గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా తాజాగా ఇండియాలో మళ్లీ ల్యాండ్ అయింది. ఇటలీలో జరిగిన బివిల్గారి ఈవెంట్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ కోసం ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యక్షమైంది. శాటిన్ సిల్వర్ షర్ట్, బ్లూ జీన్స్‌తో చాలా క్యాజువల్ లుక్‌లో కనిపించిన ప్రియాంకను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. విమానాశ్రయం వద్ద ఫోటోగ్రాఫర్లకు అభివాదం చేస్తూ, అభిమానులతో ఓపికగా సెల్ఫీలు దిగింది ప్రియాంక చోప్రా.
అమృత్‌సర్‌లో అడ్వెంచర్

ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పంచుకుంది. అమృత్‌సర్‌కు ప్రయాణిస్తున్న మ్యాప్‌ను పోస్ట్ చేస్తూ.. "చలో, మరో అడ్వెంచర్ (సాహసం)" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
అయితే ఈ ప్రయాణం కేవలం పర్సనల్ ట్రిప్పా లేక ఏదైనా సినిమా షూటింగ్ కోసమా అనేది ఆమె వెల్లడించలేదు. ప్రియాంక చేస్తున్న ఈ 'కొత్త సాహసం' ఏమై ఉంటుందా అని నెటిజన్లు ఆత్రుతగా చర్చించుకుంటున్నారు.
రాజమౌళి వారణాసితో
చాలా కాలం తర్వాత ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ సినిమాలో నటిస్తుండటం విశేషం. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.
ఆ సినిమా కోసమేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉండబోతుంది. మహేష్ బాబు రాముడి అవతారంలో కనిపిస్తారని వస్తున్న వార్తలు అంచనాలను పెంచేస్తున్నాయి. వారణాసి సినిమా షూటింగ్ కోసమే ప్రియాంక మళ్లీ ఇండియాకు వచ్చారేమోననే కామెంట్లు వినిపిస్తున్నాయి.
రిలీజ్ డేట్
సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక చోప్రా ఓ ఇండియన్ మూవీలో వెండితెరపై చూడబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. రాజమౌళి సినిమా కావడం, అది కూడా మహేష్ బాబుతో కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో ది బ్లఫ్
{{/usCountry}}సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక చోప్రా ఓ ఇండియన్ మూవీలో వెండితెరపై చూడబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. రాజమౌళి సినిమా కావడం, అది కూడా మహేష్ బాబుతో కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో ది బ్లఫ్
{{/usCountry}}ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన పైరేట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో యాక్షన్ తో ప్రియాంక మెప్పించింది. ఈ సినిమాను జనాలు తెగ చూసేస్తున్నారు. మరోవైపు ప్రియాంక చోప్రా పాపులర్ సిరీస్ 'సిటాడెల్' సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతోంది.