Durex Ad: హారర్ థ్రిల్లర్‌లో శృంగార సీన్‌తో డ్యూరెక్స్ కండోమ్ యాడ్- ఏకిపారేస్తున్న నెటిజన్లు- ఎందుకంత ఆగ్రహం? ఏమైంది?
Durex Condom Ad Obsession Intimate Scene Controversy: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న హారర్ చిత్రం అబ్సెషన్‌లోని ఒక సున్నితమైన, శృంగార సీన్‌ను వాడుకుంటూ డ్యూరెక్స్ కండోమ్ చేసిన యాడ్ తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతల దిగజారాలా అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అసలు ఆ వివాదం ఏంటో తెలుసుకుందాం.
Durex Condom Ad Obsession Intimate Scene Controversy: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హారర్ చిత్రం ‘అబ్సెషన్’ (Obsession) చుట్టూ ఒక ఊహించని వివాదం ముసురుకుంది.

ఏడున్న కోట్లకు, 2 వేల కోట్లు
కేవలం 750,000 డాలర్ల (సుమారు రూ. 7.5 కోట్లు) స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2000 కోట్లకు పైగా) వసూళ్లతో ఈ ఏడాదిలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం అబ్సెషన్.
విషపూరిత బంధాలు (Toxic Relationships), ఒంటరితనం, పురుషాధిక్య ధోరణి వంటి సున్నితమైన అంశాల చుట్టూ సాగే ఈ కథ ప్రేక్షకుల మనసులను బలంగా తాకింది. అయితే, ఈ సినిమాలో చూపించిన ఒక అత్యంత కలతపెట్టే సన్నివేశాన్ని ప్రముఖ కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్ (Durex) తన వ్యాపార ప్రకటన కోసం వాడుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
వివాదానికి కారణమైన డ్యూరెక్స్ ప్రకటన
సినిమాలో హీరో బేర్, హీరోయిన్ నిక్కీ ప్రమేయం లేకుండా, ఆమె నిస్సహాయంగా చూస్తుండగానే ఆమెతో శృంగారంలో పాల్గొనే ఒక వివాదాస్పద సీన్ ఉంది. ఒక వింత కోరిక వల్ల నిక్కీ తన శరీరంలో తనే బందీగా మారిపోయిన తరుణంలో ఈ సంఘటన జరుగుతుంది.
ఇది దాదాపు పరస్పర అంగీకారం లేని లైంగిక చర్య (Non-consensual sex) కిందకే వస్తుంది. తాజాగా డ్యూరెక్స్ పాకిస్తాన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ సీన్ నేపథ్యాన్ని వాడుకుంటూ ఒక పోస్ట్ పెట్టింది.
మీ ప్రేమలో పిచ్చిదానిని చేయండి
బేర్ కారుపై డ్యూరెక్స్ కండోమ్‌ను ఉంచి, పక్కనే కోరిక నిజం చేసే వస్తువు (One Wish Willow) ఉండేలా, నిక్కీ ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉన్నట్లు ఆ ప్రకటనను డిజైన్ చేశారు. దానికి "ఆమెను మీ ప్రేమలో పిచ్చిదానిని చేయండి" అనే ట్యాగ్‌లైన్‌ను, "దీన్ని మీ ఫ్రీకీ నిక్కీకి పంపండి" అనే క్యాప్షన్‌ను జత చేశారు.
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. జుగుప్సాకరమంటూ కామెంట్లు
మహిళల అంగీకారం లేని ఒక సున్నితమైన అంశాన్ని కమర్షియల్ యాడ్ కోసం వాడుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. డ్యూరెక్స్ సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ఏకిపారేస్తున్నారు. "ఈ ప్రకటన చూస్తుంటేనే అసహ్యంతో వాంతి వచ్చేలా ఉంది" అని ఒక నెటిజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మహిళల ప్రమేయం లేని శృంగార చర్యను ఒక పెద్ద బ్రాండ్ ఇలా ప్రమోట్ చేయడం అత్యంత జుగుప్సాకరం, మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి" అని మరొక వినియోగదారుడు మండిపడ్డారు. సినిమాలోని పెయిన్‌ను అర్థం చేసుకోకుండా కేవలం మార్కెటింగ్ కోసం ఇంత దిగజారుతారా అంటూ నెటిజన్లు సదరు సంస్థపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
అసలు ‘అబ్సెషన్’ కథేంటి?
ఒక మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) అనే ఒంటరి యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతను తన చిన్ననాటి స్నేహితురాలు, సహోద్యోగి అయిన నిక్కీ (ఇండే నవరెట్) ను ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమను వ్యక్తపరచడంలో పదే పదే విఫలమయ్యాక, ఒక మంత్రాల షాపుకు వెళ్లి 'వన్ విష్ విల్లో' అనే ఒక వింత వస్తువును కొనుగోలు చేస్తాడు.
ప్రపంచంలో అందరికంటే నిక్కీ తననే ఎక్కువగా ప్రేమించాలంటూ ఒక కోరిక కోరతాడు. ఆ కోరిక నెరవేరుతుంది. కానీ, ఆ కోరిక చాలా భయంకరమైన రూపంలోకి మారుతుంది.
ది బెస్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫీల్
బేర్ పట్ల నిక్కీకి ఉన్న ప్రేమ కాస్తా క్రమంగా పిచ్చిగా, ఊపిరాడనివ్వని ఒక భయంకరమైన వ్యసనంగా మారుతుంది. అతను కాసేపు కంటికి కనిపించకపోయినా ఆమె పానిక్ అవ్వడం, వింతగా ప్రవర్తించడం వంటి సీన్లు ది బెస్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫీల్ కలిగిస్తాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


