డబ్బు సంపాదించుకుని వద్దామని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశా, అలాంటి పిచ్చే ఉంది.. నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కామెంట్స్
నిర్మాత తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నారు సెవెన్ హిల్స్ సతీష్. ఇప్పుడు ఆయన దర్శకుడిగా మారాలనుకుంటున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రెస్ మీట్‌లో తాను డైరెక్టర్‌గా మారుతున్న విషయాన్ని సెవెన్ హిల్స్ సతీష్ చెప్పారు. ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బట్టలరామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలో బాయ్ సినిమాలను నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్. రీసెంట్‌గా అక్టోబర్ 23న బర్త్ డే వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాను దర్శకుడిగా నూతన ప్రయాణం మొదలుపెట్టినట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సతీష్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

డైరెక్టర్‌గా కొత్త వాళ్లతో
"నేను నిర్మించిన మూడు సినిమాలు కూడా కొత్త వాళ్లతో చేశాను. డైరెక్టర్‌గా కూడా కొత్తవాళ్లతో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తవాళ్లతో చేస్తే డేట్స్ ఇబ్బంది ఉండదు. హీరో ఎవరు ఓకే అయినా చేస్తా" అని నిర్మాత సతీష్ అన్నారు.
పాన్ ఇండియా సినిమాకు సిద్ధం
"వేరే ఏ భాష నుంచి వచ్చిన సినిమా అయినా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇక మనం చేసే మంచి సినిమాను ఇంకెంతగా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. రివ్యూలు జెన్యూన్‌గా ఇస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. డైరెక్టర్‌గా నేను ఏంటనేది నిరూపించుకుంటే తర్వాత పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధం" అని సెవెన్ హిల్స్ సతీష్ తెలిపారు.
కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్
"లిటిల్ హార్ట్స్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే దర్శకులకు మంచి గుర్తింపు ఉంటుంది. అలాంటి సినిమా తీసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నా ఫేవరెట్ హీరో నాని. ఆయనతో సినిమా చేయాలని ఉంది. ముందుగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్ని చిత్రాలకు పని చేశాను. ఆ తర్వాత డబ్బు సంపాదించుకుని వద్దామని రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో కొంత డబ్బులు సంపాదించి, ఆ తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను" అని సతీష్ అన్నారు.
టాప్ డైరెక్టర్స్ మంచి స్నేహితులు
"సాధారణంగా ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఉంటాయని నాకు తెలుసు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఆశయంతో నిర్మాతగా వచ్చాను. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది టాప్ డైరెక్టర్స్ వెంకీ అట్లూరి, సాగర్ చంద్ర, సంపత్ నంది, బలగం వేణు వంటి వారు నాకు మంచి స్నేహితులు" అని సతీష్ పేర్కొన్నారు.
నానితో కూడా కలిసి
"అలాగే నేను సురేష్ ప్రొడక్షన్స్ ఇంకా వేరే ప్రొడక్షన్స్‌లో కూడా పనిచేశాను. ఆ సమయంలో నందినీ రెడ్డి, మచ్చ రవి, నేచురల్ స్టార్ నానితో కూడా కలిసి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాను" అని దర్శకుడిగా మారుతున్న ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ వెల్లడించారు.
అలాంటి జాగ్రత్తలే తీసుకుని
"ఎన్నో వేలమంది, లక్షలమంది చూసి ఆదరించే సినిమాను.. వారు సంతృప్తి పరిచే విధంగా ఉండాలంటే ముందు కథ సెలెక్ట్ చేసుకునే విధానంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. నేను అటువంటి జాగ్రత్తలే తీసుకుని సినిమాలు తీస్తున్నాను. అలాగే సినిమాలు చేయడానికి ఇష్టం కాదు, పిచ్చి ఉండాలి. నాకు సినిమాలు అంటే అటువంటి పిచ్చే ఉంది. అందుకే సెలెక్టెడ్‌గానే సినిమాలు చేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు నిర్మాత సతీష్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


