...
...
Next Story

OTT: ఓటీటీ రంగంలోకి అగ్ర నిర్మాత కూతురు- మొన్న నిధి షా, నేడు ఖుషాలీ కుమార్- ఒకే సిరీస్‌తో ఎంట్రీ- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Gulshan Kumar Daughter Khushali Kumar OTT Debut: ప్రముఖ కంటెంట్ క్రియేటర్స్ టీవీఎఫ్ నిర్మిస్తున్న సెన్సేషనల్ ఓటీటీ సిరీస్ సప్నే వర్సెస్ ఎవ్రీవన్ రెండో సీజన్‌తో అగ్ర నిర్మాత కూతురు ఖుషాలీ కుమార్ డిజిటల్ తెరపైకి అడుగుపెడుతున్నారు. మొన్న నిధి షా, నేడు ఖుషాలీ కుమార్ ఒకే ఓటీటీ సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చారు.

Published on: May 1, 2026, 18:34:45 IST
Advertisement

Gulshan Kumar Daughter Khushali Kumar OTT Entry: బాలీవుడ్ అగ్ర నిర్మాత గుల్షన్ కుమార్ కుమార్తె, నటి ఖుషాలీ కుమార్ తన కెరీర్‌లో కొత్త అడుగు వేశారు. అత్యుత్తమ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే 'ది వైరల్ ఫీవర్' (TVF) ఓటీటీ సంస్థతో ఆమె తొలిసారి జతకట్టారు.

ఓటీటీ రంగంలోకి అగ్ర నిర్మాత కూతురు- మొన్న నిధి షా, నేడు ఖుషాలీ కుమార్- ఒకే సిరీస్‌తో ఎంట్రీ- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ రంగంలోకి అగ్ర నిర్మాత కూతురు- మొన్న నిధి షా, నేడు ఖుషాలీ కుమార్- ఒకే సిరీస్‌తో ఎంట్రీ- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'సప్నే వర్సెస్ ఎవ్రీవన్' సీజన్-2 ద్వారా ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఖుషాలీ కుమార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. భారతదేశంలో ఇంటర్నెట్ తర్వాతి కాలంలో కథలు చెప్పే విధానాన్ని మార్చేసిన అరుణభ్ కుమార్ వంటి వారితో పనిచేయడం తన చిరకాల వాంఛ అని ఖుషాలీ పేర్కొన్నారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ హీరోయిన్‌తో పోలిక

ఈ ప్రాజెక్టుపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఖుషాలీ కుమార్ ఆసక్తికరమైన పోలికను తెరపైకి తెచ్చారు. "యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) సినిమాలో హీరోయిన్‌గా నటించడం ఎంతటి గౌరవమో, టీవీఎఫ్ సృష్టించే పాత్రలో నటించడం కూడా అలాంటి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే" అని ఖుషాలీ అభివర్ణించారు.

పంచాయత్, పిచర్స్ వంటి మర్చిపోలేని ప్రపంచాలను సృష్టించిన అరుణభ్ కుమార్ తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అరుణభ్‌తో కలిసి దిగిన ఫోటోలను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు.

ముంబై నేపథ్యంలో సాగే అసలైన సంఘర్షణ

సప్నే వర్సెస్ ఎవ్రీవన్ 2 ఓటీటీ సిరీస్ ముంబై మహానగరంలోని గ్లామర్ ప్రపంచం (సినిమా రంగం), కఠినమైన రియల్ ఎస్టేట్ మాఫియా నేపథ్యంలో సాగే ఇంటెన్స్ డ్రామా. మొదటి సీజన్ సాధించిన భారీ విజయం తర్వాత, రెండో సీజన్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ సప్నే వర్సెస్ ఎవ్రీవన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ మే 1గా ప్రకటించారు మేకర్స్. విభిన్నమైన కథాంశాలను కోరుకునే తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు కూడా ఈ డ్రామా సరికొత్త అనుభూతిని అందించనుంది.

ఒకే ఓటీటీ సిరీస్‍‌తో ఎంట్రీ

కాగా, ఇదివరకు సీరియల్ బ్యూటి నిధి షా కూడా సప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌తోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్న నిధి షా, నేడు ఖుషాలీ కుమార్ ఓటీటీ రంగంలోకి, అది కూడా ఒకే సిరీస్‌తో అడుగుపెట్టడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'సప్నే వర్సెస్ ఎవ్రీవన్' సీజన్ 2 ఎప్పుడు విడుదలవుతుంది?

ఈ పాపులర్ సిరీస్ రెండో సీజన్ మే 1వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

2. ఈ సిరీస్ ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న నటి ఎవరు?

బాలీవుడ్ నటి ఖుషాలీ కుమార్ 'సప్నే వర్సెస్ ఎవ్రీవన్-2'తో తన డిజిటల్ డెబ్యూ చేస్తున్నారు.

3. 'సప్నే వర్సెస్ ఎవ్రీవన్' ఏ నేపథ్యంలో సాగుతుంది?

ఈ కథ ముంబైలోని సినిమా పరిశ్రమ, రియల్ ఎస్టేట్ రంగంలోని పోటీ, సంఘర్షణల చుట్టూ తిరుగుతుంది.

4. ఈ సిరీస్ నిర్మిస్తున్న సంస్థ ఏది?

భారతదేశంలో డిజిటల్ కంటెంట్ విప్లవానికి నాంది పలికిన 'టీవీఎఫ్' (TVF - The Viral Fever) ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks