Taylor Swift: స్టార్ లేడీ సింగర్ పెళ్లి- 250 కోట్ల ఖర్చు, 248 కోట్ల విరాళం- పురోహితుడిగా హీరో- రిహార్సల్ డిన్నర్!
Taylor Swift Travis Kelce Wedding Details: గ్లోబల్ పాప్ సెన్సేషన్ లేడి సింగర్ టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్స్ శుక్రవారం న్యూయార్క్‌లో అత్యంత వైభవంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి ఖర్చు, విరాళం వంటి ఇతర ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం.
Taylor Swift Travis Kelce Wedding Specialities: ప్రపంచ పాప్ సంగీతలో బిలియనీర్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న టేలర్ స్విఫ్ట్ పెళ్లి జరిగిపోయింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఎన్‌ఎఫ్ఎల్ (NFL) (ఫుట్‌బాలర్) స్టార్ ప్లేయర్ ట్రావిస్ కెల్స్ ప్రేమాయణానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది.

వైభవంగా వివాహం
న్యూయార్క్ నగరంలోని అత్యంత ప్రసిద్ధ ఇండోర్ అరేనా 'మాడిసన్ స్క్వేర్ గార్డెన్' (MSG) లో శుక్రవారం రాత్రి వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ మెగా వెడ్డింగ్ కోసం న్యూయార్క్ లోని పలు ప్రధాన రహదారులను, కాలినడకన వెళ్లే దారులను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
మన దేశంలో అంబానీ ఇంట్లో జరిగే పెళ్లిళ్లకు ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో, అమెరికాలో టేలర్ స్విఫ్ట్ పెళ్లికి అంతకు మించిన ఏర్పాట్లు చేశారు. ఫోర్బ్స్ సంస్థ అంచనా ప్రకారం ఈ పెళ్లి కోసం ఈ జంట ఏకంగా 20 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ. 167 కోట్లకు పైగా) ఖర్చు చేసింది.
రూ. 250 కోట్ల ఖర్చు
వీరికి రక్షణ కల్పించడానికి, ట్రాఫిక్‌ను నియంత్రించడానికి అక్కడి పోలీస్ శాఖకు మరో 10 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 83 కోట్లు) బిల్లు అయినట్లు న్యూయార్క్ మాజీ ట్రాఫిక్ కమిషనర్ సామ్ స్క్వార్ట్జ్ వెల్లడించారు. అంటే, మొత్తంగా రెండు కలిపి రూ. 250 కోట్ల ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది. ఈ భారీ మొత్తాన్ని ఈ సెలబ్రిటీ జంటనే చెల్లించే అవకాశం ఉంది.
ఆడమ్ శాండ్లర్ ఆధ్వర్యంలో వేడుక
ఈ హాలీవుడ్ వివాహ వేడుకలో మరో విశేషం ఏంటంటే.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫున సాంప్రదాయకంగా ఉండే బ్రైడ్స్‌మెయిడ్స్ లేదా గ్రూమ్స్‌మెన్ ఎవరూ లేరు. ప్రముఖ హాలీవుడ్ హీరో ఆడమ్ శాండ్లర్ పురోహితుడిగా మారి ఈ పెళ్లిని దగ్గరుండి జరిపించారు. టేలర్ స్విఫ్ట్ సోదరుడు ఆస్టిన్ స్విఫ్ట్ 'మ్యాన్ ఆఫ్ హానర్' గా వ్యవహరించగా, ట్రావిస్ సోదరుడు జేసన్ కెల్స్ బెస్ట్ మ్యాన్‌గా నిలిచారు.
మైదానంలో పల్లెటూరి వాతావరణం
పెళ్లికి సంబంధించిన అధికారిక ఫోటోలు ఏవీ బయటకు రాకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. అయితే, ప్రముఖ థియేటర్ చైన్ ఏఎమ్‌సీ (AMC) సీఈఓ ఆడమ్ ఆరాన్ పొరపాటున తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పెళ్లి వివరాలను పోస్ట్ చేసి, ఆ తర్వాత డిలీట్ చేశారు.
"మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లోపల కృత్రిమ చెట్లను ఏర్పాటు చేసి, ఒక అందమైన పల్లెటూరి వాతావరణాన్ని (Lush Countryside Retreat) రీక్రియేట్ చేశారు. సుమారు 1,000 మంది అతిథులు హాజరైనప్పటికీ, వేడుక మాత్రం ఎంతో ప్రైవేట్‌గా సాగింది. ట్రావిస్ తెల్లటి టక్సేడో సూట్‌లో మెరిసిపోగా, టేలర్ స్విఫ్ట్ పొడవైన ముసుగు ఉన్న అద్భుతమైన తెల్లటి వెడ్డింగ్ గౌనులో దేవకన్యలా కనిపించింది" అని ఆడమ్ ఆరాన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
తరలివచ్చిన హాలీవుడ్, క్రీడా ప్రపంచం
ఈ ప్రత్యేక దుస్తులను ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ 'డియోర్' క్రియేటివ్ డైరెక్టర్ జోనాథన్ ఆండర్సన్ డిజైన్ చేశారు. ఈ వేడుకకు అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు భారీగా తరలివచ్చారు. హాలీవుడ్ నటులు హ్యూ గ్రాంట్, ఈథన్ హాక్, జేసన్ సుడైకిస్, సంగీత విద్వాంసుడు బెన్సన్ బూన్, ఎన్‌ఎఫ్ఎల్ ప్లేయర్ కూపర్ కప్ వంటి ప్రముఖులు పెళ్లి వేడుకలో నేరుగా పాల్గొన్నారు.
అంతకుముందు జరిగిన రిహార్సల్ డిన్నర్‌కు టేలర్ స్విఫ్ట్ బెస్ట్ ఫ్రెండ్, పాప్ సింగర్ సెలీనా గోమెజ్, మోడల్ గిగి హడిద్, నటుడు బ్రాడ్లీ కూపర్, ఎడ్ షీరన్, దువా లిపా వంటి గ్లోబల్ స్టార్స్ హాజరయ్యారు. పెళ్లికి కొన్ని గంటల ముందే బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ విలియమ్ సైతం ట్రావిస్ కెల్స్ నడుపుతున్న 'న్యూ హైట్స్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొనడం విశేషం.
ఇంతేకాకుండా పెళ్లికి ముందు టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కేల్సే పలు సేవా సంస్థలకు సుమారు 26 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల రూ. 248 కోట్లను విరాళంగా అందించినట్లు వారి ప్రతినిధి వెల్లడించారు. ఫుడ్ బ్యాంక్స్, చిన్నారుల క్యాన్సర్ చికిత్స కార్యక్రమాలు, ఆర్ట్స్ కాలేజీలకు ఈ విరాళం అందనుంది. డాలీ పార్టన్‌కు చెందిన 'ఇమాజినేషన్ లైబ్రరీ' కూడా 2 మిలియన్ డాలర్ల డొనేషన్ అందుకోగా, ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా
కాగా, 2023లో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా మొదలైన వీరి పరిచయం, 2025 ఆగస్టులో నిశ్చితార్థానికి దారితీసింది. ప్రస్తుతం టేలర్ స్విఫ్ట్ ఆస్తి విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు (రూ. 16,000 కోట్లకు పైగా) కాగా, ట్రావిస్ కూడా అమెరికన్ ఫుట్‌బాల్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాళ్లలో ఒకరిగా ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్స్ పెళ్లితో ఒక్కటవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీరి అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


