యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా ది రాజా సాబ్. కామెడీ సినిమాల డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా చేశారు.
ది రాజా సాబ్ ట్రైలర్, సాంగ్స్ రెస్పాన్స్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, ఇషాన్ సక్సేనా నిర్మించారు. తమన్ ఎస్ మ్యూజిక్ అందించిన ది రాజా సాబ్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ది రాజా సాబ్ ట్రైలర్, సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ది రాజా సాబ్ ఫస్ట్ రివ్యూ
ఇక సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్‌గా జనవరి 9న ది రాజా సాబ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ ఫస్ట్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ క్రిటిక్‌గా, ఆస్ట్రేలియన్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు ది రాజా సాబ్‌పై రివ్యూ ఇచ్చారు.
ట్విటర్‌లో పోస్ట్
ఇటీవల సెన్సార్‌కు ది రాజా సాబ్ మూవీ వెళ్లినప్పుడు ఉమైర్ సంధు వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్‌లో ది రాజా సాబ్ మూవీ రివ్యూని పోస్ట్ చేశారు.
పర్‌ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్
"ది రాజా సాబ్ ఫస్ట్ రివ్యూ: బీ, సీ క్లాస్ సెంటర్స్ ఆడియెన్స్‌కు పర్‌ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం ఇది. ప్రభాస్ అండ్ సంజయ్ దత్‌ది డెడ్లీ కాంబినేషన్. అన్ని రకాలుగా షోని దోచేశారు. ప్రభాస్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌కు పర్‌ఫెక్ట్ ట్రీట్. చివరి 30 నిమిషాలు నెక్ట్స్ లెవెల్. కచ్చితంగా వెళ్లి చూడండి" అని ఉమైర్ సంధు రాజా సాబ్‌పై రివ్యూ ఇచ్చారు.
3.5 స్టార్ రేటింగ్
{{/usCountry}}"ది రాజా సాబ్ ఫస్ట్ రివ్యూ: బీ, సీ క్లాస్ సెంటర్స్ ఆడియెన్స్‌కు పర్‌ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం ఇది. ప్రభాస్ అండ్ సంజయ్ దత్‌ది డెడ్లీ కాంబినేషన్. అన్ని రకాలుగా షోని దోచేశారు. ప్రభాస్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌కు పర్‌ఫెక్ట్ ట్రీట్. చివరి 30 నిమిషాలు నెక్ట్స్ లెవెల్. కచ్చితంగా వెళ్లి చూడండి" అని ఉమైర్ సంధు రాజా సాబ్‌పై రివ్యూ ఇచ్చారు.
3.5 స్టార్ రేటింగ్
{{/usCountry}}అలాగే, ది రాజా సాబ్ సినిమాకు ఉమైర్ సంధు 5కి 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రివ్యూ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతోపాటు ది రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్ సెక్సీగా ఉందని, ప్రభాస్ హాట్‌గా ఉన్నాడని చెప్పారు. అంతేకాకుండా ది రాజా సాబ్ సినిమా చూసి తర్వాత క్రేజీ ఫీలింగ్ కలుగుతోందని ట్వీట్ వేశారు ఉమైర్ సంధు.
ది రాజా సాబ్ నటీనటులు
ఇదిలా ఉంటే, ది రాజా సాబ్ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. వీరితోపాటు సినిమాలో బొమన్ ఇరానీ, వీటీవీ గణేష్, జరీనా వాహబ్ ఇతర పాత్రల్లో మెరవనున్నారు.