...
...
Next Story

OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న తెలుగు హారర్ కామెడీ- 1.2 మిలియన్ వ్యూస్, టాప్ 7 ప్లేస్- 7.2 రేటింగ్!

Raakaasa OTT Trending On Top 7 Place: ఓటీటీలో తెలుగు ఫాంటసీ హారర్ కామెడీ సినిమా దూసుకుపోతోంది. ఏకంగా 1.2 మిలియన్ వ్యూస్‌తో టాప్ 7 ప్లేసులో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. ఆ సినిమానే రాకాస. ఐఎమ్‌డీబీలో 7.2 రేటింగ్ సాధించిన రాకాస ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో లుక్కేద్దాం.

Published on: May 10, 2026, 19:38:43 IST
Advertisement

Raakaasa OTT Trending On Top 7 Place: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించి, ప్రొడ్యూసర్‌గా మంచి హిట్ అందుకున్న సినిమా రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలై రాకాస సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఐఎమ్‌డీబీ రేటింగ్

ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న తెలుగు హారర్ కామెడీ- 1.2 మిలియన్ వ్యూస్, టాప్ 7 ప్లేస్- 7.2 రేటింగ్!
ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న తెలుగు హారర్ కామెడీ- 1.2 మిలియన్ వ్యూస్, టాప్ 7 ప్లేస్- 7.2 రేటింగ్!

అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.2 రేటింగ్ కూడా సంపాదించుకుంది రాకాస. అలాంటి రాకాస ఓటీటీలోని దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రాకాస ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ గ్లోబల్ చార్ట్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది రాకాస మూవీ.

1.2 మిలియన్ వ్యూస్‌తో

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లో టాప్ 7కి రాకాస చేరుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ఓటీటీ ట్రెండ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. ఈ ఘనతతో ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో 'రాకాస' పలు అంతర్జాతీయ మార్కెట్ల చిత్రాల సరసన నిలిచింది.

ఓటీటీ స్ట్రీమింగ్‌లో

థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే ఓటీటీ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి. థియేటర్లలో నెమ్మదిగా మౌత్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్లియర్ రెస్పాన్స్‌ పొందినట్లుగా దూసుకుపోతోంది.

థియేటర్లలో మ్యాజిక్

థియేటర్లలో ఈ రాకాస మూవీని అందరూ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు అదే ఆదరణ ఓటీటీలోనూ కనిపిస్తోంది. ప్రమోషన్స్‌తోనే అందరినీ ఆకట్టుకున్న ‘రాకాస’ చిత్రం థియేటర్లలో మ్యాజిక్ చేసింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరినీ ఈ చిత్రం ఆకట్టుకుంది.

ఓటీటీ ట్రెండింగ్

పిల్లలకు ఈ చిత్రంలోని ఫాంటసీ నచ్చితే.. పెద్ద వాళ్లకి కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ నచ్చాయి. అలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'రాకాస' ఆకట్టుకోవడంతో థియేటర్లతో పాటుగా ఓటీటీలోనూ దుమ్ములేపేస్తోంది. సమ్మర్‌లో కూల్ మూవీగా, వేసవి సెలవుల్లో కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రంగా ‘రాకాస’ నిలిచింది.

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10

ఇక ఈ కారణంతోనే ఇప్పుడు ఓటీటీలో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ గ్లోబల్ టాప్ 10లో ‘రాకాస’ ఎంట్రీని గమనిస్తే.. తెలుగు సినిమాకు పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపును మరింతగా నొక్కి చెబుతున్నట్టుగా అనిపిస్తుంది.

సంయుక్త నిర్మాణం

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై, జీ స్టూడియోస్ సహకారంతో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ సయుక్తంగా నిర్మించారు. బ్రహ్మ రాక్షసుడిని హంతమొందించే కథగా తెరకెక్కిన కామెడీ హారర్ ఫాంటసీ రాకాసను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయండి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe