వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి. పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రియదర్శి మల్లేశం, బలగం సినిమాలతో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.
గతేదాడి నాలుగు సినిమాలతో

గతేడాది ఏకంగా నాలుగు సినిమాలు, అంతకుముందు సంవత్సరం 3 సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించి ఎంటర్‌టైన్ చేశాడు. కోర్ట్, మిత్ర మండలి, ప్రేమంటే, సారంగపాణి జాతకం సినిమాలతో ఆకట్టుకున్న ప్రియదర్శి ఈ ఏడాది కొత్త సినిమాతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు.
ప్రియదర్శికి జోడీగా
ప్రియదర్శి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సుయోధన. ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా హీరోయిన్‌గా ద్రిషిక చందర్ నటించింది. అంతేకాకుండా డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు.
సుయోధన రిలీజ్ డేట్
సుయోధన సినిమాకు వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సుయోధన రిలీజ్ డేట్‌ను తాజగా ఇవాళ (మార్చి 10) ప్రకటించారు మేకర్స్.
టేబుల్‌పై రక్తంతో
సుయోధన సినిమాను మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్రియదర్శి అద్దంలో తనను తానే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. టేబుల్‌పైన రక్తంతో కత్తి, బేస్ బాల్ బ్యాట్, మువ్వల పట్టీలు, బాల్, తబలాలు, మైక్ సెట్ ఉన్నాయి.
దుర్యోధనుడిగా సాయి కుమార్
వీటన్నిటికిమించి ప్రియదర్శి వెనుక ఉన్న గోడకు సాయి కుమార్ దుర్యోధనుడి గెటప్‌లో ఉన్న ఫొటో మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూస్తుంటే సుయోధన సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. సుయోధన రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అత్యుత్తమ ప్రమాణాలతో
{{/usCountry}}వీటన్నిటికిమించి ప్రియదర్శి వెనుక ఉన్న గోడకు సాయి కుమార్ దుర్యోధనుడి గెటప్‌లో ఉన్న ఫొటో మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూస్తుంటే సుయోధన సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. సుయోధన రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అత్యుత్తమ ప్రమాణాలతో
{{/usCountry}}నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. "మంచి కథా కథనాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ప్రియదర్శి, సాయికుమార్, ద్రిషిక చందర్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. జై క్రిష్ సంగీత దర్శకత్వం వహించారు" అని తెలిపారు.
మార్చి 27న తీసుకొస్తున్నాం
"రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ను అందించారు . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 27 న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాము. త్వరలో సుయోధన సినిమా టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేస్తాము" అని చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్ బోసుబాబు నిడుమోలు.
శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా రిలీజ్
కాగా, సుయోధన సినిమా శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు, కీలక పాత్రలతోపాటు విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ నిర్వర్తించారు.