Sukumar Wife Tabitha Post On RC17 Launch: తెలుగు చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #RC17 (వర్కింగ్ టైటిల్) ఇవాళ ఆదివారం (నవంబర్ 1) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.
ముఖ్య అతిథిగా చిరంజీవి

'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం మళ్లీ రామ్ చరణ్‌తో చేతులు కలపడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన ఈ లాంచ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రాండ్‌గా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన చిరంజీవి
దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు చిరంజీవి క్లాప్ కొట్టి మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్ప సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
"నా ప్రియమైన సుక్కుతో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది" – రామ్ చరణ్
ఆర్‌సీ17 సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రామ్ చరణ్ సామాజిక మాధ్యమాల్లో తన సంతోషాన్ని పంచుకున్నారు. "ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. నా ప్రియమైన సుకుమార్ గారితో మళ్లీ కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. #RC17 ప్రయాణం మొదలైంది" అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో నెమలి పించం నేపథ్యంతో రామ్ చరణ్ ముఖచిత్రాన్ని డిజైన్ చేశారు. అయితే సినిమా కథాంశం ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ వెనుక సుకుమార్ పడిన శ్రమను గుర్తుచేసుకుంటూ ఆయన భార్య తబిత ఒక ప్రత్యేక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
నిద్రలేని రాత్రులు గడిపారు.. భార్య తబిత భావోద్వేగ పోస్ట్
{{/usCountry}}ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో నెమలి పించం నేపథ్యంతో రామ్ చరణ్ ముఖచిత్రాన్ని డిజైన్ చేశారు. అయితే సినిమా కథాంశం ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ వెనుక సుకుమార్ పడిన శ్రమను గుర్తుచేసుకుంటూ ఆయన భార్య తబిత ఒక ప్రత్యేక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
నిద్రలేని రాత్రులు గడిపారు.. భార్య తబిత భావోద్వేగ పోస్ట్
{{/usCountry}}"ఒక భార్యగా ఈ ప్రాజెక్ట్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా, ఉత్సాహంగా ఉంది. ఈ కథను సిద్ధం చేయడానికి సుక్కు ఎన్ని గంటలు నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంతగా తపించారో నేను దగ్గరుండి చూశాను. ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ కుదరడంతో అంచనాలు మరింత పెరిగాయి" అని తబితా రాసుకొచ్చారు.
ఈ వీడియోలో అభిమానులను ఉద్దేశించి సుకుమార్ 'యూ కెన్ ఇమాజిన్' (మీరే ఊహించుకోండి) అని అంటున్న క్లిప్పింగ్‌ను, రజనీకాంత్ 'జైలర్ 2' పాటను నేపథ్యంగా జోడించారు. కాగా, 2018లో వచ్చిన 'రంగస్థలం' నాన్-బాహుబలి రికార్డులను తిరగరాసి ఒక క్లాసిక్‌గా నిలిచింది.
‘పెద్ది’ తర్వాత చరణ్.. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్!
ఆ తర్వాత సుకుమార్ ఐదేళ్ల పాటు 'పుష్ప' ప్రాంచైజీకే పూర్తి సమయం కేటాయించారు. 2024లో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' చిత్రం తర్వాత సంతకం చేసిన భారీ ప్రాజెక్ట్ ఇది. మరోవైపు నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా రూపొందుతున్న 'ది ఇండియా హౌస్' చిత్రానికి రామ్ చరణ్ నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరిస్తున్నారు.