...
...
Next Story

Mayookha: పేరు మార్చుకుని డైరెక్టర్ అయిన నిర్మాత- కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్‌లా మయూఖ, ఆ అవార్డ్ ఊహించలేదు: శ్రీతేజ్

Director Shree Tej SK About Mayookha Movie: నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించిన శ్రీకాంత్ కాండ్రేగుల.. శ్రీతేజ్ ఎస్.కెగా పేరు మార్చుకుని దర్శకుడిగా తెరకెక్కినంచిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మయూఖ. పాయల్ చెంగప్ప హీరోయిన్‌గా చేసిన మయూఖకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు దర్శకుడు శ్రీతేజ్.

Published on: Oct 8, 2026, 09:43:19 IST
Advertisement

Director Shree Tej SK About Mayookha Movie: బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా "మయూఖ". ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహింంచారు. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు.

పేరు మార్చుకుని దర్శకత్వం

పేరు మార్చుకుని డైరెక్టర్ అయిన నిర్మాత- కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్‌లా మయూఖ, ఆ అవార్డ్ ఊహించలేదు: శ్రీతేజ్
పేరు మార్చుకుని డైరెక్టర్ అయిన నిర్మాత- కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్‌లా మయూఖ, ఆ అవార్డ్ ఊహించలేదు: శ్రీతేజ్

సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ నిర్మించిన శ్రీకాంత్ కాండ్రేగుల.. శ్రీతేజ్ ఎస్.కె. (Shree Tej SK)గా స్క్రీన్ నేమ్ మార్చుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. "మయూఖ" సినిమా ఈ నెల 9న అంటే రేపు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మయూఖలోని హైలైట్స్‌ను డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కె. ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

-మా మయూఖ సినిమాకు ఇటీవల న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ మిస్టరీ మూవీగా అవార్డ్ వచ్చింది. థ్రిల్లర్ కేటగిరిలో సెకండ్ బెస్ట్ వచ్చింది. ఈ అవార్డ్ వస్తుందని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా మూవీ అవార్డ్‌కు సెలెక్ట్ అయ్యిందని తెలిసి టీమ్ అంతా హ్యాపీగా ఫీలయ్యాం.

కొరియన్ హాలీవుడ్ తరహాలో

-మేము కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు కూడా మా మూవీని అప్లై చేశాం. మీరు మా మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే కొరియన్, హాలీవుడ్ మూవీ తరహా స్టోరీ టెల్లింగ్, కలర్ గ్రేడింగ్ కనిపిస్తుంటుంది. స్టోరీ కొద్ది కొద్దిగా రివీల్ అవుతూ సెకండాఫ్ వచ్చేసరికి పీక్స్‌కు వెళ్తుంది.

-ఈ కథను మొదట సీనియర్ హీరోయిన్ మహేశ్వరి (గులాబీ ఫేమ్)కి చెప్పాం. ఆమె మేము చెప్పిన రెండు కథలు విన్నారు. ఈ స్టోరీతో పాటు మరొక కథ ఆమెకు బాగా నచ్చింది. ఆ కథకు ఆమె లాక్ అయ్యారు. పాయల్ కన్నడలో మంచి ఎంటర్‌టైనింగ్ మూవీస్ చేశారు. ఆమె మా కథలోని క్యారెక్టర్‌కు బాగా సరిపోతారని అనిపించింది.

-పాయల్ చేసిన ఓటీటీ సిరీస్‌లతో ఇప్పటికే తెలుగు ఆడియెన్స్‌కు రీచ్ అయ్యారు. ఈ కథలో ఆమె పాత్రను మన ఆడియెన్స్ బాగా రిలేట్ చేసుకుంటారు, ఆమె క్యారెక్టర్ పడే స్ట్రగుల్స్‌కు రెస్పాండ్ అవుతారని నమ్మాం. మయూఖగా పాయల్ చెంగప్ప అద్భుతంగా పర్‌ఫార్మ్ చేశారు. ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కుతుంది.

బెస్ట్ థ్రిల్లర్‌గా అవార్డ్

-ఇలాంటి తరహా థ్రిల్లర్స్ గతంలో వచ్చినా మా మూవీలో స్క్రీన్ ప్లే, సినిమా స్టోరీని ప్రెజెంట్ చేసే విధానం కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది. ప్రెజెంటేషన్ కొత్తగా ఉంది కాబట్టే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ థ్రిల్లర్‌గా అవార్డ్ దక్కింది. ఇక్కడే మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే నమ్మకం మొదలైంది.

-ఎక్కడో స్మశానంలో దెయ్యాలు ఉన్నాయంటే ముందే మనసు ప్రిపేర్ అవుతుంది. కానీ, మనం నివసించే చోట, రోజు ఉండే చోట ఎవరో అపరిచిత వ్యక్తి ఉన్నారంటే ఇంకా ఎక్కువ భయపడతాం. మయూఖ హారర్ సినిమా కాదు థ్రిల్లర్ మూవీ.

హీరోయిన్ ఫ్లాట్‌లోకి

-హీరోయిన్ ఉండే ఫ్లాట్‌లోకి ఒక అపరిచిత వ్యక్తి ఎందుకు వచ్చాడు, అతను ఏం చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్‌తో అతనికి రిలేషన్ ఏంటి .. ఇలాంటి అంశాలతో కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంటుంది. మా సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks