మహేష్ బాబు- ప్రకాష్ రాజ్ కాంబినేషన్ ఎన్నో సినిమాల్లో చూశాం. ఈ ఇద్దరు వివిధ సినిమాల్లో తండ్రీ కొడుకులుగా, మామ అల్లుళ్లుగా, హీరో విలన్లుగా నటించారు. ఇప్పుడు ఇద్దరు కలిసి నటిస్తున్న మరో మూవీ వారణాసి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో మహేష్ బాబు హీరో. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తన క్యారెక్టర్ ఏంటీ అనే విషయంపై ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
వారణాసిలో ప్రకాష్ రాజ్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసిలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితో ఈ మూవీలో తన క్యారెక్టర్ గురించి ప్రకాష్ రాజ్ రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. తన పాత్రను రివీల్ చేస్తూ బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో తాను శివ భక్తుడిగా నటిస్తున్నానని ప్రకాష్ రాజ్ ప్రకటించాడు.
వారణాసి గురించి
వారణాసి మూవీ టైమ్ ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ గా రెడీ అవుతోంది. అంటే వివిధ కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో జరిగే సినిమా ఇది. ఇందులో రుద్ర అనే క్యారెక్టర్ లో మహేష్ బాబు కనిపించనున్నాడు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ శివ భక్తుడిగా నటిస్తున్నాడని తెలిసిపోయింది. అయితే మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ లోనే ప్రకాష్ రాజ్ కనిపిస్తాడని సమాచారం.
రిలీజ్ డేట్
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారణాసి మూవీ ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ కుంభగా భయపెట్టబోతున్నాడు. వారణాసి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మహేష్, ప్రకాష్ కాంబో
మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబో అంటే అభిమానులకు పండగే. మహేష్ చేసిన ఒకటో రెండో సినిమాలు మినహాయించి అన్నింట్లో ప్రకాష్ రాజ్ నటిస్తూనే వచ్చాడు. హీరోగా మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమారుడు. ఇందులో హీరో మామయ్యగా ప్రకాష్ రాజ్ నటించాడు.
{{/usCountry}}మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబో అంటే అభిమానులకు పండగే. మహేష్ చేసిన ఒకటో రెండో సినిమాలు మినహాయించి అన్నింట్లో ప్రకాష్ రాజ్ నటిస్తూనే వచ్చాడు. హీరోగా మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమారుడు. ఇందులో హీరో మామయ్యగా ప్రకాష్ రాజ్ నటించాడు.
{{/usCountry}}ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే ఒక్కడు, పోకిిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అతడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, గుంటూరు కారం.. ఇలా చాలా సినిమాల్లో మహేష్ బాబు- ప్రకాష్ రాజ్ కాంబినేషన్ అలరించింది. ఒక్కడు, పోకిరి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల్లో మహేష్ బాబు అపోజిట్ గా విలన్ క్యారెక్టర్లు వేశాడు ప్రకాష్ రాజ్.