టైటిల్: ప్రేమంటే

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, వెన్నెల కిశోర్, సుమ కనకాల, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ తదితరులు
కథ, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
ఎడిటింగ్: అన్వర్ అలీ, రాఘవేంద్ర తిరుణ్
నిర్మాత: జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, రానా దగ్గుబాటి
విడుదల తేది: 21 నవంబర్ 2025
ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమంటే. థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది క్యాప్షన్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను హీరో రానా దగ్గుబాటి సమర్పించారు.
నవనీత్ శ్రీరామ్ కథ, దర్శకత్వం వహించిన ప్రేమంటే సినిమా ఇవాళ (నవంబర్ 21) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ప్రేమంటే రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
పెళ్లిపై ఇద్దరికి భిన్న అభిప్రాయాలు ఉన్న మది అలియాస్ మధుసూదన్ (ప్రియదర్శి), రమ్య (ఆనంది) ఓ వివాహంలో కలుసుకుంటారు. ఇద్దరు అభిప్రాయాలు చెప్పుకుని ఒకరినొకరు ఇష్టపడతారు. ఇరువురి పెద్దలు వీరిద్దరికి వివాహం చేస్తారు. మది, రమ్య ఇద్దరు అనుకున్నట్లుగా కొంతకాలం వైవాహిక జీవితం హాయిగా సాగుతుంది.
ఈ క్రమంలో ఆనంది డే టైమ్‌లో ఆఫీస్‌కు వెళ్తే మది రాత్రిపూట వ్యాపారం చేస్తాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈ గొడవలో మది తన బిజినెస్ సీక్రెట్ ఒకటి చెబుతాడు. ఆ తర్వాత మది, రమ్యల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది?, ఇద్దరి మధ్య గొడవలు అధికమవ్వడానికి కారణాలు ఏంటీ? వారు అనుకున్నట్లుగా వైవాహిక జీవితం సాగిందా? చివరికి అయినా రమ్య, మది కలుసుకున్నారా? తెలియాలంటే ప్రేమంటే చూడాల్సిందే.
విశ్లేషణ:
లవ్ లైఫ్, పెళ్లి జీవితం రెండు వేరుగా ఉంటాయి. ప్రేమలో ఉన్నట్లుగా పెళ్లి తర్వాత ఉండలేరు. పెళ్లి తర్వాత ఒకరిపై మరొకరి గురించి పూర్తిగా తెలుస్తుంది. అది అర్థం చేసుకుంటే ఇద్దరి జీవితం హాయిగా సాగుతుంది. లేకుంటే గొడవలు, విడాకులు అంటూ బంధం తెగిపోతుంది.
{{/usCountry}}లవ్ లైఫ్, పెళ్లి జీవితం రెండు వేరుగా ఉంటాయి. ప్రేమలో ఉన్నట్లుగా పెళ్లి తర్వాత ఉండలేరు. పెళ్లి తర్వాత ఒకరిపై మరొకరి గురించి పూర్తిగా తెలుస్తుంది. అది అర్థం చేసుకుంటే ఇద్దరి జీవితం హాయిగా సాగుతుంది. లేకుంటే గొడవలు, విడాకులు అంటూ బంధం తెగిపోతుంది.
{{/usCountry}}ఇదే విషయాన్ని కామెడీగా డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ చూపించిన సినిమానే ప్రేమంటే. లవ్, మ్యారేజ్ అంటే థ్రిల్ ఉంటుంది. అందుకే టైటిల్‌కు థ్రిల్ ప్రాప్తిరస్తు అనే క్యాప్షన్ పెట్టారు. ఈ క్యాప్షన్ సినిమా జోనర్‌కు కూడా బాగా సరిపోయేలా ఉంది.
ఇంటర్వెల్ సీక్రెట్
స్టోరీ చూస్తే రొటీన్‌గా అనిపిస్తుంది. కానీ, ఆద్యంతం కామెడీ సీన్లు, నవ్వించే డైలాగ్స్‌తో బాగానే తెరకెక్కించారు దర్శకుడు. హీరో, హీరోయిన్ల అభిప్రాయాలు, కలవడం, కలిసినప్పుడు జరిగే సంభాషణ, ప్రేమ, పెళ్లి వంటివి ఫస్టాఫ్‌లో బాగా సాగుతాయి. అలాగే, హెడ్ కానిస్టేబుల్ (ఆశా మేరీ)గా యాంకర్ సుమ కనకాల పాత్ర ఎంట్రీ, వెన్నెల కిశోర్‌తో కామెడీ ట్రాక్ అలరిస్తాయి.
ఇంటర్వెల్ బ్లాక్‌లో మది చెప్పే సీక్రెట్‌తో కథలో కొత్త మలుపు చోటు చేసుకుంటుంది. ఆ సీక్రెట్ సెకండాఫ్‌పై క్యూరియాసిటీ కలిగిస్తుంది. అలాగే, బ్యాంక్ నేపథ్యంలో వచ్చే సిన్నివేశాలు, భార్య పాత్ర ఇచ్చే ట్విస్ట్ అసలైన థ్రిల్‌ను పంచుతాయి.
అయితే, సెకండాఫ్‌లో కథనం కాస్తా నెమ్మదించిన ఎమోషనల్ సీన్లతో భావోద్వేగాలు పండించారు. అలాగే, అక్కడక్కడ కామెడీ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక ఆశా మేరీ సాధించే కేస్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. క్లైమాక్స్ బాగానే ఉంది. ఇకపోతే డైరెక్టర్‌గా నవనీత్ శ్రీరామ్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు.
నవ్విస్తూ థ్రిల్‌ను పంచే
నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. ప్రియదర్శి, ఆనందిల నటన బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సుమ కనకాల యాక్టింగ్, వెన్నెల కిశోర్ ట్రాక్ నవ్విస్తుంది. మిగతా పాత్రలు కూడా నవ్విస్తాయి, ఏడిపిస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రేమంటే మూవీ నవ్విస్తూ థ్రిల్‌ను పంచే భార్యాభర్తల ప్రేమకథ.