...
...
Next Story

Ram Charan Sorry Bumrah: జస్‌ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్- పెద్ది ఈవెంట్‌లో 2 పొరపాట్లు- వీడియోలు వైరల్

Ram Charan Apologises To Jasprit Bumrah: రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై రామ్ చరణ్ పొరపాటుగా చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ ఆయనకు క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Published on: May 24, 2026, 10:07:59 IST
Advertisement

Ram Charan Apologises To Jasprit Bumrah: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరదాగా మాట్లాడబోయి ఒకే వేదికపై బ్యాక్ టు బ్యాక్ రెండు చిన్న పొరపాట్లు చేశారు. శనివారం (మే 23) భోపాల్ నగరంలో అత్యంత వైభవంగా జరిగిన 'పెద్ది' (PEDDI KI AAWAZ) చిత్ర ఆడియో విడుదల వేడుకలో ఈ ఘటన జరిగింది.

జస్‌ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్- పెద్ది ఈవెంట్‌లో 2 పొరపాట్లు- వీడియోలు వైరల్ (PTI)
జస్‌ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్- పెద్ది ఈవెంట్‌లో 2 పొరపాట్లు- వీడియోలు వైరల్ (PTI)

చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ పెద్ది గ్రాండ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. క్రికెట్ వీరుడు జస్‌ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్ అనడమే కాకుండా, భోపాల్‌ ప్రజలను బిహార్ వాసులుగా రామ్ చరణ్ పిలవడంతో స్టేజ్ మీదున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

రాపిడ్ ఫైర్‌లో దొర్లిన పొరపాటు

'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సాన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'పెద్ది'. ఇదొక పక్కా స్పోర్ట్స్ డ్రామా కావడంతో వేదికపై హోస్ట్, రామ్ చరణ్‌తో ఒక ఆసక్తికరమైన రాపిడ్ ఫైర్ గేమ్ ఆడించారు. ఇందులో భారతదేశపు అగ్రశ్రేణి క్రికెటర్లను ఒక్క ముక్కలో వర్ణించాలని కోరారు.

సచిన్ టెండూల్కర్ గురించి చెబుతూ "లెజెండరీ రన్" అని, ధోనీని "కూల్ అండ్ కామ్" అని చరణ్ ప్రశంసించారు. రోహిత్ శర్మను "అందరివాడు" అని, విరాట్ కోహ్లీని "ఫైర్" అంటూ అభివర్ణించి అభిమానుల్లో రామ్ చరణ్ జోష్ నింపారు. అయితే, అసలు ట్విస్ట్ స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు వచ్చినప్పుడు ఎదురైంది.

నాకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం

అలాంటిది రామ్ చరణ్ ఆయనను ఫుట్‌బాల్ ఆటగాడిగా పేర్కొనడంతో ఈ వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అయింది. దీనికి తోడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు పొరపాటున 'బిహార్ ప్రజలు' అని సంబోధించారు రామ్ చరణ్. వెంటనే అలర్ట్ అయిన యాంకర్ ఆ తప్పును సరిదిద్దారు.

క్షమాపణలు చెప్పిన మెగా పవర్ స్టార్

భోపాల్‌లో పెద్ది వేడుక ముగిసిన తర్వాత తన పొరపాట్లను గ్రహించిన రామ్ చరణ్ వెంటనే స్పందించారు. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా బుమ్రాకు, అభిమానులకు క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. అది కేవలం ఆ క్షణంలో జరిగిన మానవ సహజమైన పొరపాటేనని చెర్రీ వివరించారు.

"నిజంగా కొన్నిసార్లు నాకు పేర్లు సరిగ్గా గుర్తుండవు. ఆ ఉత్సాహంలో, అంత పెద్ద జనసందోహం మధ్య పొరపాటు జరిగింది. అందుకు జస్‌ప్రీత్ బుమ్రా గారికి క్షమాపణలు చెబుతున్నాను. నిజంగా మీ ఆటను నేను ఎంతగానో గౌరవిస్తాను. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను మీరు డిఫెన్స్‌లో పడేస్తున్నప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడతాడు" అంటూ బుమ్రాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు రామ్ చరణ్.

జూన్ 4న థియేటర్లలోకి 'పెద్ది'

రామ్ చరణ్ తప్పును ఒప్పుకున్న తీరును చూసి మెగా అభిమానులు ఆయన సుగుణాన్ని కొనియాడుతున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పెద్ది సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఒక సాధారణ యువకుడు క్రీడల ద్వారా తన గుర్తింపును ఎలా సంపాదించుకున్నాడు అనే కథాంశంతో ఈ స్పోర్ట్స్ డ్రామా సాగనుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెట్, రన్నింగ్, రెజ్లింగ్ (కుస్తీ) వంటి విభిన్న క్రీడలు ఆడే వ్యక్తిగా కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ పెద్ది చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'పెద్ది' ఈవెంట్‌లో రామ్ చరణ్ చేసిన 2 పొరపాట్లు ఏమిటి?

రామ్ చరణ్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా పేర్కొన్నారు. అలాగే భోపాల్ ప్రజలను బిహార్ వాసులుగా సంబోధించారు.

2. ఈ పొరపాటుపై రామ్ చరణ్ ఎలా స్పందించారు?

చరణ్ తన ఎక్స్ (X) ఖాతా ద్వారా జస్‌ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు. జనసందోహం, ఈవెంట్ ఉత్సాహం మధ్య జరిగిన పొరపాటని వివరించారు.

3. 'పెద్ది' సినిమా ఏ జోనర్‌కు చెందుతుంది?

ఇది ఒక పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి విభిన్న క్రీడల్లో నటిస్తున్నారు.

4. 'పెద్ది' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? ఈ చిత్ర దర్శకుడు ఎవరు?

ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe