సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రవి ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు స్వాతి సుధీర్, డాక్టర్ రవి బాల నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ‘రామ్ భజరంగ్’ సినిమాకు సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.
నలుగురు హీరోయిన్లు

స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మానస రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, కమల్, షఫీ, శివరామరాజు వెంకట్, ధనరాజ్, రచ్చ రవి, రాకేశ్, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
1980 బ్యాక్ డ్రాప్‌లో
ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ రామ్ భజరంగ్ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయని, 2026లో ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
రామ్ భజరంగ్ మూవీ గ్లింప్స్
తాజాగా రామ్ భజరంగ్ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రామ్ భజరంగ్ గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
కెమెరామేన్ అజయన్ విన్‌సెంట్ కామెంట్స్
ఈ సందర్బంగా కెమెరామేన్ అజయన్ విన్సెంట్ మాట్లాడుతూ.. "రామ్ భజరంగ్ సినిమా చాలా బాగుంటుంది. షూటింగ్ చేసే సమయంలోనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. త్వరలో ఈ మూవీ థియేటర్స్‌లో రానుంది. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" అని తెలిపారు.
డిఫరెంట్ రోల్‌లో
{{/usCountry}}ఈ సందర్బంగా కెమెరామేన్ అజయన్ విన్సెంట్ మాట్లాడుతూ.. "రామ్ భజరంగ్ సినిమా చాలా బాగుంటుంది. షూటింగ్ చేసే సమయంలోనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. త్వరలో ఈ మూవీ థియేటర్స్‌లో రానుంది. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" అని తెలిపారు.
డిఫరెంట్ రోల్‌లో
{{/usCountry}}నటుడు వెంకట్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్‌లో నటించాను. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర మీ అందరికి నచ్చుతుంది. డైరెక్టర్ సుధీర్ రాజ్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు" అని అన్నారు.
వైడ్ అండ్ వైలెంట్ రోల్
"చాలా వైడ్ అండ్ వైలెంట్ రోల్ నాకు డైరెక్టర్ గారు ఇచ్చారు. ఈ మూవీలో నా లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిర్మాతలు స్వాతి సుధీర్ అలాగే రవి బాల గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను" అని వెంకట్ పేర్కొన్నారు.
రా అండ్ రస్టిక్‌గా
కాగా రామ్ భజరంగ్ గ్లింప్స్ అదిరిపోయింది. జులపాల జుట్టుతో రాజ్ తరుణ్ డిఫరెంట్ లుక్‌తో అట్రాక్ట్ చేశాడు. గ్లింప్స్‌లో తల లేకుండా మొండెంలు చూపిస్తూ రా అండ్ రస్టిక్‌గా సినిమాను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇది ఇద్దరి స్నేహితుల మధ్య వైరం ఎలా ఏర్పడిందనే కాన్సెప్ట్‌తో ఫుల్ వయెలెంట్ యాక్షన్ లవ్ స్టోరీ సినిమాగా తెలుస్తోంది.