్ రియాలిటీ షోలో తన బోల్డ్ కామెంట్స్‌లో వార్తల్లో నిలిచింది. పబ్లిసిటీ కోసం ఏ స్థాయికైనా దిగజారుతుందనే ముద్ర వేసుకున్న పూనమ్ పాండే తాజాగా వ్యభిచారం చట్టబద్ధతపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ కొత్త చర్చకు తెరలేపాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks