...
...
Next Story

Ram Charan Parenting: నేను రఫ్ తండ్రినే, ఉపాసన సున్నితంగా చూసుకుంటుంది.. పిల్లల పెంపకంపై రామ్ చరణ్ కామెంట్స్!

Ram Charan On Parenting: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముగ్గురు పిల్లల తండ్రిగా తన బాధ్యతలు, ఇంట్లో తను ఉండే విధానంపై 'ఎస్క్వైర్ ఇండియా' ఇంటర్వ్యూలో మనసు విప్పి చెప్పారు. దీంతో రామ్ చరణ్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 14, 2026, 06:19:56 IST
Advertisement

Ram Charana About Fatherhood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు. 2023లో క్లిన్ కార జన్మించగా, 2026 జనవరిలో ఈ దంపతులకు కవలలు (ఒక బాబు, ఒక పాప) జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన మనవడు, మనవరాలికి 'శివ రామ్ కొణిదెల', 'అన్వీర దేవి కొణిదెల' అని నామకరణం చేశారు.

నేను రఫ్ తండ్రినే, ఉపాసన సున్నితంగా చూసుకుంటుంది.. పిల్లల పెంపకంపై రామ్ చరణ్ కామెంట్స్!
నేను రఫ్ తండ్రినే, ఉపాసన సున్నితంగా చూసుకుంటుంది.. పిల్లల పెంపకంపై రామ్ చరణ్ కామెంట్స్!

తన అసలు పేరైన శివశంకర వరప్రసాద్‌లోని 'శివ', కొడుకు పేరులోని 'రామ్' కలిసేలా మనవడికి, కనకదుర్గమ్మ ఆశీస్సులతో మనవరాలికి పేర్లు పెట్టామని చిరంజీవి గతంలోనే ప్రకటించారు. పిల్లలు ఇంట్లో లేకపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోతుందని, వారే తన గుండెచప్పుడు అని రామ్ చరణ్ ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.

"నేను రఫ్ డాడ్".. పెంపకంలో రామ్ చరణ్ స్టైలే వేరు!

పిల్లల పెంపకం విషయంలో తాను చాలా పక్కాగా ఉంటానని రామ్ చరణ్ వెల్లడించారు. "నేను కొంచెం రఫ్‌గా ఉండే తండ్రిని. పిల్లలు కింద పడినా, మట్టిలో ఆడినా, ఎత్తుపల్లాలు ఎక్కినా నేను భయపడను. వాళ్లు రిస్క్ తీసుకోవాలని, ధైర్యంగా పెరగాలని కోరుకుంటాను. వారి తల్లి (ఉపాసన) ఎంతో ప్రేమగా, సున్నితంగా చూసుకుంటుంది. కానీ వాళ్లకు ఏదైనా సాహసం చేయాలన్నా, ధైర్యం కావాలన్నా నా దగ్గరికే వస్తారు," అని రామ్ చరణ్ వివరించారు.

నా ప్రపంచం చాలా చిన్నది..

స్టార్‌డమ్ ఎంత ఉన్నా, పిల్లల ఎదుగుదల సమయంలో తాను భౌతికంగా వారితో ఉండటానికే (Present father) ప్రాధాన్యత ఇస్తానని రామ్ చరణ్ స్పష్టం చేశారు. సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నా, తన కుటుంబం, పెంపుడు జంతువులే తన ప్రాథమిక ప్రపంచమని రామ్ చరణ్ అన్నారు.

ఇదిలా ఉంటే, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంతో బిజీగా ఉన్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ ఒక పెహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ గ్లింప్స్‌లో మట్టి కుస్తీ పడుతూ రామ్ చరణ్ చూపించిన మాస్ లుక్ అభిమానులను అలరించింది.

జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల జూన్‌కు వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రామ్ చరణ్ పిల్లల పేర్లు ఏమిటి?

రామ్ చరణ్ పెద్ద కుమార్తె పేరు క్లిన్ కార కొణిదెల. 2026లో జన్మించిన కవల పిల్లల పేర్లు శివ రామ్ కొణిదెల మరియు అన్వీర దేవి కొణిదెల.

2. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఏది?

రామ్ చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో 'పెద్ది' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు.

3. 'పెద్ది' సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe